Saaniya Chandok : టెండుల్కర్ కాబోయే కోడలు ఆస్తులెంతో తెలుసా ? ఏడాదికి ఎన్ని కోట్లు సంపాదిస్తుందంటే ?
అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్ నిశ్చితార్థం చేసుకున్నారు. సానియా ముంబైలోని ఒక సంపన్న వ్యాపార కుటుంబానికి చెందినది. ఆమె తాత ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘై. వారి కుటుంబ వ్యాపారాలు, సానియా స్వంత వ్యాపారం, వారి నికర విలువ గురించి తెలుసుకుందాం.

Saaniya Chandok : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఇటీవల సానియా చందోక్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ వేడుకకు రెండు కుటుంబాల సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సచిన్ కుటుంబంతో సంబంధం పెట్టుకున్న తర్వాత, సానియా ఆమె కుటుంబం గురించి తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. సానియా చందోక్ కుటుంబం ఎంత రిచ్, వారి బిజినెస్ లేంటి, ఆమె నికర విలువ గురించి వివరంగా తెలుసుకుందాం.
సానియా చందోక్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి పట్టభద్రురాలయ్యారు. ఆమె ముంబైలోని ఒక ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందినవారు. సానియా, ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘై మనవరాలు. ఆమె స్వయంగా ముంబైలోని మిస్టర్ పాజ్ పెట్ స్పా అండ్ స్టోర్ ఎల్‌ఎల్‌పిలో డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. నియా కుటుంబానికి భారతదేశంలో ఫుడ్ అండ్ టాలిటీ రంగంలో గొప్ప పేరుంది. ఆమె తాత రవి ఘై, ఇంటర్‌కాంటినెంటల్ మెరైన్ డ్రైవ్ హోటల్, బ్రూక్లిన్ క్రీమెరి (తక్కువ క్యాలరీలు గల ఐస్‌క్రీమ్ బ్రాండ్) యజమాని.
బ్రూక్లిన్ క్రీమెరి నికర విలువను వెల్లడించనప్పటికీ దాని మాతృ సంస్థ గ్రావిస్ ఫుడ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక సంవత్సరం 2023-24లో రూ.624 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 20% ఎక్కువ. కంపెనీ అధీకృత మూలధనం రూ.2.23 కోట్లు, చెల్లింపు మూలధనం రూ.90,100.
ఘై కుటుంబం ఇంటర్‌కాంటినెంటల్ హోటల్స్ గ్రూప్ కింద ముంబైలో ఇంటర్‌కాంటినెంటల్ హోటల్ కూడా నిర్వహిస్తోంది. నివేదిక ప్రకారం, ఈ హోటల్ విలువ ఆగస్టు 2025 నాటికి 18.43 బిలియన్ డాలర్లు. ఈ లెక్కన సానియా చందోక్ కుటుంబం చాలా సంపన్నమైనదిగా తెలుస్తోంది.
సానియా చందోక్ స్వయంగా ఒక వ్యాపారవేత్త. ఆమె మిస్టర్ పాజ్ పెట్ స్పా అండ్ స్టోర్ ఎల్‌ఎల్‌పిలో డైరెక్టర్‌గా, నామినేటెడ్ భాగస్వామిగా ఉన్నారు. ఈ పెట్ స్పాను 2022లో సుమారు రూ.90 లక్షల అధీకృత మూలధనంతో ప్రారంభించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ వ్యాపారం వారి కుటుంబంలోని పెద్ద బ్రాండ్‌లతో పోలిస్తే చిన్నదే అయినా, సానియా స్వంత టాలెంట్, పారిశ్రామిక నైపుణ్యాన్ని ఇది సూచిస్తుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




