World Cup 2023: ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లో 40వేల మందికి ఉచిత ప్రవేశం.. పూర్తి ప్లాన్ ఏమిటో తెలుసా?

ICC World Cup 2023: ప్రపంచకప్ 2023లో మొదటి మ్యాచ్ అక్టోబర్ 5న జరగనుంది. లక్షలాది మంది ప్రేక్షకుల సామర్థ్యంతో నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇందులో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ని చూసేందుకు 40 వేల మందికి ఉచిత టిక్కెట్లు లభిస్తాయని వార్తలు వస్తున్నాయి. వారు ఎవరు, ఎవరికి ఉచిత టిక్కెట్లు లభిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం..

World Cup 2023: ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లో 40వేల మందికి ఉచిత ప్రవేశం.. పూర్తి ప్లాన్ ఏమిటో తెలుసా?
World Cup 2023 Trophy
Follow us

|

Updated on: Oct 03, 2023 | 8:45 PM

ICC world cup 2023: వన్డే క్రికెట్ ప్రపంచకప్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలు పూర్తయ్యాయి. మొదటి మ్యాచ్ గత ప్రపంచ కప్‌లోని రెండు ఫైనలిస్ట్ జట్ల మధ్య, అంటే న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పుడు ఇందులో పెద్ద వార్త ఏంటంటే.. లక్షలాది మంది కూర్చునే నరేంద్రమోడీ స్టేడియంలో 40 వేల మంది ఫ్రీ మ్యాచ్ చూసేలా ఏర్పాట్లు చేయనున్నారు.

ఈ 40000 మంది వ్యక్తులు ఎవరో ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు? గుజరాతీ వార్తాపత్రిక దివ్య భాస్కర్ ప్రకారం, ప్రపంచ కప్ 2023 మొదటి మ్యాచ్‌ను చూసే 40,000 మందిలో అందరూ మహిళలేననంట.

ఇవి కూడా చదవండి

ప్రపంచకప్ మ్యాచ్‌కు 40,000 మంది మహిళలు..

గుజరాతీ వార్తాపత్రిక ప్రకారం, ప్రపంచ కప్‌లో మొదటి మ్యాచ్‌లో 40,000 మంది మహిళలను స్టేడియంలో సమీకరించాలని బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేసిందంట. నివేదిక ప్రకారం, ప్రపంచకప్‌లో మొదటి మ్యాచ్ కోసం అన్ని వార్డుల నుంచి 800 మంది మహిళలకు ఉచిత టిక్కెట్లు ఇవ్వనున్నారంట. అంతే కాదు వారికి ఉచిత టిక్కెట్లతో పాటు ఆహార పదార్థాలను కూడా ఉచితంగా అందజేయనున్నారంట.

ఓపెనింగ్ వేడుక ఉంటుందా లేదా?

ప్రపంచ కప్ 2023 ప్రారంభోత్సవ కార్యక్రమంతో మొదలవుతుందని గుజరాతీ వార్తాపత్రిక కూడా పేర్కొంది. అయితే, ప్రారంభోత్సవం జరగదని చాలా మీడియా కథనాలలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ప్రారంభోత్సవం జరుగుతుందా లేదా అనే దానిపై ఇంకా అధికారికంగా ఏమీ తెలియలేదు.

ప్రపంచకప్‌లో భారత్‌ ప్రయాణం..

View this post on Instagram

A post shared by ICC (@icc)

ప్రపంచ కప్ మ్యాచ్‌లు అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే, అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ చెన్నైలో జరగనుంది. ఆ తర్వాత భారత జట్టు తన తదుపరి మ్యాచ్‌ని అక్టోబర్ 11న ఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్‌తో ఆడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా మూడో మ్యాచ్ కూడా ఆడనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 14న జరగనుంది.

View this post on Instagram

A post shared by ICC (@icc)

అక్టోబర్‌లో భారత జట్టు 19న బంగ్లాదేశ్‌తో, 22న న్యూజిలాండ్‌తో, 29న ఇంగ్లండ్‌తో తలపడనుంది. నవంబర్ 2న శ్రీలంకతో భారత్ తలపడనుంది. నవంబర్ 5న దక్షిణాఫ్రికాతో తలపడనుంది. చివరి మ్యాచ్‌లో నవంబర్ 12న భారత్, నెదర్లాండ్‌లు తలపడనున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అదిరిపోయిన ట్రైలర్‌ ఒక్కొక్కరికీ గూస్‌ బంప్సే | వావ్! వాటే సినిమా
అదిరిపోయిన ట్రైలర్‌ ఒక్కొక్కరికీ గూస్‌ బంప్సే | వావ్! వాటే సినిమా
ఏపీకి తుఫాను ముప్పు.. ఐఎండీ హెచ్చరిక.! నాలుగు రోజుల పాటు వర్షాలు.
ఏపీకి తుఫాను ముప్పు.. ఐఎండీ హెచ్చరిక.! నాలుగు రోజుల పాటు వర్షాలు.
నయనతారకు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చిన విఘ్నేష్‌ శివన్‌.
నయనతారకు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చిన విఘ్నేష్‌ శివన్‌.
చేపల వేటకు వెళ్ళిన బోటులో అగ్నిప్రమాదం.! బోటులో 11 మంది..
చేపల వేటకు వెళ్ళిన బోటులో అగ్నిప్రమాదం.! బోటులో 11 మంది..
వర్షాల ధాటికి మూతబడ్డ సబ్ వేలు.. పలు రైళ్లు రద్దు.
వర్షాల ధాటికి మూతబడ్డ సబ్ వేలు.. పలు రైళ్లు రద్దు.
మళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. సిలిండర్‌పై రూ.21లు పెంపు.
మళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. సిలిండర్‌పై రూ.21లు పెంపు.
హమాస్‌ను అంతం చేయాలని ప్రమాణం చేశాను..: ఇజ్రాయెల్ పీఎం.
హమాస్‌ను అంతం చేయాలని ప్రమాణం చేశాను..: ఇజ్రాయెల్ పీఎం.
Telangana: మందుపాతరను నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు
Telangana: మందుపాతరను నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు
తన టీ షర్ట్‌తో అభిమాని బైక్‌ తుడిచి ఆటోగ్రాఫ్‌ ఇచ్చిన ధోనీ.
తన టీ షర్ట్‌తో అభిమాని బైక్‌ తుడిచి ఆటోగ్రాఫ్‌ ఇచ్చిన ధోనీ.
వైరల్‌ అవుతున్న కట్నకానుకల వీడియో. కారు నుంచి కిచెన్ సామాన్ల వరకు
వైరల్‌ అవుతున్న కట్నకానుకల వీడియో. కారు నుంచి కిచెన్ సామాన్ల వరకు