AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BAN Vs WI: విజయానికి 5 పరుగులు దూరం.. చేతిలో 2 వికెట్లు.. ఆఖర్లో సీన్ ఇది

వెస్టిండీస్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన వన్డే సిరీస్‌లోని రెండో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. అయితే 100 ఓవర్ల తర్వాత కూడా ఈ మ్యాచ్‌లో ఫలితం రాకపోవడంతో.. సూపర్ ఓవర్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

BAN Vs WI: విజయానికి 5 పరుగులు దూరం.. చేతిలో 2 వికెట్లు.. ఆఖర్లో సీన్ ఇది
Ban Vs Wi
Ravi Kiran
|

Updated on: Oct 22, 2025 | 6:30 AM

Share

వెస్టిండీస్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన వన్డే సిరీస్‌లోని రెండో మ్యాచ్ షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో రెండు జట్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. స్లో పిచ్‌పై రెండు జట్ల బ్యాట్స్‌మెన్లు పరుగులు సాధించడంలో ఇబ్బంది పడ్డారు. ఒకానొక సమయంలో, వెస్టిండీస్ మ్యాచ్‌ను గెలవడానికి చాలా దగ్గరగా వచ్చింది. కానీ బంగ్లాదేశ్ చివరి ఓవర్‌లో అద్భుతమైన పునరాగమనం చేసింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. ఆ తర్వాత సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేలింది.

100 ఓవర్లు ముగిసినా ఫలితం లేదు..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఈ సమయంలో వెస్టిండీస్ 50 ఓవర్లనూ స్పిన్నర్లతో బౌలింగ్ చేసింది. వన్డే క్రికెట్‌లో ఇదే తొలిసారి. బంగ్లాదేశ్ తరఫున సౌమ్య సర్కార్ 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ మెహదీ హసన్ మీరాజ్ కూడా 32 పరుగులు సాధించాడు. ఆ తర్వాత రిషద్ హుస్సేన్ చివరి ఓవర్లలో 14 బంతుల్లో 39 పరుగులతో పేలుడు ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు, వెస్టిండీస్ తరఫున గుడకేష్ మోటీ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు. అకేల్ హొస్సేన్, అలిక్ అథనాజే తలో రెండు వికెట్లు తీశారు. రోస్టన్ చేజ్, ఖారీ పియరీ పొదుపుగా బౌలింగ్ చేశారు.

చివరి ఓవర్లో వెస్టిండీస్ 5 పరుగులు చేయలేకపోయింది..

214 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ జట్టు పేలవమైన ఆరంభాన్ని సాధించింది. ఆ జట్టు 103 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. 133 పరుగులు చేరుకునే సమయానికి ఏడుగురు బ్యాట్స్‌మెన్‌లు పెవిలియన్ చేరారు. అయితే, కెప్టెన్ షాయ్ హోప్ ఒక ఎండ్‌లో నిలిచి అజేయంగా 53 పరుగులు చేశాడు. కేసీ కార్టీ కూడా 35 పరుగులు, జస్టిన్ గ్రీవ్స్ 26 పరుగులు సాధించారు. అయితే, చివరి ఓవర్‌లో వెస్టిండీస్ ఐదు పరుగులు చేయలేకపోయింది. చివరి ఓవర్‌లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగింది. 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 213 పరుగులు మాత్రమే చేసింది.

సూపర్ ఓవర్‌లో వెస్టిండీస్ గెలిచింది..

మ్యాచ్ టై అయిన తర్వాత రెండు జట్లు సూపర్ ఓవర్ ఆడాయి. దీనిలో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 10 పరుగులు చేసింది. అయితే బంగ్లాదేశ్ 11 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది. వారు 6 బంతుల్లో 1 వికెట్ నష్టానికి 8 పరుగులు మాత్రమే చేసి మ్యాచ్‌ను 2 పరుగుల తేడాతో కోల్పోయింది. దీనితో సిరీస్ 1-1తో సమమైంది.

రాత పరీక్ష లేకుండానే.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు!
రాత పరీక్ష లేకుండానే.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు!
రోహిత్ తొలగింపు వెనుక గౌతమ్ గంభీర్ మాస్టర్ ప్లాన్ ఇదేనా ?
రోహిత్ తొలగింపు వెనుక గౌతమ్ గంభీర్ మాస్టర్ ప్లాన్ ఇదేనా ?
JEE Main 2026 మీ ఫైనల్ ప్రిపరేషన్‌ ఇలా ఉంటే.. టాప్ ర్యాంక్ మీదే!
JEE Main 2026 మీ ఫైనల్ ప్రిపరేషన్‌ ఇలా ఉంటే.. టాప్ ర్యాంక్ మీదే!
ఉజ్జయినిలో భక్తి పారవశ్యంలో మునిగిపోయిన స్టార్ క్రికెటర్లు
ఉజ్జయినిలో భక్తి పారవశ్యంలో మునిగిపోయిన స్టార్ క్రికెటర్లు
హాఫ్ సెంచరీ చేసి 6 ఏళ్లు దాటిందిగా.. వరుస ఫ్లాప్ షోలతో భారంగా..
హాఫ్ సెంచరీ చేసి 6 ఏళ్లు దాటిందిగా.. వరుస ఫ్లాప్ షోలతో భారంగా..
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
పంజాబ్ పీచమణిచిన సౌరాష్ట్ర సింహం..సెమీఫైనల్లో 165 పరుగులతో ఊచకోత
పంజాబ్ పీచమణిచిన సౌరాష్ట్ర సింహం..సెమీఫైనల్లో 165 పరుగులతో ఊచకోత
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
గోల్డ్‌లోన్‌ ట్రై చేస్తున్నారా?ఫిబ్రవరి 1 వరకు వెయిట్‌ చేయండి
గోల్డ్‌లోన్‌ ట్రై చేస్తున్నారా?ఫిబ్రవరి 1 వరకు వెయిట్‌ చేయండి