AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: భారత్ విజయలక్ష్యం 107 పరుగులు.. దక్షిణాఫ్రికా పరువు నిలిపిన మహారాజ్..

భారత్ తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్స్ ఘోరంగా విఫలమయ్యారు. మూడు ఓవర్లు పూర్తికాకుండానే ఐదు వికెట్లను కోల్పోయిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు..

IND vs SA: భారత్ విజయలక్ష్యం 107 పరుగులు.. దక్షిణాఫ్రికా పరువు నిలిపిన మహారాజ్..
Ind Vs Sa 1st T20 Match
Amarnadh Daneti
|

Updated on: Sep 28, 2022 | 8:59 PM

Share

భారత్ తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్స్ ఘోరంగా విఫలమయ్యారు. మూడు ఓవర్లు పూర్తికాకుండానే ఐదు వికెట్లను కోల్పోయిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. దీంతో భారత్ కు 107 పరుగులు విజయ లక్ష్యాన్ని నిర్ధేశించింది. అర్ష్ దీప్ సింగ్, దీపక్ చహర్ దక్షిణాఫ్రికాను గట్టి దెబ్బతీశారు. వారిద్దరితో పాటు హర్షల్ పటేల్ కూడా రెండు వికెట్లు తీసుకుని బౌలింగ్ లో అదరగొట్టాడు. కేవలం ఒక ఓవర్ లోనే అర్ష్ దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్ వేసిన మొదటి ఓవర్లో ఒక వికెట్ మూడో ఓవర్ లో మరో వికెట్ తీసుకుని మొత్తంగా రెండు వికెట్లు తీసుకున్నాడు. అక్షర్ పటేల్ ఒక వికెట్ తీసుకున్నాడు. రవించంద్ర అశ్విన్ వికెట్లు తీసుకోకపోయినా పొదుపుగా బౌలింగ్ వేశాడు. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చారు. దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్ వరుసగా విఫలమయ్యారు. క్వింటన్ డికాక్ 1, కెప్టెన్ బవుమా 0, రిలీ రోసౌ 0, డేవిడ్ మిల్లర్ 0, స్టబ్స్ 0, ఇలా వరుస పెట్టి అవుటవ్వడంతో దక్షిణాఫ్రికా పవర్ ప్లే పూర్తికాకుండానే పీకలోతు కష్టాలో పడింది.

భారత్ బౌలర్లు టీమిండియాకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అర్ష్ దీప్ పై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ తాను వేసిన మొదటి ఒవర్లోనే మూడు వికెట్లు అందించాడు. దక్షిణాఫ్రికాకు నిజానికి మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికి టాప్ బ్యాట్స్ మెన్స్ విఫలమయ్యారు. డికాక్, బవుమా, డేవిడ్ మిల్లర్ కేవలం 1, 0,0 పరుగులకే ఔటయ్యారు. 9 పరుగులకే ఐదు వికెట్లు పడటంతో ఆతర్వాత దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్స్ మార్కరామ్, పర్నీల్ ఆచీతూచీ ఆడుతూ దక్షిణాఫ్రికా స్కోర్ వంద దాటించడానికి కృషి చేశారు.

మార్క్ రామ్ 24 బంతుల్లో 25 పరుగులు చేయగా, పర్నీల్ 37 బంతుల్లో 24 పరుగులు చేశాడు. నిలకడగా ఆడుతున్న పర్నీల్ ను 15.5 ఓవర్ల వద్ద అక్షర పటేల్ బౌలింగ్ లో సూర్య కుమార్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇక కేశవ్ మహారాజ్ 35 బంతుల్లో 41 పరుగులు చేసి జట్టు 106 పరుగుల స్కోర్ చేయడానికి కారణమయ్యాడు. 2.3 ఓవర్లలో 9 పరుగులకే ఐదు వికెట్లు పడిపోయిన తర్వాత మార్క్ రామ్ , పర్నీల్ నెమ్మదిగా ఆడుతూ పవర్ ప్లే పూర్తయ్యేటప్పటికి వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..

Follow Us
బద్ధలైన అగ్నిపర్వతం.. 1300 అడుగుల ఎత్తుకు ఎగసిపడ్డ లావా
బద్ధలైన అగ్నిపర్వతం.. 1300 అడుగుల ఎత్తుకు ఎగసిపడ్డ లావా
బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా..రోహిత్ రికార్డుపై హార్దిక్ కన్ను
బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా..రోహిత్ రికార్డుపై హార్దిక్ కన్ను
జనసేన ఎమ్మెల్యే కాంట్రవర్సీ.. మరో వీడియో రిలీజ్ చేసిన హర్షవీణ!
జనసేన ఎమ్మెల్యే కాంట్రవర్సీ.. మరో వీడియో రిలీజ్ చేసిన హర్షవీణ!
AI రంగంలో భారీ పెట్టుబడులకు సిద్ధమైన అదానీ గ్రూప్!
AI రంగంలో భారీ పెట్టుబడులకు సిద్ధమైన అదానీ గ్రూప్!
ఈ చబ్బీ బ్యూటీ గుర్తుందా? ఇప్పడేంటిలా మారిపోయింది?
ఈ చబ్బీ బ్యూటీ గుర్తుందా? ఇప్పడేంటిలా మారిపోయింది?
సాహిబ్‌జాదా ఫర్హాన్ ఊచకోత.. సూపర్‌-8లోకి పాక్ గ్రాండ్ ఎంట్రీ
సాహిబ్‌జాదా ఫర్హాన్ ఊచకోత.. సూపర్‌-8లోకి పాక్ గ్రాండ్ ఎంట్రీ
బ్యాడ్‌న్యూస్‌.. పెరగనున్న చక్కెర ధరలు!
బ్యాడ్‌న్యూస్‌.. పెరగనున్న చక్కెర ధరలు!
బాబర్ కెరీర్ ముగిసినట్టేనా?పాక్ నిర్ణయంతో ఫ్యాన్స్ ఫుల్ సీరియస్
బాబర్ కెరీర్ ముగిసినట్టేనా?పాక్ నిర్ణయంతో ఫ్యాన్స్ ఫుల్ సీరియస్
మహిళలకు బిగ్‌ అలర్ట్.. ఆధార్ కాదు.. ఇకపై ఈ కార్డ్స్ ఉంటేనే ఆర్టీస
మహిళలకు బిగ్‌ అలర్ట్.. ఆధార్ కాదు.. ఇకపై ఈ కార్డ్స్ ఉంటేనే ఆర్టీస
ధనవంతులను చేసిన స్టాక్‌.. 1 లక్ష రూపాయలు రూ.50 లక్షలుగా మారింది!
ధనవంతులను చేసిన స్టాక్‌.. 1 లక్ష రూపాయలు రూ.50 లక్షలుగా మారింది!