T20 World Cup: ట్రోఫీ పట్టాలంటే.. రోహిత్ సైన్యం ఇలా ఉండాల్సిందే: ప్రపంచ ఛాంపియన్ కీలక సూచన

India T20 World Cup 2024 Squad: వెస్టిండీస్, USA సంయుక్తంగా నిర్వహించే T20 ప్రపంచ కప్ జూన్ 2 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే, ఫైనల్ మ్యాచ్ జూన్ 29న జరగనుంది. తొలి దశలో భారత జట్టు మొత్తం 4 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే భారత జట్టు సూపర్-8 దశకు చేరుకుంటుంది. ఆ తర్వాత సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

T20 World Cup: ట్రోఫీ పట్టాలంటే.. రోహిత్ సైన్యం ఇలా ఉండాల్సిందే: ప్రపంచ ఛాంపియన్ కీలక సూచన
India T20 World Cup 2024
Follow us
Venkata Chari

|

Updated on: May 28, 2024 | 12:29 PM

T20 World Cup 2024: T20 ప్రపంచ కప్ ప్రారంభానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే 9వ ఎడిషన్ పొట్టి ప్రపంచకప్ మొదటి మ్యాచ్‌లో USA, కెనడా జట్లు తలపడనున్నాయి. జూన్ 5న ఐర్లాండ్‌తో టీ20 ప్రపంచకప్‌లో టీం ఇండియా తన ప్రచారాన్ని ప్రారంభించనుంది.

ఈ క్యాంపెయిన్‌లోని 2వ మ్యాచ్‌లో భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. తద్వారా తొలి మ్యాచ్‌లో టీమిండియా గట్టిపోటీతో బరిలోకి దిగడం ఖాయం. అయితే, అంతకు ముందు భారత జట్టులోని ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎలా ఉండాలో మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.

యువరాజ్ సింగ్ ప్రకారం, భారత జట్టుకు మంచి ప్లేయర్ ఎంపికలు ఉన్నాయి. తద్వారా అత్యుత్తమ ఆటతీరును ఏర్పాటు చేసుకోవచ్చు. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఇక్కడ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాలి. అలాగే, విరాట్ కోహ్లీ మూడో నంబర్‌లో ఆడటం మంచిది.

సంజూ శాంసన్ స్థానంలో రిషబ్ పంత్‌ను వికెట్ కీపర్‌గా తీసుకోవడం మంచిది. ఎందుకంటే, ఏ దశలోనూ మ్యాచ్‌ వేగాన్ని మార్చే సత్తా పంత్‌కు ఉంది. సంజూ శాంసన్ కంటే రిషబ్ పంత్ నా మొదటి ఛాయిస్ అని యువరాజ్ సింగ్ అన్నాడు.

అలాగే హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలను ఆల్ రౌండర్లుగా ఆడించాలని యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. కాగా, ప్లేయింగ్ ఎలెవన్‌లో రవీంద్ర జడేజాకు చోటు దక్కలేదు. బదులుగా, యుజ్వేంద్ర చాహల్‌ను పూర్తి స్థాయి స్పిన్నర్‌గా ఆడాలని తెలిపాడు. దీని ప్రకారం యువరాజ్ సింగ్ పేర్కొన్న టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ పేర్కొన్నాడు. అదెలా ఉందో చూద్దాం..

యువరాజ్ సూచింని టీమిండియా ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్.

భారత టీ20 ప్రపంచకప్ 2024 జట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, కుల్‌దీప్ యాదాద్రి చావల్, మహ్మద్ సిరాజ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..