ICC: ఐసీసీ కొత్త ఫైనాన్స్ మోడల్‌తో బీసీసీఐ ఖజానాకు బంఫర్ లాభాలు.. ఎంత డబ్బు వస్తుందో తెలిస్తే షాకే..
BCCI: ఐసీసీ 2024-27 దశకు సంబంధించిన ఆర్థిక నమూనాను విడుదల చేసింది. ఈ మోడల్ ప్రకారం ఐసీసీ వార్షిక ఆదాయంలో 38.5 శాతం బీసీసీఐ చెల్లించాల్సి ఉంటుంది. బీసీసీఐ తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, క్రికెట్ ఆస్ట్రేలియా సంపాదన ఎక్కువగా ఉంటుంది.
ICC New Finance Model: ఐసీసీ తన కొత్త ఫైనాన్స్ మోడల్‌ను విడుదల చేసింది. అందులో భాగంగా బీసీసీఐ ఏటా రూ.1889 కోట్లు సంపాదించనుంది. ఐసీసీ వార్షిక ఆదాయం రూ.4925 కోట్లుగా తేలింది. ఇందులో బీసీసీఐకి ఐసీసీ ఏటా రూ.1889 కోట్లు ఇవ్వనుంది. అంటే, ఈ మొత్తం సంపాదనలో 38.5 శాతం బీసీసీఐకు అందనుంది. తాజాగా ఈ కొత్త మోడల్‌తో బీసీసీఐ బ్యాంక్ బ్యాలెన్స్ మరింత పెరగనుంది.
ఏ దేశానికి ఎంత డబ్బు వస్తుందంటే?
ఐసీసీ 2024-27 దశకు సంబంధించిన ఆర్థిక నమూనాను విడుదల చేసింది. ఈ మోడల్ ప్రకారం ఐసీసీ వార్షిక ఆదాయంలో 38.5 శాతం బీసీసీఐ చెల్లించాల్సి ఉంటుంది. బీసీసీఐ తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, క్రికెట్ ఆస్ట్రేలియా సంపాదన ఎక్కువగా ఉంటుంది. కొత్త ఫైనాన్స్ మోడల్‌లో ఇంగ్లాండ్ US$ 41.33 మిలియన్లను ఆర్జింజనుంది. అంటే భారత కరెన్సీలో మొత్తం సంపాదన రూ.339 కోట్లుగా తేలింది. ఆస్ట్రేలియా 37.53 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.308 కోట్లుగా తేలింది.
BCCIతో పోలిస్తే PCBకి ఎంత డబ్బు వస్తుందంటే?
ఐసీసీ కొత్త ఆర్థిక నమూనా ప్రకారం, అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే జట్ల జాబితాలో పాకిస్తాన్ నాలుగో స్థానంలో కొనసాగుతుంది. పాకిస్తాన్ మొత్తం సంపాదన 34.52 మిలియన్ అమెరికాన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో పాకిస్తాన్ దాదాపు రూ. 283 కోట్లు సంపాదిస్తుంది. ఈ విధంగా BCCI పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కంటే దాదాపు 7 రెట్లు ఎక్కువ సంపాదిస్తుంది. అయితే, ICC కొత్త ఆర్థిక నమూనా ఇంకా అన్ని దేశాల క్రికెట్ బోర్డుల నుంచి అభిప్రాయాన్ని పొందలేదు. ఏకాభిప్రాయాన్ని పొందిన తర్వాత, ICC కొత్త ఆర్థిక నమూనాపై తుది నిర్ణయం తీసుకోవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..