AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Bishnoi: ముఖంపై రక్తపు మరకలు.. బ్యాండేజీ కట్టుకుని మళ్లీ బౌలింగ్.. ‘నీ డెడికెషన్‌కు హ్యాట్సాఫ్ బ్రో’

టీమిండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీయగా, ఐపీఎల్ స్టార్ రియాన్ పరాగ్ మూడు వికెట్లతో లంకను కుప్పు కూల్చాడు. కాగా ఈ మ్యాచ్ లో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. లంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో టీమిండియా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తీవ్రంగా గాయ పడ్డాడు.

Ravi Bishnoi: ముఖంపై రక్తపు మరకలు.. బ్యాండేజీ కట్టుకుని మళ్లీ బౌలింగ్.. 'నీ డెడికెషన్‌కు హ్యాట్సాఫ్ బ్రో'
Ravi Bishnoi
Basha Shek
|

Updated on: Jul 28, 2024 | 5:30 PM

Share

శ్రీలంక పర్యటనలో టీమిండియా శుభారంభం చేసింది. శనివారం (జులై 28) జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌ లో ఆతిథ్య జట్టుపై 43 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.ఈ మ్యాచ్‌ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (21 బంతుల్లో 40), శుభమన్ గిల్ (16 బంతుల్లో 34) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 58) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. రిషభ్ పంత్ (33 బంతుల్లో 49) కూడా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలకం జట్టు 19.2 ఓవర్లలో 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమిండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీయగా, ఐపీఎల్ స్టార్ రియాన్ పరాగ్ మూడు వికెట్లతో లంకను కుప్పు కూల్చాడు. కాగా ఈ మ్యాచ్ లో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. లంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో టీమిండియా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తీవ్రంగా గాయ పడ్డాడు.

లంక ఇన్నింగ్స్ 16వ ఓవర్ లో బౌలింగ్ కు దిగిన రవి బిష్ణోయ్.. బ్యాటర్ కమిందు మెండిస్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్ ను అందుకునేందుకు పక్కకు దూకాడు. కానీ బంతి మాత్రం చిక్కలేదు. అయితే బంతిని అందుకునే ప్రయత్నంలో అతను కింద పడ్డాడు. అదే సమయంలో బంతి బిష్ణోయ్ ముఖానికి బలంగా తాకింది. దీంతో అతని చెంప మీద గీసుకుపోయింది. రక్త స్రావం కూడా అయ్యింది. దీంతో టీమిండియా ఫిజియో వెంటనే గ్రౌండ్​లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. బిష్ణోయ్ కు ప్రథమ చికిత్స అందించారు. ముఖానికి బ్యాండేజీ వేశారు.

ఇవి కూడా చదవండి

కాగా తీవ్ర గాయం కావడంతో బిష్ణోయ్ గ్రౌండ్ ను వీడతాడని చాలా మంది భావించారు. డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి విశ్రాంతి తీసుకుంటాడని అనుకున్నారు. కానీ అతను మాత్రం బౌలింగ్ కొనసాగించాడు. అంతే కాదు అదే ఓవర్లో చరిత అసలంకను బోల్తా కొట్టించాడు. ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు వేసిన రవి బిష్ణోయ్ 37 రన్స్ ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ముఖంపై తీవ్ర గాయమైనా ఆటను కొనసాగించిన బిష్ణోయ్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. క్రికెట్ పట్ల అతని డెడికేషన్ కు అందరూ ఫిదా అవుతున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..