AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: “బాగా ఆడితే, బాగా సంపాదించొచ్చు.. మా ఫ్యూచర్ బాగుంటుంది” షమీ ప్రదర్శనపై భార్య హసిన్ జహాన్ కామెంట్స్..

Mohammad Shami: ఈ వీడియోలో టోర్నీలో షమీ ఆటతీరుపై అడిగిన ప్రశ్నలకు హసీన్ జహాన్ సమాధానమిస్తోంది. తాజాగా ఆమె న్యూస్ నేషన్ ఛానల్ కార్యక్రమంలో అతిథిగా పాల్గొంది. ఈ సమయంలో, షో హోస్ట్ ఆమెతో మాట్లాడుతూ, షమీ ప్రపంచ కప్‌లో మూడు మ్యాచ్‌లలో 14 వికెట్లు పడగొట్టాడు. చాలా పాత రికార్డులను బద్దలు కొట్టాడు. షమీ ప్రదర్శనపై మీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటున్నారా? అంటూ ప్రశ్నించాడు.

Video: బాగా ఆడితే, బాగా సంపాదించొచ్చు.. మా ఫ్యూచర్ బాగుంటుంది షమీ ప్రదర్శనపై భార్య హసిన్ జహాన్ కామెంట్స్..
Mohammad Shami Hasin Jahan
Venkata Chari
|

Updated on: Nov 08, 2023 | 11:32 AM

Share

Mohammad Shami-Hasin Jahan: భారత జట్టు (Team India) ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ప్రపంచ కప్ 2023 (CWC 2023)లో అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీశాడు. భారత అభిమానులతో పాటు, క్రికెట్ ప్రపంచంలోని పలువురు మాజీ దిగ్గజాలు కూడా అనుభవజ్ఞుడైన రైట్ ఆర్మ్ బౌలర్ బౌలింగ్‌ను మొచ్చుకుంటున్నారు. అయితే, ఇదిలా ఉండగా, టోర్నీలో షమీ (Mohammad Shami) ఆటతీరుపై అతని భార్య హసిన్ జహాన్ (Hasin Jahan) విచిత్రమైన ప్రకటన ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

ఈ వీడియోలో టోర్నీలో షమీ ఆటతీరుపై అడిగిన ప్రశ్నలకు హసీన్ జహాన్ సమాధానమిస్తోంది. తాజాగా ఆమె న్యూస్ నేషన్ ఛానల్ కార్యక్రమంలో అతిథిగా పాల్గొంది. ఈ సమయంలో, షో హోస్ట్ ఆమెతో మాట్లాడుతూ, షమీ ప్రపంచ కప్‌లో మూడు మ్యాచ్‌లలో 14 వికెట్లు పడగొట్టాడు. చాలా పాత రికార్డులను బద్దలు కొట్టాడు. షమీ ప్రదర్శనపై మీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటున్నారా? అంటూ ప్రశ్నించాడు.

దీనిపై ఆమె స్పందిస్తూ.. నేను క్రికెట్‌కు అభిమానిని కాదని, అసలు క్రికెట్ నేను చూడను, ఎవరు ఎన్ని వికెట్లు తీశారో నాకు తెలియదు. అతను (షమీ) బాగా రాణిస్తూ, బాగా ఆడుతూ ఉంటే, అతను జట్టులో కొనసాగుతాడు. మనం బాగా సంపాదిస్తే, మన భవిష్యత్తు భద్రంగా ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది.

మహ్మద్ షమీపై సంచలన కామెంట్స్ చేసిన భార్య హసిన్ జహాన్..

ఆ తర్వాత హోస్ట్ మాట్లాడుతూ.. హసీన్ జహాన్ టీమ్ ఇండియా, షమీకి మీరు ఖచ్చితంగా శుభాకాంక్షలు తెలియజేస్తారా అని అడిగాడు. దీనిపై భారత బౌలర్ భార్య స్పందిస్తూ.. నేను టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలుపుతాను. షమీకి మాత్రం చెప్పనంటూ ప్రకటించింది.

33 ఏళ్ల ఈ భారత బౌలర్, హసీన్ జహాన్ ల ప్రేమకథ IPL 2011 సమయంలో ప్రారంభమైంది. ఆ తరువాత, వారిద్దరూ 2014 లో వివాహం చేసుకున్నారు. అయితే నాలుగేళ్ల తర్వాత, హసిన్ జహాన్ షమీపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ కేసు పెట్టింది. అప్పటి నుంచి హసిన్ జహాన్ తన కుమార్తెతో కలిసి భారత బౌలర్ నుంచి విడిగా జీవిస్తోంది. షమీ ఆమెకు ప్రతి నెలా దాదాపు రూ.1 లక్షా 30 వేలు మెయింటెనెన్స్ అలవెన్స్‌గా ఇస్తున్నాడు. వీరిద్దరి మధ్య విడాకుల కేసు కోర్టులో ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..