ఫాంలో ఉన్న ప్లేయర్‌పై మాత్రం వేటు.. BCCIపై విమర్శలు గుప్పించిన భారత మాజీ ప్లేయర్..
చిట్టగాంగ్ టెస్టుకు ముందు, సిడ్నీలో ఆస్ట్రేలియాపై కుల్దీప్ చివరిసారి ఐదు వికెట్లు తీశాడు. ఓవర్సీస్ పరిస్థితుల్లో అతను భారత నంబర్ 1 స్పిన్నర్‌గా ఉండాల్సి ఉంది. కానీ
India vs Bangladesh 2nd Test: భారత జట్టు మేనేజ్‌మెంట్‌పై భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తీవ్ర విమర్శలు గుప్పించాడు. కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు తీయడం మానేయాలంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో 5 వికెట్లతో సహా మొత్తం 8 వికెట్లు పడగొట్టి, సత్తా చాటాడు. అలాగే కుల్దీప్ యాదవ్ మొదటి ఇన్నింగ్స్‌లో 40 పరుగుల కీలక ఇన్నింగ్స్ కూడా ఆడాడు.
ఈ కారణంగా, అతను చిట్టగాంగ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును కూడా పొందాడు. అయితే, ఇలాంటి అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత కూడా కుల్దీప్ యాదవ్‌కు రెండవ టెస్ట్‌లో స్థానం లభించలేదు. హర్భజన్ సింగ్ చాలా కోపంగా కనిపించడానికి ఇదే కారణంగా నిలిచింది. ఈ మేరకు జట్టు మేనేజ్‌మెంట్‌ను తీవ్రంగా విమర్శించారు. పీటీఐతో మాట్లాడుతూ, హర్భజన్ తీవ్ర విమర్శలు చేశాడు. ‘ఇప్పుడు కుల్దీప్ ఐదు వికెట్లు తీయడం మానేయాలని నేను భావిస్తున్నాను. అతను వరుసగా రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడగలడని ఎవరికి తెలుసు’ అంటూ హర్భజన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
“చిట్టగాంగ్ టెస్టుకు ముందు, సిడ్నీలో ఆస్ట్రేలియాపై కుల్దీప్ చివరిసారి ఐదు వికెట్లు తీశాడు. ఓవర్సీస్ పరిస్థితుల్లో అతను భారత నంబర్ 1 స్పిన్నర్‌గా ఉండాల్సి ఉంది. కానీ, మరో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు రెండేళ్లు వేచి ఉండాల్సి వచ్చింది. దాదాపు రెండేళ్ల తర్వాత ఇప్పుడు టెస్టు మ్యాచ్ ఆడిన అతను మళ్లీ డ్రాప్ అయ్యాడు. దీని వెనుక ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. కుల్దీప్ యాదవ్‌కు భద్రత లేదు” అంటూ హర్భజన్ సింగ్ విమర్శలు చేశాడు.
అయితే, ఈ క్రమంలో కొందరి పేర్లను చెప్పకుండా కామెంట్స్ చేశాడు. కొందరికి చాలా సంవత్సరాలు వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి.. అయితే కుల్దీప్ కేవలం ఐదు రోజుల్లోనే టీమిండియా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందంటూ ఆయన చెప్పుకొచ్చాడు.
“భారత క్రికెట్‌లో భద్రత అనేది కేవలం బయటకు కనిపించదు. దాని గురించి ఎవరూ మాట్లాడరు. ఏ ఆటగాడి పేరు చెప్పనక్కర్లేదు. కానీ, భారత టెస్టు క్రికెట్‌లో ఐదేళ్లపాటు భద్రత పొందిన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే కుల్దీప్‌కి మాత్రం ఆ భద్రత కేవలం ఐదు రోజులే. 8 వికెట్లు తీసిన తర్వాత కూడా ఎవరైనా డ్రాప్ చేయగలిగితే, జట్టులో ఎవరైనా సురక్షితంగా ఎలా భావిస్తారు. టీమ్ మేనేజ్‌మెంట్ ఆటగాడిని ఇలా భయపెడితే.. నిర్భయంగా క్రికెట్ ఎలా ఆడగలడు?” అంటూ విమర్శలు చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..