NZ vs SL: సెమీస్ చేరే నాలుగో జట్టు ఏది? కివీస్, పాకిస్తాన్ ఫ్యూచర్ డిసైడ్ చేయనున్న లంక, ఇంగ్లండ్..
New Zealand Semi Final Scenario: ఆస్ట్రేలియాతో మ్యాచ్ తర్వాత ఆఫ్గానిస్తాన్ జట్టు దక్షిణాఫ్రికాతో ఆడాల్సి ఉంది. అయితే, ఆస్ట్రేలియాతో ఓడిపోవడం వల్ల సౌతాఫ్రికా మ్యాచ్ కీలకం కానుంది. ఒకవేళ ఆఫ్గాన్ విజయం సాధించి ఉంటే.. న్యూజిలాండ్, పాకిస్థాన్‌లకు షాక్ తగిలేది. అప్పుడు పాయింట్ల పట్టికలో పాకిస్థాన్, న్యూజిలాండ్‌ల కంటే అఫ్గాన్ జట్టు నాలుగో స్థానానికి చేరుకునేది. కానీ, ఆఫ్గాన్ జట్టు ఓడిపోవడంతో పాక్, న్యూజిలాండ్ జట్లకు కాస్త రిలీఫ్ దొరికింది.
World Cup Semi Final Race: గురువారం న్యూజిలాండ్‌తో శ్రీలంక కీలక మ్యాచ్ ఆడనుంది. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే, శ్రీలంకపై ఓడిపోతే న్యూజిలాండ్ జట్టు సెమీ ఫైనల్ రేసుకు దూరమవుతుందా? లేదా అనేది ఇప్పుడు చూద్దాం.. న్యూజిలాండ్ 8 మ్యాచ్‌లలో 8 పాయింట్లను కలిగి ఉంది. అంటే కివీస్ జట్టుకు కేవలం 1 లీగ్ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. శ్రీలంకపై కివీ జట్టు ఓడిపోతే 8 పాయింట్లు మిగులుతాయి. న్యూజిలాండ్‌తో పాటు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లు కూడా 8 పాయింట్లతో ఉన్నాయి.
పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ ఎక్కడ ఉంది?
అయితే, ఆస్ట్రేలియాతో మ్యాచ్ తర్వాత ఆఫ్గానిస్తాన్ జట్టు దక్షిణాఫ్రికాతో ఆడాల్సి ఉంది. అయితే, ఆస్ట్రేలియాతో ఓడిపోవడం వల్ల సౌతాఫ్రికా మ్యాచ్ కీలకం కానుంది. ఒకవేళ ఆఫ్గాన్ విజయం సాధించి ఉంటే.. న్యూజిలాండ్, పాకిస్థాన్‌లకు షాక్ తగిలేది. అప్పుడు పాయింట్ల పట్టికలో పాకిస్థాన్, న్యూజిలాండ్‌ల కంటే అఫ్గాన్ జట్టు నాలుగో స్థానానికి చేరుకునేది. కానీ, ఆఫ్గాన్ జట్టు ఓడిపోవడంతో పాక్, న్యూజిలాండ్ జట్లకు కాస్త రిలీఫ్ దొరికింది.
న్యూజిలాండ్ జట్టు ఓడిపోతే ఏమవుతుంది?
శ్రీలంకపై న్యూజిలాండ్ ఓడిపోతే, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తమ రాబోయే మ్యాచ్‌లలో ఓడిపోవాలని కివీ జట్టు కోరుకుంటుంది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లు తమ రాబోయే మ్యాచ్‌ల్లో ఓడిపోతే.. న్యూజిలాండ్ సెమీఫైనల్‌కు చేరుకోవాలనే ఆశ సజీవంగా ఉంటుంది. ఇప్పటివరకు భారత్‌తో పాటు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్‌కు అర్హత సాధించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 8 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ 8 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. అయితే, న్యూజిలాండ్‌తో పాటు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ 8 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. అయితే, మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా, న్యూజిలాండ్, పాక్ నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.
ఇంగ్లండ్‌తో ఢీ కొట్టనున్న పాకిస్తాన్..
View this post on Instagram
పాకిస్తాన్ జట్టు ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 4 గెలిచి, ఖాతాలో 8 పాయింట్లు చేర్చుకుంది. దీంతో లీగ్‌లో తమ చివరి మ్యాచ్‌ను ఇంగ్లండ్ టీంతో తలపడాల్సి ఉంది. చివరి మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే సెమీస్‌కు ఛాన్స్ ఉంటుంది. అయితే, న్యూజిలాండ్, ఆఫ్గానిస్తాన్ తమ చివరి మ్యాచ్‌లో ఓడిపోవాలని కోరుకుంటుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..