AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రేయస్ అయ్యర్ కంటే ముందే పరువు పోగొట్టుకున్న దిగ్గజ ప్లేయర్.. ఆ భారత కెప్టెన్ ఎవరంటే.?

T20I Captaincy Debut: భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన పరాజయాలలో ఒకటిగా 2026 ఐర్లాండ్ సిరీస్ నిలిచిపోతుంది. వరుసగా 16 టీ20 సిరీస్ విజయాల రికార్డుతో దూసుకుపోతున్న భారత్‌కు ఐర్లాండ్ గట్టి షాక్ ఇచ్చింది. మొదటి మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యంతో 34 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా, రెండో మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయి 2-0తో సిరీస్‌ను సమర్పించుకుంది.

శ్రేయస్ అయ్యర్ కంటే ముందే పరువు పోగొట్టుకున్న దిగ్గజ ప్లేయర్.. ఆ భారత కెప్టెన్ ఎవరంటే.?
Shreyas Iyer T20i Captaincy Debut
Venkata Chari
|

Updated on: Jun 30, 2026 | 6:50 AM

Share

ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా ఎదుర్కొన్న ఘోర పరాజయం క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. సూర్యకుమార్ యాదవ్ తర్వాత భారత టీ20 జట్టు పగ్గాలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్, తన కెప్టెన్సీ అరంగేట్రంలోనే కోలుకోలేని దెబ్బతిన్నాడు. అయితే, కెప్టెన్సీ చేపట్టిన మొదటి సిరీస్‌లోనే పరాజయం పాలుకావడం శ్రేయస్‌కు మాత్రమే జరగలేదు. గతంలో మరో సీనియర్ ఆటగాడు కూడా ఇదే చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు.

ఐర్లాండ్ చేతిలో చారిత్రాత్మక పరాభవం..

భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన పరాజయాలలో ఒకటిగా 2026 ఐర్లాండ్ సిరీస్ నిలిచిపోతుంది. వరుసగా 16 టీ20 సిరీస్ విజయాల రికార్డుతో దూసుకుపోతున్న భారత్‌కు ఐర్లాండ్ గట్టి షాక్ ఇచ్చింది. మొదటి మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యంతో 34 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా, రెండో మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయి 2-0తో సిరీస్‌ను సమర్పించుకుంది. గత మూడేళ్లలో భారత్‌కు ఇదే మొదటి ద్వైపాక్షిక టీ20 సిరీస్ ఓటమి కావడం గమనార్హం.

ఇది కూడా చదవండి: Team India: సిగ్గుండాలి.. సింహానికి హ్యాండిచ్చారు.. కట్‌చేస్తే.. పిల్ల టీంపై దూల తీర్చుకున్నారు..

శ్రేయస్ కంటే ముందు శిఖర్ ధావన్.. ఆ చేదు జ్ఞాపకం ఎప్పుడు..?

కెప్టెన్సీ అరంగేట్రంలోనే సిరీస్ కోల్పోయిన రికార్డులో శ్రేయస్ అయ్యర్ కంటే ముందు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఉన్నారు. 2021లో భారత సీనియర్ టెస్టు జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సమయంలో, శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం ధావన్ సారథ్యంలో ద్వితీయ శ్రేణి జట్టును పంపించారు. ఆ సిరీస్‌లో మొదటి మ్యాచ్ గెలిచి భారత్ మంచి ఊపుమీద కనిపించింది.

కానీ, దురదృష్టవశాత్తూ భారత క్యాంపులో కరోనా వైరస్ మహమ్మారి కలకలం రేపింది. తొమ్మిది మంది కీలక ఆటగాళ్లు ఐసోలేషన్‌కు వెళ్లాల్సి రావడంతో, ధావన్ చేతిలో నాణ్యమైన ఆటగాళ్లు కరువయ్యారు. కేవలం ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు, నలుగురు అరంగేట్ర ఆటగాళ్లతో బరిలోకి దిగక తప్పలేదు. దీనిని అనుకూలంగా మార్చుకున్న శ్రీలంక.. తర్వాతి రెండు మ్యాచ్‌లు గెలిచి 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ధావన్ పూర్తిస్థాయి కెప్టెన్‌గా వ్యవహరించిన ఏకైక టీ20 సిరీస్ ఇదే కావడం విశేషం.

ఇది కూడా చదవండి: IND vs IRE: ఆ ఇద్దరే టీమిండియాకు పట్టిన దరిద్రం.. అర్జెంటుగా పీకేయండి.. లేదంటే 2వ మ్యాచ్ కూడా..!

అరంగేట్రంలో తడబడిన మరికొందరు కెప్టెన్లు..

భారత క్రికెట్ చరిత్రలో అజింక్య రహానే, రిషభ్ పంత్ వంటి ఆటగాళ్లు కూడా తమ మొదటి కెప్టెన్సీ సిరీస్‌లలో విజయాలు అందుకోలేకపోయారు. 2015లో జింబాబ్వే పర్యటనలో రహానే సారథ్యంలోని సిరీస్ 1-1తో డ్రా అయింది. అలాగే 2022లో దక్షిణాఫ్రికాతో జరిగిన హోమ్ సిరీస్‌లో రిషభ్ పంత్ నాయకత్వంలోని భారత్ మొదటి రెండు మ్యాచ్‌లు ఓడిపోయి, ఆ తర్వాత పుంజుకుని 2-2తో సమం చేసింది. చివరి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో పంత్ ఓటమి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కానీ, శ్రేయస్, ధావన్ మాత్రమే సిరీస్ ఓటములను చవిచూశారు.

ఇది కూడా చదవండి: టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్.. కట్‌చేస్తే.. పోతూపోతూ ప్రపంచ రికార్డుతో గర్జించిన పాక్ ప్లేయర్..!

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను విజేతగా నిలిపి, పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు చేర్చిన అద్భుతమైన నాయకత్వ రికార్డు శ్రేయస్ అయ్యర్ సొంతం. అలాంటి కెప్టెన్‌కు అంతర్జాతీయ వేదికపై ఈ విధమైన ఆరంభం లభించడం దురదృష్టకరం. అయితే, గతంలో శిఖర్ ధావన్‌కు ఎదురైన పరిస్థితులు వేరు, ఇప్పుడు శ్రేయస్ ఎదుర్కొన్న పరిస్థితులు వేరు. ఈ పరాజయం నుంచి పాఠాలు నేర్చుకుని, త్వరలోనే జరగబోయే ఇంగ్లాండ్ సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా బలంగా పుంజుకుంటుందని ఆశిద్దాం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us