AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాకిస్థాన్‌ను ఓడించి భారత్‌కు ట్రోఫీ అందించాడు.. అయినా జట్టు నుంచి బహిష్కరణ.. ప్రస్తుతం దేశానికి సేవ చేస్తోన్న ఆటగాడెవరంటే?

ఈ భారత ఆటగాడి అంతర్జాతీయ కెరీర్ 25 నెలలు మాత్రమే కొనసాగింది. ఈ సమయంలో అతను 8 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇందులో వన్డేలు, టీ 20లు మాత్రమే ఉన్నాయి.

పాకిస్థాన్‌ను ఓడించి  భారత్‌కు ట్రోఫీ అందించాడు.. అయినా జట్టు నుంచి బహిష్కరణ.. ప్రస్తుతం దేశానికి సేవ చేస్తోన్న ఆటగాడెవరంటే?
Joginder Sharma Birthday
Venkata Chari
|

Updated on: Oct 23, 2021 | 9:49 AM

Share

భారతదేశాన్ని ప్రపంచ ఛాంపియన్‌గా మార్చిన ఆటగాడు, ఆశ్చర్యకరంగా అతను జట్టు నుంచి దూరమయ్యాడు. మరలా ఈ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదంటే మాత్రం ఆశ్యర్యపోతారు. భారత్‌ను చాంపియన్‌గా నిలబెట్టిన మ్యాచ్‌ తన కెరీర్‌లో చివరి మ్యాచ్‌గా నిరూపించుకుంది. ఇదీ భారత క్రికెటర్ జోగిందర్ శర్మ స్టోరీ. ఈరోజు ఆయన పుట్టినరోజు. హర్యానాలోని రోహ్‌తక్‌లో జన్మించిన ఈ క్రికెటర్ 2007 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో, అతను చివరి ఓవర్ బౌలింగ్ చేసి 12 పరుగులు ఆదా చేశాడు. జోగీందర్ తర్వాత పోలీసుగా మారి ప్రస్తుతం దేశానికి సేవలందిస్తున్నాడు.

జోగిందర్ శర్మ 2007 టీ20 ప్రపంచ కప్ నుంచి భారతదేశం తరపున తన టీ20 అరంగేట్రం చేశాడు. అతను ఈ టోర్నమెంట్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. ఫైనల్లో పాకిస్థాన్‌పై మిస్బా ఉల్ హక్‌ను ఔట్ చేసి హీరోగా మారాడు. ఈ మ్యాచ్ తర్వాత, టీ 20 వరల్డ్ కప్ చివరి ఓవర్ బౌలింగ్ చేసి భారత ఛాంపియన్‌గా నిలిచిన ఆటగాడిగా జోగిందర్ ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు. అయితే, ఈ టోర్నీ తర్వాత అతను మళ్లీ భారత్ తరఫున ఆడలేదు. అతను మళ్లీ భారత టీ 20 జట్టులో ఎంపిక కాలేదు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. 2012 వరకు ఈ జట్టులోనే ఉన్నాడు.

రంజీ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శన కారణంగా 2004-05 దేశీయ సీజన్‌లో జోగిందర్ శర్మ టీమిండియాలో ఎంపికయ్యాడు. ఒక మ్యాచ్‌లో వరుసగా సెంచరీలు చేయడంతోపాటు 10 వికెట్లు తీశాడు. అదే సమయంలో ఇండియా ఏ తరఫున ఆడుతున్నప్పుడు, ఇండియా సీనియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ తన మీడియం పేస్ బౌలింగ్‌తో లెజెండ్‌లను తెగ ఇబ్బంది పెట్టాడు. ఈ కారణంగా అతను బంగ్లాదేశ్ పర్యటనకు జట్టులో ఎంపికయ్యాడు. పర్యటన తర్వాత మళ్లీ దేశవాళీ క్రికెట్‌కు తిరిగి వచ్చాడు. అయితే స్థిరమైన ఆట కారణంగా 2007 ప్రారంభంలో వెస్టిండీస్‌తో జరిగిన స్వదేశీ సిరీస్‌లో టీమిండియాలో మళ్లీ చోటు సంపాదించాడు. ఇందులో నాలుగు వన్డేలు ఆడి ఒక వికెట్ తీసుకున్నాడు. అదే సమయంలో నాలుగు టీ 20 మ్యాచ్‌లలో నాలుగు వికెట్లు తీసుకున్నాడు.

జోగిందర్ శర్మ దేశీయ క్రికెట్‌లో హర్యానా తరపున ఆడేవాడు. 77 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి, 2804 పరుగులు చేయడంతో పాటు 297 వికెట్లు తీసుకున్నాడు. జోగిందర్ 80 లిస్ట్ ఏ మ్యాచ్‌లలో 1040 పరుగులు, 115 వికెట్లు సాధించాడు. అతను 2002-03 సీజన్‌లో అరంగేట్రం చేసి 81 పరుగులతో పాటు 11 వికెట్లు పడగొట్టి హర్యానాను విజయపథంలో నడిపించాడు. టీ20 ప్రపంచ కప్ గెలిచిన తరువాత, హర్యానా ప్రభుత్వం జోగిందర్ శర్మను హర్యానా పోలీసు శాఖలో డీఎస్పీగా నియమించింది. 2017 లో జోగిందర్ శర్మ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత పూర్తిగా పోలీసు ఉద్యోగంపై దృష్టి పెట్టడం ప్రారంభించాడు.

జోగిందర్ శర్మ ఐపీఎల్‌లో 16 మ్యాచ్‌లు ఆడి 36 పరుగులు చేశాడు. 12 వికెట్లు కూడా తీశాడు. అతను 2008లో పంజాబ్ కింగ్స్‌పై ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. చివరిసారిగా 2011లో ముంబై ఇండియన్స్‌తో ఆడాడు. నవంబర్ 2011లో జోగిందర్ శర్మకు కారు ప్రమాదం జరిగింది. ఇందులో ఆయన తలకు తీవ్ర గాయమైంది. చాలారోజులు మంచం మీదనే ఉన్నాడు. తర్వాత మైదానానికి తిరిగి వచ్చాడు.

Also Read: Viral Photos: ఇలాంటి బౌలింగ్ ఎప్పుడైనా చూశారా..? ట్విట్టర్లో మంటలు పుట్టిస్తోన్న మెంటార్ సింగ్ ధోని ఫొటోలు..!

AUS vs SA T20 World Cup 2021 Match Prediction: దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య తొలిపోరు.. ఎవరి బలాలు ఎలా ఉన్నాయంటే?