AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS 2nd ODI: అడిలైడ్ నుంచి షాకింగ్ న్యూస్.. రెండో వన్డేకు దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్..?

India vs Australia 2nd ODI: భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే గురువారం అడిలైడ్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు అడిలైడ్ ప్రాక్టీస్ సెషన్‌లో జరిగిన పరిణామాలు చాలా మంది భారత అభిమానులను నిరాశపరచవచ్చు. అందుకు గల కారణాన్ని ఇప్పుడు చూద్దాం..

IND vs AUS 2nd ODI: అడిలైడ్ నుంచి షాకింగ్ న్యూస్.. రెండో వన్డేకు దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్..?
Ind Vs Aus 2nd Odi
Venkata Chari
|

Updated on: Oct 22, 2025 | 6:49 AM

Share

Ind vs Aus: పెర్త్ వన్డేలో భారత్ ఓడిపోయినప్పుడు, తలెత్తిన అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే కుల్దీప్ యాదవ్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎందుకు చేర్చలేదు. టీమిండియా ఒక స్పెషలిస్ట్ బౌలర్‌కు బదులుగా ముగ్గురు ఆల్ రౌండర్లను ఎందుకు రంగంలోకి దించింది? కుల్దీప్ యాదవ్‌ను ఎందుకు విశ్వసించలేదు? అనే ప్రశ్నలు తలెత్తాయి. కానీ, కుల్దీప్ యాదవ్ తదుపరి మ్యాచ్‌లో కూడా ఆడటం లేదని తెలుస్తోంది. మంగళవారం అడిలైడ్‌లో టీమిండియా ప్రాక్టీస్ చేసింది. ఆ సెషన్ నుంచి కుల్దీప్ యాదవ్ అస్సలు బౌలింగ్ చేయలేదని వార్తలు వెలువడ్డాయి.

కుల్దీప్‌కు మరోసారి మొండిచేయి?

కుల్దీప్ యాదవ్ తిరిగి వస్తాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు నిరాశ చెందాల్సి రావొచ్చు. ఎందుకంటే, అతను ప్రాక్టీస్ కూడా చేయలేదు. అడిలైడ్ ఓవల్‌లో ఫాస్ట్ బౌలర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. దీంతో కుల్దీప్ మైదానంలోకి దిగడం కష్టమైంది. కుల్దీప్ మాత్రమే కాదు, మహమ్మద్ సిరాజ్ కూడా అడిలైడ్‌లో ప్రాక్టీస్ చేయలేదు. అందువల్ల, రెండవ వన్డేకు అతనికి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. దీని వలన ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

అడిలైడ్‌ ప్రాక్టీస్ సెషన్‌లో ఏం జరిగింది?

View this post on Instagram

A post shared by Vimal Kumar (@vimalwa)

అడిలైడ్‌లో జరిగిన టీమిండియా ప్రాక్టీస్ సెషన్ నుంచి అనేక కీలక వార్తలు వెలువడ్డాయి. సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ విమల్ కుమార్ నివేదిక ప్రకారం, శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో ఆ స్పార్క్ లేదు. కానీ, ఇద్దరూ చాలా రిలాక్స్‌గా కనిపించారు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ శ్రేయాస్ అయ్యర్‌తో చాలా సేపు మాట్లాడాడు. ఆ ఆటగాడు నెట్స్‌లో బాగా కనిపించాడు. కేఎల్ రాహుల్ అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు. లాంగ్ షాట్లు కొట్టాడు. అడిలైడ్‌లో టీమిండియా గెలవడం చాలా ముఖ్యం. ఎందుకంటే, ఓటమి అంటే సిరీస్‌ను కోల్పోయే అవకాశం ఉంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..