WPL 2024 Auction: 30 స్థానాలు..165 మంది ప్లేయర్స్‌.. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ వేలం లైవ్‌ ఎక్కడ చూడొచ్చంటే?

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్  సీజన్-2 ప్లేయర్ వేలానికి రంగం సిద్ధమైంది. శనివారం (డిసెంబర్ 9) జరగనున్న వేలం ప్రక్రియ కోసం 165 మంది ప్లేయర్స్‌ రిజిస్టర్ చేసుకున్నారు. ఈ వేలానికి ముందు, ఐదు ఫ్రాంచైజీలు మొత్తం 60 మంది ప్లేయర్లను రిటైన్ చేసుకుని, 29 మందిని విడుదల చేశాయి

WPL 2024 Auction: 30 స్థానాలు..165 మంది ప్లేయర్స్‌.. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ వేలం లైవ్‌ ఎక్కడ చూడొచ్చంటే?
WPL 2024

Updated on: Dec 08, 2023 | 7:20 AM

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్  సీజన్-2 ప్లేయర్ వేలానికి రంగం సిద్ధమైంది. శనివారం (డిసెంబర్ 9) జరగనున్న వేలం ప్రక్రియ కోసం 165 మంది ప్లేయర్స్‌ రిజిస్టర్ చేసుకున్నారు. ఈ వేలానికి ముందు, ఐదు ఫ్రాంచైజీలు మొత్తం 60 మంది ప్లేయర్లను రిటైన్ చేసుకుని, 29 మందిని విడుదల చేశాయి. దీని ప్రకారం, 30 ఖాళీ స్లాట్‌లకు బిడ్డింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 9న ముంబైలో మహిళల ప్రీమియర్ లీగ్ వేలం ప్రక్రియ జరగనుంది.మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఈ ఆక్షన్‌ ప్రారంభమవుతుంది. ఒక్కో జట్టులో 18 మంది ప్లేయర్లకు అవకాశం ఉండనుంది.

మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఉన్న జట్లు ఇవే..

  1. ముంబై ఇండియన్స్‌
  2. ఢిల్లీ క్యాపిటల్స్‌
  3. యూపీ వారియర్స్
  4. గుజరాత్ జెయింట్స్
  5. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఏ జట్టు వద్ద ఎంత బడ్జెట్ ఉందంటే?

1. ఈసారి గుజరాత్ జెయింట్స్ గరిష్టంగా 11 మంది క్రికెటర్లను విడుదల చేసింది. ఇప్పుడు గుజరాత్ జెయింట్స్ వద్ద రూ.5.95 కోట్ల పర్స్‌ ఉంది.
2. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ 13 మంది ప్లేయర్లను రిటైన్‌ చేసుకుంది. అలాగే నలుగురిని విడుదల చేసింది. ముంబై పర్స్‌ విలువ మొత్తం రూ. 2.1 కోట్లు
3. యూపీ వారియర్స్ ఐదుగురిని రిలీజ్‌ చేయగా.. ఇప్పుడు రూ.4 కోట్ల పర్సు వ్యాల్యూతో వేలంలో పాల్గొంటోంది.
4. ఢిల్లీ క్యాపిటల్స్ 15 మంది ప్లేయర్లను రిటైన్‌ చేసుకుంది. ఆ ఫ్రాంఛైజీ వద్ద 2.25 కోట్లు ఉన్నాయి.
5. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 11 మంది ఆటగాళ్లను రిటైన్‌ చేసుకుంది. ఇప్పుడు రూ.3.35 కోట్లతో ఆర్సీబీ వేలంలో కనిపించనుంది.

ఇవి కూడా చదవండి

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ బిడ్డింగ్‌ను స్పోర్ట్స్-18 ఛానెల్‌లో చూడవచ్చు. అలాగే Jio సినిమా యాప్, వెబ్‌సైట్‌లోనూ లైవ్‌ చూడొచ్చు. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా  బరిలోకి దిగనుంది. ఈ ఏడాది ప్రారంభంలో హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో ముంబై  ఢిల్లీ క్యాపిటల్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న స్మృతి మంధాన నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేలవమైన ఆటతీరుతో అభిమానులను నిరాశ పర్చింది. మరి ఈసారైనా ఆర్సీబీ మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తుందా? లేదా? అన్నది చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..