తెలుగు తేజానికి గవర్నర్ సన్మానం
భారత స్టార్ షట్లర్, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధూకి రాజ్ భవన్‌లో తెలంగాణ గవర్నర్ నరసింహన్ ఘనంగా సన్మానం చేశారు. మన సత్తా ఏంటో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రపంచానికి చాటిందని నరసింహన్ అన్నారు. ప్రపంచ ఛాంపియన్ షిప్ సాధించిన తెలుగు తేజాన్ని ఆయన అభినందించారు. క్రీడల్లో ప్రతి ఒక్కరికి సింధు రోల్ మోడల్‌గా నిలిచిందని కొనియాడారు. 2020 ఒలంపిక్స్‌లో సింధు గోల్డ్ మెడల్ సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. […]

భారత స్టార్ షట్లర్, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధూకి రాజ్ భవన్‌లో తెలంగాణ గవర్నర్ నరసింహన్ ఘనంగా సన్మానం చేశారు. మన సత్తా ఏంటో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రపంచానికి చాటిందని నరసింహన్ అన్నారు. ప్రపంచ ఛాంపియన్ షిప్ సాధించిన తెలుగు తేజాన్ని ఆయన అభినందించారు. క్రీడల్లో ప్రతి ఒక్కరికి సింధు రోల్ మోడల్‌గా నిలిచిందని కొనియాడారు. 2020 ఒలంపిక్స్‌లో సింధు గోల్డ్ మెడల్ సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా, గవర్నర్ చేతుల మీదుగా తనకు సన్మానం జరగడం ఆనందంగా ఉందని సింధు చెప్పింది. తన విజయానికి కారణమైన వారందరికీ తాను ధన్యవాదాలు తెలిపింది. భవిష్యత్తులో మరెన్నో గోల్డ్ మెడల్స్ సాధిస్తానని సింధు పేర్కొంది.



