Video: నిండా 23 ఏళ్లు లేవు.. కట్‌చేస్తే.. దిగ్గజాలకే సాధ్యం కాని రికార్డ్‌లో టీమిండియా ఫ్యూచర్ స్టార్

Yashasvi Jaiswal Century: రాజస్థాన్ సాధించిన ఈ బలమైన విజయం మధ్య మరో పెద్ద శుభవార్త వచ్చింది. అదే యశస్వి జస్వాల్ సెంచరీ. ఈ టోర్నీలో యశస్వి బ్యాట్ మౌనంగా ఉంది. గత 7 మ్యాచ్‌ల్లో అతను హాఫ్ సెంచరీ చేయలేదు. యశస్వి అత్యుత్తమ స్కోరు 39 పరుగులు. కానీ, సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జైస్వాల్ వేరే స్థాయిలో కనిపించాడు. ఈ ఆటగాడు తుఫాను బ్యాటింగ్ చేస్తూనే సెంచరీ పూర్తి చేశాడు.

Video: నిండా 23 ఏళ్లు లేవు.. కట్‌చేస్తే.. దిగ్గజాలకే సాధ్యం కాని రికార్డ్‌లో  టీమిండియా ఫ్యూచర్ స్టార్
Jos Buttler, Yashasvi Jaisw
Follow us

|

Updated on: Apr 23, 2024 | 1:15 PM

ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ దిశగా దూసుకపోతోంది. సోమవారం ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ మరోసారి విజయం సాధించింది. దీంతో సంజూ శాంసన్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. రాజస్థాన్ సాధించిన ఈ బలమైన విజయం మధ్య మరో పెద్ద శుభవార్త వచ్చింది. అదే యశస్వి జస్వాల్ సెంచరీ. ఈ టోర్నీలో యశస్వి బ్యాట్ మౌనంగా ఉంది. గత 7 మ్యాచ్‌ల్లో అతను హాఫ్ సెంచరీ చేయలేదు. యశస్వి అత్యుత్తమ స్కోరు 39 పరుగులు. కానీ, సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జైస్వాల్ వేరే స్థాయిలో కనిపించాడు. ఈ ఆటగాడు తుఫాను బ్యాటింగ్ చేస్తూనే సెంచరీ పూర్తి చేశాడు.

జైస్వాల్ సిక్సర్లు, ఫోర్ల వర్షం..

జైపూర్‌లో యశస్వి జైస్వాల్ సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు. ఈ ఆటగాడు తన ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు కొట్టాడు. ఈ ఆటగాడు 59 బంతుల్లో సెంచరీని పూర్తి చేశాడు. అతని IPL కెరీర్‌లో ఇది రెండవ సెంచరీ. ఈ సెంచరీతో యశస్వి జైస్వాల్‌ కూడా భారీ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో రెండు సెంచరీలు చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. యశస్వి జైస్వాల్ వయసు కేవలం 22 ఏళ్లు.

ఇవి కూడా చదవండి

బ్యాడ్ ఫామ్ నుంచి ఎలా పుంజుకున్నాడు?

సెంచరీ చేసిన తర్వాత, యశస్వి జైస్వాల్ తన చివరి 7 వైఫల్యాలను ఎలా విజయంగా మార్చుకున్నాడో చెప్పాడు. తాను కేవలం బంతిని ఆడుతున్నానని, గత ఇన్నింగ్స్ వైఫల్యం తన మనసులో లేదని జైస్వాల్ అన్నాడు. తాను క్రికెట్ షాట్లపైనే దృష్టి పెట్టానని జైస్వాల్ చెప్పాడు. సీనియర్ ఆటగాళ్లు కూడా తనకు మద్దతుగా నిలిచారని చెప్పాడు. తనకు నిరంతరం అవకాశాలు ఇచ్చిన కోచ్ సంగక్కర, కెప్టెన్ సంజూ శాంసన్‌లకు కృతజ్ఞతలు తెలిపాడు. నెట్స్‌లో తాను చేసిన కష్టానికి తగిన ఫలితం దక్కిందని యశస్వి అన్నారు. యశస్వి జైస్వాల్ పేలవమైన ఫామ్ రాజస్థాన్‌కు బలహీనమైన లింక్‌గా అనిపించింది. అయితే, ఇప్పుడు ఈ బలహీనత ఈ జట్టుకు బలంగా మారింది. ఇప్పుడు రాజస్థాన్ జట్టును అడ్డుకోవడం ప్రత్యర్థులకు చాలా కష్టంగా మారనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?