టార్గెట్ 304.. కట్‌చేస్తే.. 60కే ఆలౌట్.. 6 ఓవర్లలో 17 పరుగులు, 5 వికెట్లతో ప్రత్యర్థులకు సుస్సు పోయించిన బౌలర్..
Deodhar Trophy 2023, Vidhwath Kaverappa: సౌత్ జోన్ తరుపున విధ్వాత్ కవేరప్పా ఫైరింగ్ బౌలింగ్‌తో కేవలం 17 పరుగులిచ్చి 5 వికెట్లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు.
Deodhar Trophy 2023, Vidhwath Kaverappa: పుదుచ్చేరిలో జరిగిన దేవధర్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో సౌత్ జోన్ జట్టు అద్భుత విజయం సాధించింది. నార్త్ జోన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో కువర విధ్వత్ కావేరప్పా హీరోగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో సౌత్ జోన్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
అందుకు తగ్గట్టుగానే ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రోహన్ కున్నుమ్మల్, మయాంక్ అగర్వాల్‌లు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఈ జోడీ భారీ స్కోరుకు గట్టి పునాది వేసింది. 61 బంతులు ఎదుర్కొన్న రోహన్ 3 భారీ సిక్సర్లు, 8 ఫోర్లతో 70 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
మరోవైపు మయాంక్ అగర్వాల్ 68 బంతుల్లో 64 పరుగులు చేశాడు. కానీ, మూడో స్థానంలో వచ్చిన దేవదత్ పడిక్కల్ 17 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ ఎన్. జగదీశన్ 66 బంతుల్లో 3 భారీ సిక్సర్లు, 4 ఫోర్లతో 72 పరుగులు చేశాడు. దీంతో జట్టు స్కోరు 300 దాటడంలో కీలక పాత్ర పోషించాడు. చివరకు సౌత్ జోన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది.
304 పరుగుల కఠిన లక్ష్యంతో బరిలోకి దిగిన నార్త్ జోన్ జట్టుకు విధ్వత్ కావేరప్పా షాక్ ఇచ్చాడు. మూడో ఓవర్లో అభిషేక్ శర్మ (1), శుభమ్ ఖజురియా (10) వికెట్లు తీసి సౌత్ జోన్‌కు విధ్వత్ శుభారంభం అందించారు.
5వ ఓవర్లో విధ్వత్ కావేరప్పా ప్రభసిమ్రన్ సింగ్ (2), కెప్టెన్ నితీష్ రాణా (4) వికెట్లు తీశాడు. అలాగే వివ్రాంత్ శర్మ (4)ను అవుట్ చేయడం ద్వారా వి కౌశిక్ 5వ వికెట్‌ను అందుకున్నాడు.
నార్త్ జోన్ జట్టు కేవలం 26 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈసారి వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. ఆ తర్వాత మ్యాచ్ ప్రారంభం కాగానే వీజేడీ నిబంధనల ప్రకారం 35 ఓవర్లలో 262 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.
కానీ, అప్పటికే మ్యాచ్ మొత్తం తన ఆధీనంలోకి తీసుకున్న సౌత్ జోన్ టీం విజయం వైపు పయణించడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. మరో బౌలర్ విజయకుమార్ వైశాఖ్ మరో రెండు వికెట్లు పడగొట్టాడు. సందీప్ శర్మ ఒక వికెట్, విద్వాత్ కవేరప్ప 5 వికెట్లు తీశారు. ఫలితంగా నార్త్ జోన్ జట్టు కేవలం 60 పరుగులకే ఆలౌటైంది. సౌత్ జోన్ తరపున విధ్వత్ కావేరప్పా 6 ఓవర్లలో 17 పరుగులిచ్చి 5 వికెట్లతో మెరిశాడు.
నార్త్ జోన్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, మన్‌దీప్ సింగ్, నితీష్ రాణా (కెప్టెన్), శుభమ్ ఖజురియా, వివ్రాంత్ శర్మ, మయాంక్ మార్కండే, రిషి ధావన్, మయాంక్ దాగర్, మయాంక్ యాదవ్, సందీప్ శర్మ.
సౌత్ జోన్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, ఎన్ జగదీషన్ (వికెట్ కీపర్), అరుణ్ కార్తీక్, రికీ భుయ్, వాషింగ్టన్ సుందర్, రోహన్ కున్నుమ్మల్, సాయి కిషోర్, వాసుకి కౌశిక్, విజయ్‌కుమార్ వైశాక్, విధ్వత్ కావేరప్పా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..