AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC World Cup 2023: సెంచరీలతో దూసుకెళ్తోన్న ప్లేయర్లు.. ఎవరెన్ని బాదారంటే.. పూర్తి జాబితా ఇదే..

ICC Cricket World Cup 2023: ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023లో దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డి కాక్ ఇప్పటివరకు జరిగిన పోటీలో నాలుగు సెంచరీలతో అత్యధిక సెంచరీలు సాధించాడు. గ్లెన్ మాక్స్‌వెల్ CWC 2023లో మొదటి డబుల్ సెంచరీని సాధించాడు. కాళ్ల తిమ్మిర్లతో బాధపుడుతున్నా.. ఆస్ట్రేలియాకు చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించాడు. కుడిచేతి వాటం ఆటగాడు ఆఫ్ఘనిస్తాన్‌పై అజేయంగా 201 పరుగులు చేశాడు.

ICC World Cup 2023: సెంచరీలతో దూసుకెళ్తోన్న ప్లేయర్లు.. ఎవరెన్ని బాదారంటే.. పూర్తి జాబితా ఇదే..
Glenn Maxwell
Venkata Chari
|

Updated on: Nov 08, 2023 | 11:58 AM

Share

List of Centuries in ICC Cricket World Cup 2023: ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023 (ICC Cricket World Cup 2023) తుది దశకు చేరుకుంది. కాగా, ఇప్పటి వరకు బ్యాట్స్‌మెన్స్, బౌలర్ల మధ్య పోలీ రసవత్తరంగా మారింది. కొన్ని అధిక స్కోరింగ్ మ్యాచ్‌లతోపాటు, మరికొన్ని స్వల్ప మొత్తాలు కూడా నమోదయ్యాయి. ఇప్పటి వరకు, ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023లో 22 మంది బ్యాట్స్‌మెన్స్ సెంచరీలు సాధించారు. దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డి కాక్ ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023లో ఇప్పటివరకు నాలుగు సెంచరీలతో అత్యధిక సెంచరీల (Most Centuries in ICC Cricket World Cup 2023) జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. గ్లెన్ మాక్స్‌వెల్ CWC 2023లో మొదటి డబుల్ సెంచరీని సాధించాడు. కాళ్ల తిమ్మిర్లతో బాధపడుతున్నా.. ఆస్ట్రేలియాకు సంచలన విజయాన్ని అందిచాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి అజేయంగా 201 పరుగులతో నిలిచాడు. అంతకుముందు మ్యాక్స్‌వెల్ ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు.

ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023లో భారత్ తరపున కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఒక్కో సెంచరీ సాధించారు. పాకిస్థాన్ తరపున అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్ లు మూడంచెల మార్కును అధిగమించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023లో నలుగురు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ సెంచరీలు కొట్టారు. ఇప్పటివరకు ఒకే జట్టు నుంచి అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్లుగా నిలిచారు. ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023లో బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌కు చెందిన బ్యాట్స్‌మెన్ ఇంకా సెంచరీ చేయలేదు.

ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023లో అత్యధిక సెంచరీలు..

బ్యాట్స్ మాన్ HS 100
క్వింటన్ డి కాక్ (SA) 174 4
అబ్దుల్లా షఫీక్ (PAK) 113 1
డేవిడ్ మలన్ (ENG) 140 1
డెవాన్ కాన్వే (NZ) 152* 1
రోహిత్ శర్మ (IND) 131 1
విరాట్ కోహ్లీ (IND) 103* 2
ఐడెన్ మార్క్రామ్ (SA) 106 1
మిచెల్ మార్ష్ (AUS) 121 1
కుసాల్ మెండిస్ (SL) 122 1
మహ్మద్ రిజ్వాన్ (PAK) 131* 1
రచిన్ రవీంద్ర (NZ) 123* 3
సదీర సమరవిక్రమ (SL) 108 1
డేవిడ్ వార్నర్ (AUS) 163 2
రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (SA) 133 2
హెన్రిచ్ క్లాసెన్ (SA) 109 1
డారిల్ మిచెల్ (NZ) 130 1
మహ్మదుల్లా (BAN) 111 1
గ్లెన్ మాక్స్‌వెల్ (AUS) 201* 2
ట్రావిస్ హెడ్ (AUS) 109 1
ఫఖర్ జమాన్ (PAK) 126 1
చరిత్ అసలంక (SL) 108 1
ఇబ్రహీం జద్రాన్(AFG) 129* 1

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..