Team India: 20 బంతుల చితక్కొట్టుడు.. 14 సిక్సర్లు, 4 ఫోర్లు బాదిన టీమిండియా ప్లేయర్.. ఎవరంటే.?
టీమిండియా తరపున ఈ ఆటగాడు మొత్తం 49 మ్యాచ్‌లు ఆడాడు. వికెట్‌కీపర్, బ్యాట్స్‌మెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అతడెవరో కాదు వృద్ధిమాన్ సాహా. ఇందులో 3 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చివరిసారిగా 2021లో భారత టెస్ట్ జట్టులో కనిపించిన సాహా.. ఇప్పుడు అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పాడు.

టీ20 క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు సాహిల్ చౌహాన్ అనే ఆటగాడి పేరిట ఉంది. సైప్రస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఎస్టోనియా తరఫున ఆడిన సాహిల్ కేవలం 27 బంతుల్లోనే సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ. అయితే, ఓ టీమిండియా మాజీ ఆటగాడు కేవలం 20 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన సంగతి చాలామంది తెలియదు. ఇది అంతర్జాతీయ క్రికెట్‌లో జరగలేదు. ఇది ప్రతిష్టాత్మక క్లబ్ మ్యాచ్‌లో జరిగింది. ఇంతటి విస్ఫోటక సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్ మరెవరో కాదు వృద్ధిమాన్ సాహా.
2018లో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(CAB) నిర్వహించిన T20 టోర్నమెంట్‌లో వృద్ధిమాన్ సాహా కేవలం 20 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో బెంగాల్ నాగ్‌పూర్ రైల్వేస్, మోహన్ బగన్ క్రికెట్ క్లబ్ జట్లు తలబడ్డాయి. మోహన్ బగన్ క్రికెట్ క్లబ్ తరపున ఓపెనర్‌గా బరిలోకి దిగిన వృద్ధిమాన్ సాహా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచాడు. అంతేకాదు ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టి కేవలం 20 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
తొలి బంతి నుంచే అద్భుతమైన బ్యాటింగ్ కనబరిచిన వృద్ధిమాన్ సాహా.. ఈ మ్యాచ్‌లో 14 సిక్సర్లు, 4 ఫోర్లు బాదాడు. దీని ద్వారా అతను 20 బంతుల్లో 102 పరుగులు సాధించాడు. వృద్ధిమాన్ సాహా చేసిన ఈ అద్భుతమైన సెంచరీ సహాయంతో, మోహన్ బగన్ క్రికెట్ క్లబ్ జట్టు బెంగాల్ నాగ్‌పూర్ రైల్వేస్ నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని కేవలం 7 ఓవర్లలోనే ఛేదించి 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. 7 సంవత్సరాల క్రితం వృద్ధిమాన్ సాహా చేసిన ఈ పేలుడు సెంచరీ దేశీయ గడ్డపై ఇప్పటివరకు సాధించిన వేగవంతమైన సెంచరీగా రికార్డుల్లోకి ఎక్కింది.
సాహా కెరీర్ విషయానికొస్తే.. 2010లో టీమ్ ఇండియా తరఫున అరంగేట్రం చేసిన వృద్ధిమాన్ సాహా 40 టెస్ట్ మ్యాచ్‌ల్లో ఆడాడు. ఈ సమయంలో అతడు 56 ఇన్నింగ్స్‌లు ఆడి 3 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలతో మొత్తం 1353 పరుగులు సాధించాడు. అదేవిధంగా, భారత్ తరపున 9 వన్డేలలోనూ వికెట్ కీపర్‌గా ఆడిన సాహా కేవలం 41 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అందువల్ల, 2014 తర్వాత అతనికి భారత వన్డే జట్టులో అవకాశం రాలేదు. ఈ సంవత్సరం ప్రారంభంలో అన్ని రకాల ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు వృద్ధిమాన్ సాహా. ఇప్పుడు బెంగాల్ అండర్-23 జట్టు కోచ్‌గా కొత్త ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేశాడు.




