Video: కేవలం 15 బంతుల్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ.. 333 స్ట్రైక్ రేట్‌తో రికార్డులపై సికిందర్ రజా శివతాండవం..
Sikandar Raza Fastest Half Century: సికందర్ రజా కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేయడం ద్వారా జిమ్ ఆఫ్రో T10 లీగ్‌లో వేగవంతమైన హాఫ్ సెంచరీతో రికార్డు సృష్టించాడు.
Zim Afro T10 2023: జింబాబ్వేలో జరుగుతున్న జిమ్ ఆఫ్రో T10 లీగ్‌లో సికందర్ రజా మెరుపు హాఫ్ సెంచరీ సాధించి రికార్డు సృష్టించాడు. హరారే హరికేన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో బులవాయో బ్రేవ్స్ కెప్టెన్ సికిందర్ రజా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇన్నింగ్స్ ప్రారంభించిన బులవాయో హరారే హరికేన్స్‌కు రాబిన్ ఉతప్ప, ఎవిన్ లూయిస్ తుఫాన్ ఆరంభాన్ని అందించారు. ఈ జోడీ 5 ఓవర్లలో 76 పరుగులు చేసి బులవాయో బౌలర్లను చిత్తుగా కొట్టేసింది.
ఈ దశలో దాడికి దిగిన ఎవిన్ లూయిస్ 19 బంతుల్లో 6 భారీ సిక్సర్లు, 2 ఫోర్లతో 49 పరుగులు చేసిన తర్వాత వికెట్ కోల్పోయాడు. మరోవైపు 15 బంతుల్లో 32 పరుగులు చేసిన రాబిన్ ఉతప్పను ప్యాట్రిక్ అవుట్ చేశాడు.
6వ స్థానంలో బ్యాటింగ్ చేసిన ఇర్ఫాన్ పఠాన్ 9 బంతుల్లో 4 ఫోర్లతో అజేయంగా 18 పరుగులు చేశాడు. ఫలితంగా హరారే హరికేన్స్ స్కోరు 10 ఓవర్లలో 134 పరుగులకు చేరుకుంది.
60 బంతుల్లో 135 పరుగుల కఠినమైన లక్ష్యంతో బరిలోకి దిగిన బులవాయో బ్రేవ్స్‌కు కోబ్ హర్ట్ శుభారంభం అందించాడు. కేవలం 23 బంతులు ఎదుర్కొన్న కోబ్ 3 సిక్సర్లు, 3 ఫోర్లతో 41 పరుగులు చేశాడు.
మూడో స్థానంలోకి అడుగుపెట్టిన సికందర్ రజా బౌలర్లను చీల్చి చెండాడాడు. హరారే హరికేన్స్ బౌలర్లను ఫోకస్ చేస్తూ.. క్రీజులోకి వచ్చిన వెంటనే రజా ఫాస్ట్ బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాడు. ఫలితంగా రజా కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు.
FASTEST 50 OF THE TOURNAMENT! ⚡️⚡️⚡️
Who else but @SRazaB24#ZimAfroT10 #CricketsFastestFormat #T10League #InTheWild #BBvHH pic.twitter.com/rHey08rmGI
— ZimAfroT10 (@ZimAfroT10) July 24, 2023
అర్ధసెంచరీ అనంతరం మెరుపులు మెరిపించిన సికందర్ రజా కేవలం 21 బంతుల్లోనే 6 భారీ సిక్సర్లు, 5 ఫోర్లతో 70 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కాగా, బులవాయో బ్రేవ్స్ జట్టు 9 ఓవర్లలో 133 పరుగులు చేసింది. ఇక చివరి ఓవర్‌లో బులవాయో బ్రేవ్స్ 3 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
సికిందర్ రజా రికార్డ్..
ఈ మ్యాచ్‌లో సికందర్ రజా కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి జిమ్ ఆఫ్రో టీ10 లీగ్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీగా రికార్డు సృష్టించాడు.
బులవాయో బ్రేవ్స్ ప్లేయింగ్ 11: బెన్ మెక్‌డెర్మాట్ (వికెట్ కీపర్), బ్యూ వెబ్‌స్టర్, సికందర్ రజా (కెప్టెన్), ర్యాన్ బర్ల్, టిమిసెన్ మారుమా, తిసారా పెరీరా, పాట్రిక్ డూలీ, జాక్ ప్రెస్‌విడ్జ్, టైమల్ మిల్స్, తస్కిన్ అహ్మద్, ఫరాజ్ అక్రమ్.
హరారే హరికేన్స్ ప్లేయింగ్ 11: రాబిన్ ఉతప్ప (వికెట్ కీపర్), ఎవిన్ లూయిస్, రెగిస్ చకబ్వా, డోనవన్ ఫెరీరా, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మహ్మద్ నబీ, ఇర్ఫాన్ పఠాన్, సమిత్ పటేల్, బ్రాండన్ మవుటా, ఆండ్రీ బెర్గర్, ల్యూక్ జోంగ్వే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..