AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: టీమిండియాకు రిటైర్మెంట్.. కట్‌చేస్తే.. ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పేస్తాడా?

IPL 2025: టీమిండియా ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆగస్టు 24న సోషల్ మీడియా ద్వారా అంతర్జాతీయ క్రికెట్, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ధావన్ తెలిపాడు. ఈ రిటైర్మెంట్ ప్రకటన తర్వాత, శిఖర్ ధావన్ రాబోయే ఐపీఎల్‌లో ఆడతాడా లేదా అనే ప్రశ్న తలెత్తింది.

IPL 2025: టీమిండియాకు రిటైర్మెంట్.. కట్‌చేస్తే.. ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పేస్తాడా?
Shikhar Dhawan
Venkata Chari
|

Updated on: Aug 25, 2024 | 10:14 PM

Share

IPL 2025: టీమిండియా ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆగస్టు 24న సోషల్ మీడియా ద్వారా అంతర్జాతీయ క్రికెట్, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ధావన్ తెలిపాడు. ఈ రిటైర్మెంట్ ప్రకటన తర్వాత, శిఖర్ ధావన్ రాబోయే ఐపీఎల్‌లో ఆడతాడా లేదా అనే ప్రశ్న తలెత్తింది. ఈ ప్రశ్నకు సమాధానం త్వరలో రానుంది. ఎందుకంటే ధావన్ గాయం సమస్యతో బాధపడుతున్నాడు.

ఐపీఎల్ 2024లో శిఖర్ ధావన్ గాయపడ్డాడు. ఈ గాయం కారణంగా అతను గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరపున 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఈ గాయం సమస్య నుంచి అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ విషయాన్ని ధావన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ సమయంలో తగిలిన గాయం నుంచి కోలుకున్నాను. కానీ, 100 శాతం నయం కాలేదు. పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు మరింత సమయం పడుతుందని శిఖర్ ధావన్ అన్నాడు. కాబట్టి, పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తేనే ఐపీఎల్‌లో కనిపిస్తాడు.

ఒకవేళ అతను వచ్చే ఐపీఎల్‌లో కనిపించాలనుకున్నా, పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ అతన్ని రిటైన్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే, ధావన్ వయసు ఇప్పుడు 38 ఏళ్లు. ఫిట్‌నెస్‌ సమస్యను కూడా ఎదుర్కొంటున్నాడు. దీంతో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ శిఖర్ ధావన్‌ను విడుదల చేసి కొత్త కెప్టెన్‌ని ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

శిఖర్ ధావన్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు. 222 మ్యాచ్‌లు ఆడి 2 సెంచరీలు, 51 అర్ధసెంచరీలతో మొత్తం 6768 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన 2వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..