AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: మైదానంలో ఊహించని ఘటన.. బంతి తగిలి కుప్పకూలిన స్టార్ బౌలర్.. పరిస్థితి విషమం..

BBL Comilla Victorians Video: ముస్తాఫిజుర్‌కు మొదట మైదానంలో అమర్చిన స్టాండ్‌బై అంబులెన్స్‌లో ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తరువాత అతన్ని ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు ముస్తాఫిజుర్‌కు బంతి కారణంగా తీవ్ర గాయమై ఉంటుందనే భయం నెలకొంది. ఎందుకంటే, బంతి తగిలినపుడు అతడి తలపై హెల్మెట్ కూడా లేదు. కానీ, ఆస్పత్రిలో సీటీ స్కాన్ చేయగా, ప్రమాదంలో బంగ్లాదేశ్ బౌలర్‌కు అంతర్గతంగా ఎలాంటి గాయాలు కాలేదని తేలింది.

Video: మైదానంలో ఊహించని ఘటన.. బంతి తగిలి కుప్పకూలిన స్టార్ బౌలర్.. పరిస్థితి విషమం..
Mustafizur Rahman Injury
Venkata Chari
|

Updated on: Feb 18, 2024 | 4:22 PM

Share

Bangladesh Pacer Mustafizur Rahman: బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ఆస్పత్రిలో చేరాడు. నెట్ ప్రాక్టీస్ సమయంలో అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో, అతన్ని హడావిడిగా ఆసుపత్రికి తరలించారు. ముస్తాఫిజుర్ తన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ జట్టు కొమిల్లా విక్టోరియన్స్‌తో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. బ్యాట్స్‌మెన్ లిటన్ దాస్ కొట్టిన షాట్‌లో ముస్తాఫిజుర్ ఈ గాయానికి గురయ్యాడు. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. లిట్టన్ దాస్ పక్కనే ఉన్న నెట్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అప్పుడు అతను ఒక షాట్ కొట్టాడు. ఆ తర్వాత బంతి నేరుగా ముస్తాఫిజుర్ తలపై పడింది. బంతి తలకు తగలగానే రక్తం కారడంతో అక్కడ గందరగోళం నెలకొంది.

ముస్తాఫిజుర్‌కు మొదట మైదానంలో అమర్చిన స్టాండ్‌బై అంబులెన్స్‌లో ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తరువాత అతన్ని ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు ముస్తాఫిజుర్‌కు బంతి కారణంగా తీవ్ర గాయమై ఉంటుందనే భయం నెలకొంది. ఎందుకంటే, బంతి తగిలినపుడు అతడి తలపై హెల్మెట్ కూడా లేదు. కానీ, ఆస్పత్రిలో సీటీ స్కాన్ చేయగా, ప్రమాదంలో బంగ్లాదేశ్ బౌలర్‌కు అంతర్గతంగా ఎలాంటి గాయాలు కాలేదని తేలింది.

ముస్తాఫిజుర్ గాయం పరిస్థితినిపై టీమ్ ఫిజియో ఏమన్నారంటే..

కొమిల్లా విక్టోరియన్స్ ఫిజియో SM జాహిదుల్ ఇస్లాం సజల్ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ముస్తాఫిజుర్ గాయంపై అప్‌డేట్ అందించారు. ముస్తాఫిజుర్ తలపై గాయం ఉందని, దానికి చికిత్స చేశామని ఆయన చెప్పారు. అతనికి ఆపరేషన్ చేసి కుట్లు వేశారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

ముస్తాఫిజుర్ గైర్హాజరీ..

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో, కొమిల్లా విక్టోరియన్స్ తమ తదుపరి మ్యాచ్‌ని సిల్హెట్ స్ట్రైకర్స్‌తో ఫిబ్రవరి 19న ఆడాల్సి ఉంది. ఆ తర్వాత రంగ్‌పూర్ రైడర్స్, ఫార్చ్యూన్ బరిషాల్‌తో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇటువంటి పరిస్థితిలో, ఈ ముఖ్యమైన మ్యాచ్‌లకు ముందు ముస్తాఫిజుర్ రెహ్మాన్ గాయపడి ఆసుపత్రికి చేరుకోవడం కొమిల్లా విక్టోరియన్‌లకు షాక్ తగిలింది. అయితే, ప్రస్తుతానికి ముస్తాఫిజుర్ త్వరగా కోలుకుని తిరిగి రావాలని అందరూ కోరుకుంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..