AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ENG vs WI T20 World Cup 2021 Match Prediction: ఇంగ్లండ్‌పై విండీస్ ఘనమైన రికార్డు కొనసాగేనా..? రికార్డులు ఎలా ఉన్నాయంటే..!

Today Match Prediction of England vs West Indies: వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్‌ టీంల మధ్య జరిగిన 18 మ్యాచుల్లో వెస్టిండీస్ టీం 11 గెలిచింది. 2016 వరల్డ్ టీ 20 తర్వాత ఇరు జట్ల మధ్య జరిగిన నాలుగు మ్యాచ్‌లలో మూడింటల్లో ఇంగ్లండ్ విజయం సాధించింది.

ENG vs WI T20 World Cup 2021 Match Prediction: ఇంగ్లండ్‌పై విండీస్ ఘనమైన రికార్డు కొనసాగేనా..? రికార్డులు ఎలా ఉన్నాయంటే..!
T20 World Cup 2021, Eng Vs Wi Preview
Venkata Chari
|

Updated on: Oct 23, 2021 | 10:12 AM

Share

ENG vs WI T20 World Cup 2021, Playing XI, Players to Watch Out: టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా తొలిరోజే రెండు మ్యాచులు జరగనున్నాయి. తొలి మ్యాచులో ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా తలపడనుండగా, రెండో మ్యాచులో వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్‌ టీంలు పోరాడనున్నాయి. ఇరుజట్లు 2016 టీ20 ప్రపంచ కప్‌లో తలపడ్డాయి. ఇందులో ఇంగ్లండ్‌పై వెస్టిండీస్ టీం 4 వికెట్ల తేడాతో గెలిచి రెండోసారి విజేతగా నిలిచింది. ప్రస్తుతం టీ20 ర్యాకింగ్స్‌ ప్రకారం వెస్టిండీస్ టీం 9 వ ర్యాంకులో నిలిచింది. అలాగే ఇంగ్లండ్ టీం అగ్రస్థానం సాధించింది. ఈ టోర్నమెంట్‌లో ఇంగ్లండ్, వెస్టిండీస్ టీంలు రెండూ బలమైన జట్లే. ఈసారి ఈ రెండు జట్లు ఫైనల్‌ చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

అయితే ఈ రెండు టీంలు ముందు సూపర్ 12 స్టేజ్‌ నుంచి బయటపడాలి. బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక మొదటి రౌండ్‌ నుంచి సూపర్ 12‌కు అర్హత సాధించాయి. ఈ రెండు జట్లు గ్రూప్ 1‌లో నిర్ణయాత్మక పోటీని అందించేందుకు సిద్ధమయ్యాయి. ప్రారంభ మ్యాచులోనే కీలక జట్లతో ఆడడనుండడంతో కొంత ఒత్తిడి ఉన్నా.. ఓటమితో టోర్నీని ప్రారంభించేందుకు మాత్రం ఇష్టపడడంలేదు. ఎలాగైనా తొలిరోజు మ్యాచులో విజయం సాధించాలని ఇరు జట్లు కోరుకుంటున్నాయి. దీంతో ఈ పోరు చాలా హోరాహోరీగా సాగనుందని తెలుస్తోంది.

కరీబియన్‌ టీం తమ రెండు వార్మప్ మ్యాచులలో నిరాశపరిచారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌ల చేతిలో ఓడిపోయారు. కానీ, ఇంగ్లండ్‌తో చివరిసారి జరిగిన ఐదు మ్యాచ్‌లలో టీ 20 వరల్డ్ కప్ గేమ్‌లో మాత్రం విజయం సాధించారు. ఓడిపోలేదు. ప్రస్తుతం వెస్టిండీస్ టీం బ్యాట్స్‌మెన్లలో చాలా మంది ఫాంతో తంటాలు పడుతున్నా, ఏ క్షణంలోనైనా తుఫాన్ ఇన్నింగ్స్ ఆడేందుక వారు సిద్ధంగానే ఉంటారు. కిరన్ పొలార్డ్, ఆండ్రీ రస్సెల్ మిడిల్ ఆర్డర్‌లో మంచి ప్రతిభ చూపిస్తున్నారు. ఇంగ్లండ్ దాడికి వెస్టిండీస్ ఖచ్చితంగా భయపడదు. జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్, సామ్ కర్రన్ అందుబాటులో లేకపోవడంతో ఇంగ్లండ్ టీం ఎంతో బలహీనంగా కనిపిస్తోంది.

మరోవైపు ఇంగ్లండ్ రెండు వార్మప్ మ్యాచ్‌లలో మెరుగైన ప్రదర్శననే కలిగి ఉంది. న్యూజిలాండ్‌ను ఓడించి, భారత్‌తో ఓడిపోయారు. ఆర్చర్, కుర్రాన్, స్టోక్స్ లేకపోవడం ఇంగ్లీష్ జట్టుకు ఒక దెబ్బ అయితే.. ఇయాన్ మోర్గాన్ కూడా తన ఫాంతో తంటాలు పడుతున్నాడు. జోస్ బట్లర్, జాసన్ రాయ్ ఓపెనింగ్ చేయనున్నారు. వీరి పార్టనర్‌షిప్ టీంకు ఎంతో కీలకం. ముఖ్యంగా పవర్‌ప్లేలో బంతి మృదువుగా మారడానికి, నెమ్మదిగా ఉన్న పిచ్‌లపై పరుగులు సాధిచడం కష్టతరం కావడంతో వీరి ఆట జట్టుకు చాలా కీలకంగా మారింది. పవర్‌ప్లేలో బంతితో ఇటీవల వెస్టిండీస్‌కు గొప్ప రికార్డు లేదు. దీంతో ఇది ఒక ముఖ్యమైన యుద్ధంగా ఉండే అవకాశం ఉంది.

గత ఐదు మ్యాచుల వివరాలు: ఇంగ్లండ్: విజయం, విజయం, ఓటమి, విజయం, విజయం వెస్టిండీస్: ఓటమి, విజయం, ఓటమి, విజయం, విజయం

ఎప్పుడు: ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్, సూపర్ 12 గ్రూప్ 1, రాత్రి 07:30 గంటలకు

ఎక్కడ: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం

సెకండ్ ఇన్నింగ్స్‌లో డ్యూ పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇంగ్లండ్ బౌలర్లు నీటి బకెట్లలో ముంచిన బంతులతో శిక్షణ పొందుతున్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో దుబాయ్‌ పిచ్‌లో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు 13 మ్యాచ్‌లలో తొమ్మిది గెలిచాయి. టాస్ గెలిచిన టీం ముందుగా బౌలింగ్ చేసే అవకాశం ఉంది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో సీమర్లు దుబాయ్‌లో కొంతమేర రాణిస్తున్నారు. ఈ మ్యాచ్ హైస్కోరింగ్ మ్యాచ్ అయ్యే అవకాశం లేదు.

టీ20ల్లో ముఖాముఖి పోరు: వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్‌ టీంల మధ్య జరిగిన 18 మ్యాచుల్లో వెస్టిండీస్ టీం 11 గెలిచింది. అలాగే ఐదు ప్రపంచ కప్‌ పోటీల్లోనూ ఇంగ్లండ్‌పై వెస్టిండీస్ టీం విజయం సాధించింది. 2016 వరల్డ్ టీ 20 తర్వాత ఇరు జట్ల మధ్య జరిగిన నాలుగు మ్యాచ్‌లలో మూడింటల్లో ఇంగ్లండ్ విజయం సాధించింది.

ఇంగ్లండ్: ఎలాంటి గాయాలూ లేకుండా ఇంగ్లండ్‌ టీం పూర్తి బలం కలిగిన జట్టుగా నిలిచింది. లియామ్ లివింగ్‌స్టోన్ భారత్‌పై సన్నాహకంలో వేలి గాయంతో పూర్తిగా కోలుకున్నాడు.

మొయిన్ అలీ వెస్టిండీస్‌పై కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నాడు. బంతిని విండీస్ టాప్ ఆర్డర్‌లో చాలా మంది ఎడమ చేతివాటం ఆటగాళ్లపై ప్రభావం చూపగలడని ఇంగ్లండ్ టీం ఆశిస్తోంది. అలాగే బ్యాట్‌తో కూడా అద్భుతంగా పరుగులు సాధిస్తుండడంతో.. పవర్‌ప్లేను సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. దీంతో దావీద్ మలాన్ స్థానంలో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావొచ్చిని తెలుస్తుంది.

ఇంగ్లండ్ ప్లేయింగ్ XI: జాసన్ రాయ్, జోస్ బట్లర్, మోయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, ఇయోన్ మోర్గాన్, లియామ్ లివింగ్‌స్టోన్, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, క్రిస్ జోర్డాన్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్

వెస్టిండీస్: ఫాబియన్ అలన్ ఐపీఎల్ సమయంలో చీలమండ గాయంతో టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్ రెండవ భాగంలో ఆండ్రీ రస్సెల్ మళ్లీ ఫిట్‌గా కనిపిస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో అతను రెండు ఓవర్లు బౌలింగ్ కూడా చేశాడు.

వెస్టిండీస్ ఈ ఏడాది 14 టీ 20 ల్లో 20 పవర్‌ ప్లే వికెట్లు మాత్రమే తీసింది. అయితే బట్లర్, రాయ్‌లను ముందుగానే తొలగించే మార్గాన్ని కనుగొనేందుకు విండీస్ టీం ప్రయత్నించాలి. లేదంటే మాత్రం భారీ మూల్యం చెల్లించుకునే అవకాశం ఉంది. డ్వేన్ బ్రావో ఆ పనిలో ఆరితేరినవాడిలా కనిపిస్తున్నాడు. బట్లర్‌ని టీ20 క్రికెట్‌లో మూడు సార్లు 19 సగటుతో బ్రావో పెవిలియన్ చేర్చాడు. కాబట్టి అతను కొత్త బంతితో ముందుగా బౌలింగ్ చేస్తే ఫలితాలు మారే అవకాశం ఉంది.

వెస్టిండీస్ ప్లేయింగ్ XI: ఎవిన్ లూయిస్, లెండెల్ సిమన్స్, క్రిస్ గేల్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్‌మియర్, నికోలస్ పూరన్, కీరాన్ పొలార్డ్, ఆండ్రీ రస్సెల్, డ్వేన్ బ్రావో, హేడెన్ వాల్ష్, ఓబెడ్ మెక్కాయ్

మీకు తెలుసా?

-ఇంగ్లండ్, వెస్టిండీస్ టీంలు జులై 2019 నుంచి టీ20 క్రికెట్‌లో అత్యధిక బౌండరీ శాతాలు కలిగి ఉన్నాయి. ఇంగ్లండ్ టీం ఫోర్లలో అగ్రస్థానంలో ఉండగా, వెస్టిండీస్ సిక్స్‌లలో ముందంజలో నిలిచింది. ప్రతి 11.1 బంతుల్లో ఒకదాన్ని బౌండరీలకు తలరిస్తున్నారు. ప్రపంచ జట్లకు ఇది 19.6 బంతులుగా ఉంది.

-క్రిస్ గేల్ ఇంగ్లండ్‌పై అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు. 13 ఇన్నింగ్స్‌లలో 34.08 సగటు, 157.31స్ట్రైకింగ్‌తో పరుగులు చేస్తున్నాడు.

-మొదటి ఆరు ఓవర్లలో ప్రతి 27 బంతుల్లో ఒక వికెట్‌తో, పవర్‌ప్లేలో ఇంగ్లండ్ బౌలింగ్ స్ట్రైక్ రేట్ నేరుగా సూపర్ 12‌కు అర్హత సాధించిన ఎనిమిది జట్లతో పోల్చితే చెత్తగా ఉంది.

స్వ్కాడ్స్: ఇంగ్లాండ్ జట్టు: జాసన్ రాయ్, జోస్ బట్లర్ (కీపర్), జానీ బెయిర్‌స్టో, మోయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, ఇయోన్ మోర్గాన్ (కెప్టెన్), క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, అదిల్ రషీద్, మార్క్ వుడ్, టైమల్ మిల్స్, డేవిడ్ విల్లీ, డేవిడ్ మలాన్, సామ్ బిల్లింగ్స్ , టామ్ కుర్రాన్

వెస్టిండీస్ జట్టు: ఎవిన్ లూయిస్, లెండెల్ సిమన్స్, క్రిస్ గేల్, షిమ్రాన్ హెట్మీర్, నికోలస్ పూరన్ (కీపర్), కిరాన్ పొలార్డ్ (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, డ్వేన్ బ్రావో, హేడెన్ వాల్ష్, ఒబెడ్ మెక్కాయ్, రవి రాంపాల్, ఒషనే థామస్, అకెలోసిన్ హోసిన్ చేజ్, ఆండ్రీ ఫ్లెచర్

Also Read: Viral Photos: ఇలాంటి బౌలింగ్ ఎప్పుడైనా చూశారా..? ట్విట్టర్లో మంటలు పుట్టిస్తోన్న మెంటార్ సింగ్ ధోని ఫొటోలు..!

AUS vs SA T20 World Cup 2021 Match Prediction: దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య తొలిపోరు.. ఎవరి బలాలు ఎలా ఉన్నాయంటే?