38 పరుగులకే కుప్పకూలిన ఐర్లాండ్… ఇంగ్లండ్ విజయం!

లార్డ్స్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 85 పరుగులకే ఆలౌట్ అయిన ఇంగ్లాండ్ మలి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్‌ను కేవలం 38 పరుగులకే ఆలౌట్ చేసి విజయాన్ని అందుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో 207 పరుగులు చేసి.. 122 పరుగుల ఆధిక్యం సాధించిన ఐర్లాండ్.. రెండో ఇన్నింగ్స్‌లో 182 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగింది. కానీ ఇంగ్లిష్ పేసర్లు క్రిస్ వోక్స్, స్టువర్ట్ బ్రాడ్ దెబ్బకు విలవిల్లాడింది. వోక్స్ […]

38 పరుగులకే కుప్పకూలిన ఐర్లాండ్... ఇంగ్లండ్ విజయం!
TV9 Telugu Digital Desk

| Edited By:

Jul 27, 2019 | 12:06 AM

లార్డ్స్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 85 పరుగులకే ఆలౌట్ అయిన ఇంగ్లాండ్ మలి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్‌ను కేవలం 38 పరుగులకే ఆలౌట్ చేసి విజయాన్ని అందుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో 207 పరుగులు చేసి.. 122 పరుగుల ఆధిక్యం సాధించిన ఐర్లాండ్.. రెండో ఇన్నింగ్స్‌లో 182 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగింది. కానీ ఇంగ్లిష్ పేసర్లు క్రిస్ వోక్స్, స్టువర్ట్ బ్రాడ్ దెబ్బకు విలవిల్లాడింది. వోక్స్ ఆరు వికెట్లు తీయగా.. బ్రాడ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఐర్లాండ్ 15.4 ఓవర్లలో కేవలం 38 రన్స్‌కే కుప్పకూలింది. ఐర్లాండ్ జట్టులో ఓపెనర్ జేమ్స్ మెక్‌కల్లమ్ (11) ఒక్కడే రెండంకెల స్కోర్ చేయడం గమనార్హం. పేసర్లు సత్తా చాటడంతో ఇంగ్లాండ్ 143 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల వికెట్ కీపర్లు.. జానీ బెయిర్‌స్టో, గ్యారీ విల్సన్ ఇద్దరూ రెండు ఇన్నింగ్స్‌లలోనూ డకౌటయ్యారు. ఇలా జరగడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. లార్డ్స్‌లో నమోదైన అత్యల్ప టెస్టు ఇన్నింగ్స్ స్కోరు ఐర్లాండ్ చేసిన 38 పరుగులే కావడం గమనార్హం. 1932 తర్వాత టెస్టు క్రికెట్లో నమోదైన అత్యల్ప స్కోరు కూడా ఐర్లాండ్‌దే.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu