AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T Dilip: ఒక ఫీల్డింగ్ కోచ్ కోసం టీమిండియా క్రికెటర్ల కన్నీళ్లు! ఈయన జట్టుకు అంతగా ఏం చేశాడు?

టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ నాలుగేళ్ల పదవీకాలాన్ని ముగించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆయన, భారత జట్టులో ఫీల్డింగ్‌కు కొత్త ప్రమాణాలు తీసుకొచ్చారు. బెస్ట్ ఫీల్డర్ మెడల్ సంప్రదాయం, ఫిట్‌నెస్, క్యాచ్‌లు, గ్రౌండ్ ఫీల్డింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి ప్రపంచ స్థాయి ఫీల్డింగ్ జట్టుగా భారత్‌ను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు.

T Dilip: ఒక ఫీల్డింగ్ కోచ్ కోసం టీమిండియా క్రికెటర్ల కన్నీళ్లు! ఈయన జట్టుకు అంతగా ఏం చేశాడు?
T Dilip
SN Pasha
|

Updated on: Aug 04, 2026 | 4:48 PM

Share

భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించిన ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ నాలుగేళ్ల విజయవంతమైన పదవీకాలాన్ని ముగించారు. ఈ సందర్భంగా భారత క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు, బీసీసీఐ అధికారులు ఆయన సేవలను ప్రశంసిస్తున్నారు. ఫీల్డింగ్‌ను మ్యాచ్ ఫలితాన్ని మార్చే ఆయుధంగా తీర్చిదిద్దడంలో టీ దిలీప్ చేసిన కృషి విశేషమని చాలా మంది అంటున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ రోహిత్ శర్మ సైతం యూ క్రియేటెడ్ మ్యాజిక్ అంటూ స్పందించడం విశేషం. చాలా మంది యువ క్రికెటర్లు సైతం ఆయన టీమిండియా నుంచి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేక కన్నీళ్లతో వీడ్కోలు పలికినట్లు సమాచారం. రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్‌గా బాధ్యతల నుంచి తప్పుకున్నప్పుడు జట్టు మొత్తం ఎలా బాధ పడిందో ఇప్పుడు దిలీప్ వెళ్లిపోతున్నా.. అలానే బాధ పడుతున్నారని తెలుస్తోంది. అయితే అసలు టీ దిలీప్ టీమిండియా కోసం చేశారు? ఎందుకు ఒక ఫీల్డింగ్ కోచ్ దూరం అవుతుంటే అంతలా ఫీల్ అవుతున్నారు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

టీ దిలీప్ ఎవరు?

హైదరాబాద్‌కు చెందిన తంగిరాల దిలీప్ దేశీయ క్రికెట్‌లో కోచ్‌గా మంచి గుర్తింపు సంపాదించారు. హైదరాబాద్ క్రికెట్ వ్యవస్థలో పనిచేసిన ఆయన, తర్వాత నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో కోచ్‌గా సేవలందించారు. యువ ఆటగాళ్లలో ఫిట్‌నెస్, ఫీల్డింగ్ నైపుణ్యాలను పెంపొందించడంలో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ ప్రతిభను గుర్తించిన బీసీసీఐ 2022లో ఆయనను భారత జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా నియమించింది.

ఫీల్డింగ్‌లో కొత్త సంస్కృతికి శ్రీకారం

టీ దిలీప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత జట్టులో ఫీల్డింగ్‌కు కొత్త ప్రాధాన్యం లభించింది. ప్రతి మ్యాచ్ తర్వాత అత్యుత్తమ ఫీల్డర్‌ను గుర్తిస్తూ బెస్ట్ ఫీల్డర్ మెడల్ సంప్రదాయాన్ని ప్రారంభించారు. డ్రెస్సింగ్‌రూమ్‌లో ఈ అవార్డును వినూత్నంగా అందించే విధానం ఆటగాళ్లలో పోటీ తత్వాన్ని పెంచింది. దీంతో ప్రతి ఆటగాడు క్యాచ్‌లు, డైవింగ్ సేవ్‌లు, వేగవంతమైన త్రోలు, గ్రౌండ్ ఫీల్డింగ్‌పై మరింత దృష్టి పెట్టడం ప్రారంభించాడు.

భారత్ ఫీల్డింగ్‌లో కనిపించిన మార్పులు

టీ దిలీప్ హయాంలో భారత జట్టు ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డింగ్ జట్లలో ఒకటిగా ఎదిగింది. కీలక మ్యాచ్‌ల్లో క్యాచ్‌లు వదిలే సందర్భాలు తగ్గాయి. బౌండరీల వద్ద అద్భుతమైన సేవ్‌లు, నేరుగా వికెట్లను లక్ష్యంగా చేసుకున్న త్రోలు, రన్‌ఔట్లు పెరగడం వంటి మార్పులు స్పష్టంగా కనిపించాయి. ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ఆటగాళ్ల చురుకుదనం కూడా పెరిగింది. విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్ వంటి ఆటగాళ్లు ఫీల్డింగ్‌లో మరింత మెరుగైన ప్రదర్శన కనబరిచారు.

నాలుగేళ్లలో గుర్తుండిపోయే విజయాలు

టీ దిలీప్ సేవల కాలంలో భారత జట్టు అనేక కీలక సిరీస్ విజయాలు సాధించింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్ వంటి ప్రధాన టోర్నీల్లో భారత జట్టు ఫీల్డింగ్‌కు ప్రశంసలు లభించాయి. ముఖ్యంగా ఒత్తిడి పరిస్థితుల్లో కూడా ఆటగాళ్లు అసాధారణ ఫీల్డింగ్ ప్రదర్శించడం వెనుక టీ దిలీప్ శిక్షణ కీలక పాత్ర పోషించిందని పలువురు మాజీ క్రికెటర్లు పేర్కొన్నారు.

కేవలం కోచ్ మాత్రమే కాదు.. గొప్ప ప్రేరణ

టీ దిలీప్ ఆటగాళ్లతో స్నేహపూర్వకంగా మెలుగుతూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. శిక్షణను ఆసక్తికరంగా మార్చడం, ప్రతి ఆటగాడి బలాబలాలను విశ్లేషించి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం ఆయన ప్రత్యేకత. అందుకే భారత జట్టులోని యువ ఆటగాళ్ల నుంచి సీనియర్ల వరకు అందరూ ఆయనను ఎంతో గౌరవంగా చూసేవారు.

భారత ఫీల్డింగ్‌పై చెరగని ముద్ర

నాలుగేళ్ల కాలంలో టీ దిలీప్ భారత క్రికెట్ జట్టులో ఫీల్డింగ్‌కు కొత్త ప్రమాణాలను తీసుకొచ్చారు. ఫీల్డింగ్‌ను కేవలం సహాయక విభాగంగా కాకుండా మ్యాచ్‌ను గెలిపించే ప్రధాన ఆయుధంగా మార్చారు. ఆయన రూపొందించిన శిక్షణ విధానాలు, ఫిట్‌నెస్ ప్రమాణాలు, పోటీ స్ఫూర్తిని పెంచే కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా భారత జట్టుకు ఉపయోగపడే అవకాశముంది. భారత క్రికెట్‌లో ఫీల్డింగ్ సంస్కృతిని మరింత బలోపేతం చేసిన కోచ్‌గా టీ దిలీప్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఒక ఫీల్డింగ్ కోచ్ కోసం టీమిండియా క్రికెటర్ల కన్నీళ్లు!
ఒక ఫీల్డింగ్ కోచ్ కోసం టీమిండియా క్రికెటర్ల కన్నీళ్లు!
ఈ 3 భారతీయ నగరాల్లో దొరికే స్ట్రీట్ ఫుడ్‌కు ప్రపంచమే ఫిదా!
ఈ 3 భారతీయ నగరాల్లో దొరికే స్ట్రీట్ ఫుడ్‌కు ప్రపంచమే ఫిదా!
డిగ్రీ ప్రవేశాలకు ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ 2026 విడుదల
డిగ్రీ ప్రవేశాలకు ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ 2026 విడుదల
కీలక గ్రహాల అనుకూలత.. వారికి ఆర్థిక, రుణ సమస్యల నుంచి విముక్తి!
కీలక గ్రహాల అనుకూలత.. వారికి ఆర్థిక, రుణ సమస్యల నుంచి విముక్తి!
రోజూ చపాతీలు తింటున్నా బరువు తగ్గట్లేదా? కారణమిదే..
రోజూ చపాతీలు తింటున్నా బరువు తగ్గట్లేదా? కారణమిదే..
కరెంట్ బిల్లు మీ పేరు మీదకు మార్చకోవాలా..? ఆన్‌లైన్‌లో ఇలా
కరెంట్ బిల్లు మీ పేరు మీదకు మార్చకోవాలా..? ఆన్‌లైన్‌లో ఇలా
పబ్జీని చూసి ఫాలో అయినట్టున్నాడు.. భార్యను ఎలా చంపేశాడో తెలిస్తే
పబ్జీని చూసి ఫాలో అయినట్టున్నాడు.. భార్యను ఎలా చంపేశాడో తెలిస్తే
అతి ఉత్సాహం, తొందరపాటు అస్సలు మంచిది కాదు.. తాబేలు - కొంగ కథ
అతి ఉత్సాహం, తొందరపాటు అస్సలు మంచిది కాదు.. తాబేలు - కొంగ కథ
త్రిషకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే.. ఖుష్బూ
త్రిషకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే.. ఖుష్బూ
వీటితో యూరినరీ ఇన్ఫెక్షన్ నుంచి మలబద్దకం వరకు చెక్ పెట్టొచ్చు
వీటితో యూరినరీ ఇన్ఫెక్షన్ నుంచి మలబద్దకం వరకు చెక్ పెట్టొచ్చు
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!