PV Sindhu: మరో అరుదైన ఘనత సాధించిన పీవీ సింధు.. ఫోర్బ్స్‌ టాప్‌ 25 లిస్టులో ప్లేస్‌.. ఈ ఏడాది ఎంత సంపాదించిందంటే?

|

Dec 24, 2022 | 1:12 PM

ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్‌ విడుదల చేసిన టాప్ 25 మహిళా క్రీడాకారిణుల్లో పీవీ సింధు స్థానం దక్కించుకుంది. అత్యధికంగా ఆర్జిస్తోన్న టాప్‌-25 మహిళా అథ్లెట్ల జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేయగా.. ఆ జాబితాలో సింధు 12వ స్థానంలో నిలిచింది.

PV Sindhu: మరో అరుదైన ఘనత సాధించిన పీవీ సింధు.. ఫోర్బ్స్‌ టాప్‌ 25 లిస్టులో ప్లేస్‌.. ఈ ఏడాది ఎంత సంపాదించిందంటే?
Pv Sindhu
Follow us on

పీవీ సింధు.. క్రికెట్‌ను అమితంగా ఆరాధించే మన దేశంలో బ్యాడ్మింటన్‌ మ్యాచ్‌లను కూడా చూసేలా చేసిన హైదరాబాదీ క్రీడాకారిణి. ఒలింపిక్స్‌ మెడల్‌, వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌, కామన్వెల్త్‌, ఆసియా గేమ్స్‌.. ఇలా పలు అంతర్జాతీయ టోర్నమెంట్లలో పతకాల వర్షం కురిపిస్తోన్న ఈ స్టార్‌ షట్లర్‌ నేటి తరం అమ్మాయిలకు ఎంతో స్ఫూర్తిదాయకం అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. తాజాగా ఈ తెలుగు తేజం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్‌ విడుదల చేసిన టాప్ 25 మహిళా క్రీడాకారిణుల్లో పీవీ సింధు స్థానం దక్కించుకుంది. అత్యధికంగా ఆర్జిస్తోన్న టాప్‌-25 మహిళా అథ్లెట్ల జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేయగా.. ఆ జాబితాలో సింధు 12వ స్థానంలో నిలిచింది. కాగా ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో సిల్వర్‌, కామ‌న్‌వెల్త్‌గేమ్స్ సింగ్సిల్‌లో బంగారు పతకం, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో రజత పతకాలు గెల్చుకుంది బ్యాడ్మింటన్‌ క్వీన్‌. ఈక్రమంలో స్పాన్సర్‌ షిప్‌లు, ప్రకటనల ద్వారా సింధు ఈ ఏడాది సుమారు ఏడు మిలియ‌న్ల డాల‌ర్లు ( భారతీయ కరెన్సీలో సుమారు 58 కోట్లు)కు పైగా అర్జించిన‌ట్లు ఫోర్బ్స్‌ తెలిపింది.

కాగా ఈ జాబితాలో భారత్‌ నుంచి పీవీ సింధు ఒక్కరే చోటు సంపాదించడం గమనార్హం. ఇక జ‌పాన్‌కు చెందిన టెన్నిస్ స్టార్ ప్లేయ‌ర్ న‌వోమీ ఒసాకా రూ. 423 కోట్ల ఆదాయంతో తొలి స్థానంలో ఉంది. ఒసాకా ఈ జాబితాలో టాప్‌ లో నిలవడం ఇది వ‌రుస‌గా మూడోసారి. కాగా ఈసారి ఫోర్బ్స్‌ జాబితాలో ఎక్కువ శాతం మంది టెన్నిస్ ప్లేయ‌ర్లే ఉండడం గమనార్హం. టాప్ 10 లిస్టులో ఒసాకాతో పాటు సెరీనా, ఎమ్మా ర్యాడుకాన‌, ఇగా స్వియాటెక్‌, వీన‌స్‌, కోకో గౌఫ్‌, జెస్సికా పెగులా తదితరులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..