ఎవర్రా మీరంతా.! 120 బంతుల్లో 344 పరుగులు.. 33 బంతుల్లో ఊహకందని ఊచకోత..

|

Oct 23, 2024 | 9:01 PM

ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌ రీజినల్ క్వాలిఫయర్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ గాంబియా, జింబాబ్వే జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 344 పరుగులు చేసి టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ప్రపంచ రికార్డును సాధించింది.

ఎవర్రా మీరంతా.! 120 బంతుల్లో 344 పరుగులు.. 33 బంతుల్లో ఊహకందని ఊచకోత..
Viral
Follow us on

ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌ రీజినల్ క్వాలిఫయర్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ గాంబియా, జింబాబ్వే జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 344 పరుగులు చేసి టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ప్రపంచ రికార్డును సాధించింది. అంతకుముందు మంగోలియాపై 314 పరుగులు చేసిన నేపాల్ పేరిట ఈ రికార్డు నమోదైన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా 297 పరుగులు చేసి ఈ జాబితాలో 2వ స్థానానికి చేరుకుంది.

జింబాబ్వేకు పేలుడు ఆరంభం..

తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వేకు శుభారంభం లభించింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ కేవలం 26 బంతుల్లో 50 పరుగులతో ఇన్నింగ్స్ ఆడగా, తాడివానాషే మారుమణి కూడా కేవలం 19 బంతుల్లో 62 పరుగులు చేశాడు. దీంతో వీరిద్దరూ 5.4 ఓవర్లలో 98 పరుగులు సాధించారు. ఆపై నాలుగో నంబర్‌లో క్రీజులోకి వచ్చిన జింబాబ్వేకు అత్యంత అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ సికందర్ రజా బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ గాంబియా బౌలర్లకు చెమటలు పట్టించాడు.

40 బంతుల్లో 141 పరుగుల భాగస్వామ్యం

సికందర్ కేవలం 33 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ పేలుడు సెంచరీతో రోహిత్ శర్మ, దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ రికార్డును సమం చేశాడు. వీరిద్దరూ గతంలో 35 బంతుల్లోనే సెంచరీలు చేసి ఈ రికార్డు సృష్టించారు. రజా చివరికి క్లైవ్ మదాండేతో కలిసి 40 బంతుల్లో 141 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో జట్టును 20 ఓవర్లలో 344 పరుగుల ప్రపంచ రికార్డు స్కోరుకు తీసుకెళ్లాడు.

ఇవి కూడా చదవండి

అత్యధిక సిక్సర్లు బాది సరికొత్త రికార్డు

ఈ ఇన్నింగ్స్‌లో జింబాబ్వే బ్యాట్స్‌మెన్ సిక్సర్ల వర్షం కురిపించారు. కెప్టెన్ సికందర్ రజా తన బ్యాట్‌లో అత్యధికంగా 15 సిక్సర్లు, 7 ఫోర్లు బాదాడు. 17 బంతుల్లో 55 పరుగులు చేసిన మదండే 5 సిక్సర్లు బాదగా, మారుమణి 4 సిక్సర్లు బాదాడు. ఓవరాల్‌గా ఈ ఇన్నింగ్స్‌లో జింబాబ్వే 27 సిక్సర్లు కొట్టి నేపాల్ (26) ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది.

గాంబియా జట్టు 54 పరుగులకు ఆలౌట్ అయింది

జింబాబ్వే ఇచ్చిన భారీ లక్ష్యాన్ని ఛేదించిన గాంబియా జట్టు 14.4 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 54 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 290 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. జట్టు తరుపున 10వ ర్యాంక్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఆండ్రీ జార్జ్ అత్యధికంగా 12 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్‌లందరూ కేవలం సింగిల్ ఫిగర్స్‌కే అలసిపోయారు.

ఇది చదవండి: టీ20లకే మొనగాడురా.! 12 ఫోర్లు, 5 సిక్సర్లతో కావ్యపాప ప్లేయర్ ఊచకోత

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..