ఆడ ధోనీ ఉంటే..ఈడ నేనుంటా.. 2023 ప్రపంచ కప్‌‌పై డివిలియర్స్‌

ముంబయి: దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్‌..టీమిండియా ఆటగాళ్లతో ఉన్న అనుబంధాన్ని ఇటీవల ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.  2023 ప్రపంచకప్‌లో ఆడతారా అన్న ప్రశ్నకు ఫన్నీ సమాధానం ఇచ్చాడు. 2023 నాటికి తన వయసు 39 ఏళ్లకి చేరుకుంటుందట. అప్పటికి మహేంద్ర సింగ్‌ ధోనీ టీమిండియా జట్టులో ఉంటే నేను కచ్చితంగా ఆడతాను అని నవ్వుతూ సమాధామిచ్చాడు. ‘ఏమో..నేనప్పటికీ ఫిట్‌గా ఉంటానేమో. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే ప్రపంచ కప్‌లో ఆడాలని నాక్కూడా ఉంది. కానీ […]

ఆడ ధోనీ ఉంటే..ఈడ నేనుంటా.. 2023 ప్రపంచ కప్‌‌పై డివిలియర్స్‌
Follow us

|

Updated on: May 18, 2019 | 8:00 PM

ముంబయి: దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్‌..టీమిండియా ఆటగాళ్లతో ఉన్న అనుబంధాన్ని ఇటీవల ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.  2023 ప్రపంచకప్‌లో ఆడతారా అన్న ప్రశ్నకు ఫన్నీ సమాధానం ఇచ్చాడు.

2023 నాటికి తన వయసు 39 ఏళ్లకి చేరుకుంటుందట. అప్పటికి మహేంద్ర సింగ్‌ ధోనీ టీమిండియా జట్టులో ఉంటే నేను కచ్చితంగా ఆడతాను అని నవ్వుతూ సమాధామిచ్చాడు. ‘ఏమో..నేనప్పటికీ ఫిట్‌గా ఉంటానేమో. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే ప్రపంచ కప్‌లో ఆడాలని నాక్కూడా ఉంది. కానీ నేను రిటైర్‌ అయిపోయాను. కాబట్టి ఇది చాలా సున్నితమైన విషయం. నేను గతేడాది రిటైర్‌మెంట్‌ ప్రకటించడానికి ఎన్నో అంశాలు దోహదం చేశాయి. చాలా కష్టంగా అనిపించింది. కానీ తప్పలేదు’ అని అన్నాడు.