AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s Asia Cup 2024: ప్చ్‌.. ఆసియా కప్ ఫైనల్లో భారత్ బోల్తా.. మొదటిసారి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన లంక

శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. మహిళల ఆసియా కప్ ఫైనల్ 2024లో టీమిండియాను 8 వికెట్ల తేడాతో ఓడించిన శ్రీలంక ట్రోఫీని గెలుచుకుంది. శ్రీలంక ఆసియా కప్‌ను గెలవడం ఇదే తొలిసారి. రంగి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం (జులై 28) జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ తొలుత బ్యాటింగ్ కు దిగింది.

Women’s Asia Cup 2024: ప్చ్‌.. ఆసియా కప్ ఫైనల్లో భారత్ బోల్తా.. మొదటిసారి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన లంక
Women's Asia Cup 2024 Final
Basha Shek
|

Updated on: Jul 28, 2024 | 7:24 PM

Share

శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. మహిళల ఆసియా కప్ ఫైనల్ 2024లో టీమిండియాను 8 వికెట్ల తేడాతో ఓడించిన శ్రీలంక ట్రోఫీని గెలుచుకుంది. శ్రీలంక ఆసియా కప్‌ను గెలవడం ఇదే తొలిసారి. రంగి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం (జులై 28) జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. స్మృతి మంధాన అర్ధ సెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 165 పరుగులు చేసింది. భారత్ విధించిన 166 పరుగుల విజయ లక్యాన్ని శ్రీలంక 18.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి అందుకుంది. శ్రీలంక తరఫున కెప్టెన్ చమరి అతపతు, హర్షిత సమరవిక్రమ ఇద్దరూ అర్ధశతకాలు సాధించారు. దీంతో శ్రీలంక అలవోకగా విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో మితిమీరిన ఆత్మవిశ్వాసం, పేలవమైన నాయకత్వం, సులువైన క్యాచ్‌లు, పేలవమైన బౌలింగ్ వంటివి భారత జట్టు ఓటమికి ప్రధాన కారణమయ్యాయని చెప్పుకోవచ్చు. భారత్, బంగ్లాదేశ్ తర్వాత ఆసియా కప్ గెలిచిన మూడో మహిళల జట్టుగా శ్రీలంక రికార్డు సృష్టించింది.

ఇవి కూడా చదవండి

ఆరో ప్రయత్నంలో శ్రీలంక విజయం

మహిళల ఆసియా కప్ టోర్నీ 2004 నుంచి జరుగుతోంది. ఈ ఏడాది ఇది 8వ పోటీ. ఈ టోర్నీ చరిత్రలో శ్రీలంక 5 సార్లు ఫైనల్‌లో ఓడిపోవాల్సి వచ్చింది. టీం ఇండియా మొత్తం ఐదుసార్లు శ్రీలంకను ఓడించింది. అయితే ఈ ఏడాది శ్రీలంక 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఆసియా కప్ ట్రోఫీని గెలుచుకుంది. ఆసియా కప్ విజయం కోసం శ్రీలంక 2 దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ ఈ విజయంతో ముగిసింది. కాగా గతేడాది జరిగిన మెన్స్ ఆసియా కప్ ఫైనల్లో రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు శ్రీలంకను చిత్తు చేసింది.

టీమ్ ఇండియా ఉమెన్స్ ప్లేయింగ్ XI:

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ఉమా చెత్రి, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, తనూజా కన్వర్ మరియు రేణుకా ఠాకూర్ సింగ్.

శ్రీలంక మహిళల ప్లేయింగ్ ఎలెవన్:

చమరి అతపతు (కెప్టెన్), విష్మి గుణరత్నే, హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని (వికెట్ కీపర్), హాసిని పెరీరా, సుగంధికా కుమారి, ఇనోషి ప్రియదర్శిని, ఉదేశిక ప్రబోధని, సశిక ప్రబోధని.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
AP TET 2026 నార్మలైజేషన్‌పై ఉత్కంఠ.. 10-16 మార్కులు పెరిగే ఛాన్స్
AP TET 2026 నార్మలైజేషన్‌పై ఉత్కంఠ.. 10-16 మార్కులు పెరిగే ఛాన్స్
ఆ హీరో నా ప్రాణ స్నేహితుడు.. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్
ఆ హీరో నా ప్రాణ స్నేహితుడు.. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్
Gen Zలో పెరుగుతున్న కొత్త ట్రెండ్.. అసలు సాఫ్ట్ బ్లాకింగ్ అంటే..
Gen Zలో పెరుగుతున్న కొత్త ట్రెండ్.. అసలు సాఫ్ట్ బ్లాకింగ్ అంటే..
AP స్పెషల్ TET 2026 నోటిఫికేషన్.. DSC అభ్యర్ధులు అప్లై చేయొచ్చా?
AP స్పెషల్ TET 2026 నోటిఫికేషన్.. DSC అభ్యర్ధులు అప్లై చేయొచ్చా?
కేరళలో కనువిందు చేసే బోట్ రేసింగ్.. ఈ పడవ పందేలను ఎక్కడ చూడాలంటే?
కేరళలో కనువిందు చేసే బోట్ రేసింగ్.. ఈ పడవ పందేలను ఎక్కడ చూడాలంటే?
తన టాలెంట్‏కు ఎక్కడో ఉండాల్సినవాడు.. ఈ పరిస్థితిలో చూస్తే..
తన టాలెంట్‏కు ఎక్కడో ఉండాల్సినవాడు.. ఈ పరిస్థితిలో చూస్తే..
క్యాలీఫ్లవర్ అతిగా తింటున్నారా..? వీరికి విషంతో సమానం
క్యాలీఫ్లవర్ అతిగా తింటున్నారా..? వీరికి విషంతో సమానం
కొలంబోలో భారీ విక్టరీ దిశగా భారత్.. WTC టేబుల్ లో భారీ జంప్..?
కొలంబోలో భారీ విక్టరీ దిశగా భారత్.. WTC టేబుల్ లో భారీ జంప్..?
నేటి నుంచే AP ICET 2026 ప్రవేశాలు.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ
నేటి నుంచే AP ICET 2026 ప్రవేశాలు.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ
పసిడి ధర మరింత పెరుగుతుందా..? పెట్టుబడులకు ఇదే బెస్ట్ టైమా..?
పసిడి ధర మరింత పెరుగుతుందా..? పెట్టుబడులకు ఇదే బెస్ట్ టైమా..?