- Telugu News Sports News Cricket news Young Indian Player Sarfaraz Khan Hits Half Centuries Against England 3rd test in Rajkot
Sarfaraz Khan: డెబ్యూలో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు.. రికార్డు సృష్టించిన సర్ఫరాజ్ ఖాన్.. లిస్టులో ఎవరున్నారంటే?
Sarfaraz Khan: ఈ మ్యాచ్‌లో 5వ స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీని ద్వారా, తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో బ్యాక్ టు బ్యాక్ 50+ స్కోర్లు సాధించిన ప్రత్యేక సాధకుల జాబితాలో సర్ఫరాజ్ కూడా చేరాడు. అంతకుముందు సర్ఫరాజ్ ఖాన్ తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు చేసి, రనౌట్‌గా పెవిలియన్ చేరాడు.
Updated on: Feb 18, 2024 | 3:57 PM

ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా టీమిండియా తరపున అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ ఇప్పుడు వరుసగా అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు చేశాడు.

ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లోనూ యువ ప్లేయర్ 65 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీని ద్వారా అరంగేట్రం మ్యాచ్‌లోనే వరుసగా హాఫ్ సెంచరీలు సాధించి ప్రత్యేక ఫీట్ సాధించాడు.

ఈ అర్ధసెంచరీలతో, టెస్టు క్రికెట్‌లో టీమిండియా తరపున తొలి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 50+ పరుగులు చేసిన 4వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. గతంలో దిలావర్ హుస్సేన్, సునీల్ గవాస్కర్, శ్రేయాస్ అయ్యర్ ఈ ఘనత సాధించారు.

ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్ కూడా తొలి మ్యాచ్‌లోనే వరుసగా అర్ధశతకాలు సాధించి ప్రత్యేక సాధకుల జాబితాలో చేరాడు. దీని ద్వారా తొలి మ్యాచ్ లోనే ఈ యువ స్ట్రైకర్ తన రాకను ప్రపంచానికి ఘనంగా చాటిచెప్పాడు.

ఈ మ్యాచ్‌లో 72 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ ఖాన్ 3 భారీ సిక్సర్లు, 6 ఫోర్లతో అజేయంగా 68 పరుగులు చేశాడు. దీంతో తొలి టెస్టు మ్యాచ్‌లో సర్ఫరాజ్ మొత్తం 130 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 445 పరుగులు చేసింది. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 319 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 126 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా.. యశస్వి జైస్వాల్ (214) అజేయ డబుల్ సెంచరీ, సర్ఫరాజ్ ఖాన్ (68), శుభ్‌మాన్(91)ల సహకారంతో 4 వికెట్ల నష్టానికి 430 పరుగులు చేసిన అనంతరం డిక్లెర్ చేసింది. దీంతో ఇంగ్లండ్‌కు 557 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.




