AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yuvraj Singh: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన యూవీ.. ఏమన్నారంటే?

Yuvraj Singh: యువరాజ్ సింగ్ భారత క్రికెట్‌లో కీలకంగా వినిపిస్తుంటుంది. భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయిన యువరాజ్ కెరీర్ చాలా ప్రత్యేకమైనది. 2007 T20 ప్రపంచ కప్‌లో ఒకే ఓవర్‌లో వరుసగా ఆరు సిక్సర్లు బాదిన ఆటగాడిగా, అలాగే కేవలం 12 బంతుల్లోనే అత్యంత వేగవంతమైన T20 ఇంటర్నేషనల్ హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా యువరాజ్ ప్రత్యేక రికార్డ్ నెలకొల్పాడు. యువరాజ్ కొట్టిన ఈ సిక్సర్లు నేటికీ చర్చనీయాంశమయ్యాయి.

Yuvraj Singh: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన యూవీ.. ఏమన్నారంటే?
Yuv Raj Singh
Venkata Chari
|

Updated on: Mar 02, 2024 | 12:28 PM

Share

Yuvraj Singh: టీమిండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి పోటీ చేయనున్నట్లు మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే, ఈ వార్తలను భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఖండించాడు. యువరాజ్ సింగ్ శుక్రవారం ఎక్స్‌లో తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని, యూవీ కెన్ అనే ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సహాయం చేస్తూనే ఉంటానంటూ చెప్పుకొచ్చాడు.

యువరాజ్ ట్వీట్ చేస్తూ, “నాపై వచ్చిన మీడియా కథనాల్లో ఎలాంటి నిజం లేదు. నేను గురుదాస్‌పూర్ నుంచి పోటీ చేయడం లేదు. వివిధ హోదాల్లో ఉన్న వ్యక్తులకు మద్దతు ఇవ్వడం, సహాయం చేయడం నా అభిరుచి. నా ఫౌండేషన్ యూవీ కెన్ ద్వారా నేను దీన్ని కొనసాగిస్తాను. మా వంతు కృషి చేస్తున్నాం” అంటూ రాసుకొచ్చాడు.

ప్రపంచ కప్ గెలిచిన ఆటగాడు నటుడు సన్నీ డియోల్ స్థానంలో గురుదాస్‌పూర్ నుంచి బీజేపీ టిక్కెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని మీడియా నివేదికలలో వస్తోంది. ఈ స్థానం నుంచి సన్నీ ప్రస్తుత ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో యువరాజ్ సింగ్ భేటీ తర్వాత ఈ వార్తలు వెలుగులోకి వచ్చాయి.

2007, 2011 ప్రపంచ కప్‌లలో కీలక పాత్ర..

యువరాజ్ సింగ్ భారత క్రికెట్‌లో కీలకంగా వినిపిస్తుంటుంది. భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయిన యువరాజ్ కెరీర్ చాలా ప్రత్యేకమైనది. 2007 T20 ప్రపంచ కప్‌లో ఒకే ఓవర్‌లో వరుసగా ఆరు సిక్సర్లు బాదిన ఆటగాడిగా, అలాగే కేవలం 12 బంతుల్లోనే అత్యంత వేగవంతమైన T20 ఇంటర్నేషనల్ హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా యువరాజ్ ప్రత్యేక రికార్డ్ నెలకొల్పాడు. యువరాజ్ కొట్టిన ఈ సిక్సర్లు నేటికీ చర్చనీయాంశమయ్యాయి. అలాగే, 2011 ICC ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. యూవీ మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు.

మైదానం వెలుపల, యువరాజ్ క్యాన్సర్‌తో యుద్ధం చేయడం, 2012లో క్రికెట్‌కు విజయవంతమైన పునరాగమనం చేసి తన కెరీర్‌ను మరింత తీర్చిదిద్దుకున్నాడు. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను బాధించింది. మైదానం వెలుపల కూడా, యువరాజ్ క్యాన్సర్ రోగులకు మద్దతు ఇస్తున్నాడు. తన స్వచ్ఛంద సంస్థ YouWeCan ద్వారా అవగాహన పెంచుతున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..