ప్రపంచకప్‌కు తుది జట్టును ప్రకటించిన ఇంగ్లండ్

ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తున్నఇంగ్లండ్ తాజాగా తమ తుది జట్టును ప్రకటించింది. గత నెలలో ప్రకటించిన ప్రాథమిక జట్టులో మూడు మార్పులు చేసింది. ఆశ్చర్యకరంగా ఇప్పటి వరకు మూడు వన్డేలు మాత్రమే ఆడిన బార్బడోస్ ఆల్‌రౌండర్ జోఫ్రా ఆర్చర్‌కు తుది జట్టులో చోటు కల్పించింది. ఈ నెలలోనే వన్డేల్లోకి అరంగేట్రం చేసిన ఆర్చర్ ఇప్పటి వరకు మూడు వన్డేలే ఆడి మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఆల్‌రౌండర్ లియామ్ డాసన్, ఓపెనర్ జేమ్స్ విన్స్‌కు ప్రపంచకప్‌ జట్టులో చోటు […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:15 pm, Tue, 21 May 19
ప్రపంచకప్‌కు తుది జట్టును ప్రకటించిన ఇంగ్లండ్

ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తున్నఇంగ్లండ్ తాజాగా తమ తుది జట్టును ప్రకటించింది. గత నెలలో ప్రకటించిన ప్రాథమిక జట్టులో మూడు మార్పులు చేసింది. ఆశ్చర్యకరంగా ఇప్పటి వరకు మూడు వన్డేలు మాత్రమే ఆడిన బార్బడోస్ ఆల్‌రౌండర్ జోఫ్రా ఆర్చర్‌కు తుది జట్టులో చోటు కల్పించింది. ఈ నెలలోనే వన్డేల్లోకి అరంగేట్రం చేసిన ఆర్చర్ ఇప్పటి వరకు మూడు వన్డేలే ఆడి మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఆల్‌రౌండర్ లియామ్ డాసన్, ఓపెనర్ జేమ్స్ విన్స్‌కు ప్రపంచకప్‌ జట్టులో చోటు కల్పించింది.

ఇంగ్లండ్ జట్టు: ఇయాన్ మోర్గాన్, మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జానీ బెయిర్‌స్ట్రో, జోస్ బట్లర్, టామ్ కర్రన్, లియామ్ డాసన్, లియామ్ ప్లంకెట్, అదిల్ రషీద్, జో రూట్, జాసన్ రాయ్, బెన్‌స్టోక్స్, జేమ్స్ విన్స్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.