IND vs BAN: బంగ్లాపై టీమ్‌ ఇండియా గ్రాండ్‌ విక్టరీ.. టీ20 సిరీస్‌ కైవసం..

ఢిల్లీ వేదికగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ టాస్‌ గెలిచి టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అలాగే పవర్‌ప్లేలో, భారత జట్టు అభిషేక్ శర్మ, రింకు సింగ్ తో పాపటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ల వికెట్లను కోల్పోయింది. దీంతో టీమిండియా తక్కువ స్కోర్‌కే పరిమితం అవుతుందని...

IND vs BAN: బంగ్లాపై టీమ్‌ ఇండియా గ్రాండ్‌ విక్టరీ.. టీ20 సిరీస్‌ కైవసం..
Ind Vs Ban T20
Follow us

|

Updated on: Oct 09, 2024 | 10:45 PM

టీమిండియా మరో గ్రాండ్‌ విక్టరీని సొంతం చేసుకుంది. టెస్ట్ సిరీస్‌ తర్వాత ఇప్పుడు టీ20 సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. ఢిల్లీ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లోనూ టీమిండియా సులువుగా విజయం సాధించింది. ఈ విజయంతో టీ20 సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 221 పరుగుల భారీ స్కోరు చేయగా, బంగ్లాదేశ్ జట్టు లక్ష్యానికి చాలా వెనుకబడింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 86 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఢిల్లీ వేదికగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ టాస్‌ గెలిచి టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అలాగే పవర్‌ప్లేలో, భారత జట్టు అభిషేక్ శర్మ, రింకు సింగ్ తో పాపటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ల వికెట్లను కోల్పోయింది. దీంతో టీమిండియా తక్కువ స్కోర్‌కే పరిమితం అవుతుందని అంతా భావించారు. అయితే అనంతరం నితీష్ రెడ్డి, రింకూ సింగ్ బంగ్లాదేశ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. నితీష్ రెడ్డి 28 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా, రింకూ 27 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించి టీమిండియాకు మంచి స్కోర్‌ను అందించారు. నితీష్ రెడ్డి అద్భుతంగా బ్యాటింగ్ చేసి 7 సిక్సర్లు బాదాడు. 34 బంతుల్లో 74 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఆటగాడు రింకూతో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రింకూ సింగ్ కూడా 26 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా బంగ్లాదేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

ఇక 222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు తొలి నుంచి తడబడింది. అర్ష్‌దీప్ సింగ్ ఎమాన్‌ను బౌల్డ్ చేయడంతో బంగ్లా వికెట్ల పతనం మొదలైంది. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ వికెట్ తీశాడు. వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 19 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అభిషేక్ శర్మ, మయాంక్ యాదవ్, ర్యాన్ పరాగ్ తలో వికెట్ తీశారు. నితీష్ రెడ్డి 2 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మదుల్లా మినహా ఎవరూ క్రీజులో స్థిరపడలేదు. లిటన్ దాస్, శాంటో, మెహదీ హసన్ ఆరంభం లభించినా పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయారు. చివరికి టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

అకౌంట్లో జీరో బ్యాలెన్స్‌.. ఖాతాదారులు గగ్గోలు.! వీడియో..
అకౌంట్లో జీరో బ్యాలెన్స్‌.. ఖాతాదారులు గగ్గోలు.! వీడియో..
ఈ ఇరాన్‌ దీవిపై దాడి జరిగితే పెట్రో సంక్షోభమే.! వీడియో..
ఈ ఇరాన్‌ దీవిపై దాడి జరిగితే పెట్రో సంక్షోభమే.! వీడియో..
ఏరులై పారిన డిజీల్‌.. ఎగబడ్డ జనం.! తోడుకున్నోడికి తోడుకున్నంత..
ఏరులై పారిన డిజీల్‌.. ఎగబడ్డ జనం.! తోడుకున్నోడికి తోడుకున్నంత..
వామ్మో.. 1 బీహెచ్‌కే ఇంటి రెంట్‌ రూ.45 వేలా.! షాక్‌లో జనాలు.!
వామ్మో.. 1 బీహెచ్‌కే ఇంటి రెంట్‌ రూ.45 వేలా.! షాక్‌లో జనాలు.!
జస్ట్‌ 100 మీ.వెళితే ఒడ్డుకు చేరేవారు.. ఇంతలోనే బోటు బోల్తా.!
జస్ట్‌ 100 మీ.వెళితే ఒడ్డుకు చేరేవారు.. ఇంతలోనే బోటు బోల్తా.!
కారులో దూరిన పాము.. ఎక్కడ దాక్కుందో చూడండి..షాకింగ్ వీడియో
కారులో దూరిన పాము.. ఎక్కడ దాక్కుందో చూడండి..షాకింగ్ వీడియో
ప్రేమా.? తెగింపా.? తెర వెనుక నిజాలు.! దువ్వాడ శ్రీను - మాధురి..
ప్రేమా.? తెగింపా.? తెర వెనుక నిజాలు.! దువ్వాడ శ్రీను - మాధురి..
నిండు ప్రాణాన్ని కాపాడిన పోలీసు.. ఏం జరిగిందంటే ??
నిండు ప్రాణాన్ని కాపాడిన పోలీసు.. ఏం జరిగిందంటే ??
నవరాత్రుల్లో ఉపవాసం చేస్తున్నారా ?? ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా
నవరాత్రుల్లో ఉపవాసం చేస్తున్నారా ?? ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా
కోర్టులో వాదించి గెలిచింది.. తండ్రికి లివర్ దానం చేసిన బాలిక
కోర్టులో వాదించి గెలిచింది.. తండ్రికి లివర్ దానం చేసిన బాలిక