AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup 2023: వన్డే చరిత్రలో ఇదే అత్యుత్తమ ఇన్నింగ్స్.. గ్లెన్ మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్‌పై భారత మాజీ ప్లేయర్..

ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 128 బంతుల్లోనే 21 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 201 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఒకానొక సమయంలో, ఆస్ట్రేలియా 91 పరుగుల వరకు 7 వికెట్లు కోల్పోయింది. అయితే, ఆ తర్వాత మాక్స్‌వెల్, పాట్ కమిన్స్ ఎనిమిదో వికెట్‌కు 202 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించారు. వీరిద్దరి భాగస్వామ్యం వన్డే క్రికెట్ చరిత్రలో ఎనిమిదో వికెట్‌కు అతిపెద్ద భాగస్వామ్యం.

World Cup 2023: వన్డే చరిత్రలో ఇదే అత్యుత్తమ ఇన్నింగ్స్.. గ్లెన్ మ్యాక్స్‌వెల్ బ్యాటింగ్‌పై భారత మాజీ ప్లేయర్..
Glenn Maxwell
Venkata Chari
|

Updated on: Nov 08, 2023 | 1:15 PM

Share

అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ (Glenn Maxwell) అద్భుత ఇన్నింగ్స్‌పై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక ప్రకటన చేశాడు. మ్యాక్స్‌వెల్ చేసిన ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌ను ఇప్పటివరకు వన్డే చరిత్రలో అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.

ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 128 బంతుల్లోనే 21 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 201 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఒకానొక సమయంలో, ఆస్ట్రేలియా 91 పరుగుల వరకు 7 వికెట్లు కోల్పోయింది. అయితే, ఆ తర్వాత మాక్స్‌వెల్, పాట్ కమిన్స్ ఎనిమిదో వికెట్‌కు 202 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించారు. వీరిద్దరి భాగస్వామ్యం వన్డే క్రికెట్ చరిత్రలో ఎనిమిదో వికెట్‌కు అతిపెద్ద భాగస్వామ్యం. అంతకుముందు, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్లు ఆండ్రూ హాల్, జస్టిన్ క్యాంప్ 2006లో భారత్‌పై ఎనిమిదో వికెట్‌కు 138 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

గ్లెన్ మాక్స్‌వెల్ అద్భుతమైన పని చేశాడు – ఆకాష్ చోప్రా..

View this post on Instagram

A post shared by ICC (@icc)

తన యూట్యూబ్ ఛానెల్‌లో సంభాషణ సందర్భంగా, ఆకాష్ చోప్రా గ్లెన్ మాక్స్‌వెల్ ఇన్నింగ్స్ గురించి కీలక ప్రకటన చేశాడు. ఆయన మాట్లాడుతూ.. మనం చూసింది అద్భుతమైనది, నమ్మశక్యం కానిది. ఇది అత్యుత్తమ వన్డే ఇన్నింగ్స్. నేను తమాషా చేయడం లేదు. నేను ప్రపంచకప్ గురించి మాత్రమే మాట్లాడటం లేదు. గ్లెన్ మాక్స్‌వెల్ ఇప్పటి వరకు వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. వన్డేల్లో పరుగుల వేటలో డబుల్ సెంచరీ ఉండదని ఊహించాను. కానీ, మ్యాక్స్‌వెల్ అది చేసి చూపించాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు అద్భుత విజయం సాధించింది. మూడు వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించి సెమీస్‌లో స్థానం ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా దాదాపు ఓడిపోయే స్థితిలో బ్యాటింగ్‌కు వచ్చిన మ్యాక్సీ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇరుజట్లు..

ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్) , ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మార్నస్ లాబుస్‌చాగ్నే, మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్.

ఆఫ్ఘనిస్తాన్: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్) , రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్ (వికెట్), రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హక్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తిరుగులేని శక్తిగా భారత్.. ప్రపంచ సవాళ్ల నడుమ టాప్ గేర్లలో జీడీపీ
తిరుగులేని శక్తిగా భారత్.. ప్రపంచ సవాళ్ల నడుమ టాప్ గేర్లలో జీడీపీ
అనుకోకుండా వచ్చే అతిథుల కోసం అద్భతమైన స్వీట్.. నోట్లే వేస్తే ..
అనుకోకుండా వచ్చే అతిథుల కోసం అద్భతమైన స్వీట్.. నోట్లే వేస్తే ..
ఫ్రీ బిర్యానీ కోసం ఎగబడ్డ జనం.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
ఫ్రీ బిర్యానీ కోసం ఎగబడ్డ జనం.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
బెజవాడ స్టైల్ చిట్టి పునుగులు.. ఇలా చేస్తే ఏమన్నా ఉంటాయా..?
బెజవాడ స్టైల్ చిట్టి పునుగులు.. ఇలా చేస్తే ఏమన్నా ఉంటాయా..?
IAS అవ్వాలనే అమ్మాయిలకు ఫ్రీగా UPSC కోచింగ్.. కొన్ని గంటలే ఛాన్స్
IAS అవ్వాలనే అమ్మాయిలకు ఫ్రీగా UPSC కోచింగ్.. కొన్ని గంటలే ఛాన్స్
ఇది కదా మానవత్వం అంటే.. 6 కి.మీ. విద్యార్థినిని వీపుపై మోసి..
ఇది కదా మానవత్వం అంటే.. 6 కి.మీ. విద్యార్థినిని వీపుపై మోసి..
తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ మరో అప్డేట్..
తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ మరో అప్డేట్..
ఆషాఢం అమావాస్య రోజే అద్భుతమైనయోగం.. వీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా
ఆషాఢం అమావాస్య రోజే అద్భుతమైనయోగం.. వీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా
సీఎం విజయ్ 'జననాయగన్' కు సెన్సార్ క్లియరెన్స్! రిలీజ్ ఎప్పుడంటే?
సీఎం విజయ్ 'జననాయగన్' కు సెన్సార్ క్లియరెన్స్! రిలీజ్ ఎప్పుడంటే?
హైదరాబాద్‌ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో నాలుగులైన్ల హైవే..
హైదరాబాద్‌ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో నాలుగులైన్ల హైవే..