Team India: ఫినిషింగ్‌లో ధోని.. దూకుడులో పంత్‌ని దించేశాడుగా.. వన్డే ప్రపంచకప్‌తో టీమిండియాలోకి ఎంట్రీ పక్కా..

Indian Cricket Team Wicketkeeper: ధోని శైలి, సంయమనంతో, ఫినిషర్‌గా ప్రసిద్ధి చెందాడు. పంత్ ఇమేజ్ దూకుడు బ్యాట్స్‌మన్‌గా మారింది. ఇప్పుడు ఈ ఇద్దరిని మిక్సింగ్ చేస్తూ.. మరో ప్లేయర్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చేశాడు.

Team India: ఫినిషింగ్‌లో ధోని.. దూకుడులో పంత్‌ని దించేశాడుగా.. వన్డే ప్రపంచకప్‌తో టీమిండియాలోకి ఎంట్రీ పక్కా..
Jitesh Sharma
Follow us
Venkata Chari

|

Updated on: Jul 25, 2023 | 6:20 PM

Indian Cricket Team Wicketkeeper: భారత అత్యంత విజయవంతమైన వికెట్ కీపర్ల గురించి మాట్లాడితే, వెటరన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) పేరు అగ్రస్థానంలో ఉంటుంది. ధోనీ సారథ్యంలో టీమిండియా రెండు ప్రపంచకప్‌లు గెలిచింది. ధోనీ తర్వాత రిషబ్ పంత్ టీమిండియా వికెట్ కీపర్ బాధ్యతలు స్వీకరించాడు. ధోని శైలి, సంయమనంతో, ఫినిషర్‌గా ప్రసిద్ధి చెందాడు. పంత్ ఇమేజ్ దూకుడు బ్యాట్స్‌మన్‌గా మారింది. ఇప్పుడు ఈ ఇద్దరిని మిక్సింగ్ చేస్తూ.. మరో ప్లేయర్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.

ఐపీఎల్‌లో ప్రకంపనలు సృష్టించిన ధోనీ-పంత్‌ల మిక్సింగ్..

ఈ ఆటగాడు మరెవరో కాదు, పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్న వికెట్ కీపర్ జితేష్ శర్మ. జితేష్ తన మొత్తం టీ20 కెరీర్‌లో 90 మ్యాచ్‌లలో 150 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లోని 24 ఇన్నింగ్స్‌ల్లో 44 ఫోర్లు, 33 సిక్సర్లు బాదిన ఈ ఆటగాడి బలం, ఫినిషర్ పాత్రను అంచనా వేయవచ్చు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జితేష్ ఈ విషయం గురించే ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు.

పవర్‌ షాట్లతో దూకుడు..

ఫినిషర్ పాత్ర గురించి జితేష్ శర్మ మాట్లాడుతూ, ‘మంచి అలవాట్లు మనతోనే ఉంటాయి. ‘పవర్ హిట్టింగ్’ అనేది నేను పెంచి, పోషించుకున్న అలవాటు. సాధన సమయంలో మంచి అలవాట్లను అలవర్చుకోవడంపై దృష్టి సారిస్తాను. ప్రాక్టీస్ సమయంలో మీరు ఎక్కువగా చేసే పని, మైదానంలో సులభం అవుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. సాధారణంగా చివరి 10 ఓవర్లలో బ్యాటింగ్ చేసే జితేష్ ఒత్తిడిలో బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతాడు. చివరి ఓవర్లలో బ్యాటింగ్ చేస్తున్నట్టుగా దీన్ని దృష్టిలో ఉంచుకుని సాధన చేస్తున్నాడు.

సాధన సమయంలో ప్రత్యేక వ్యూహాం..

ఈ 29 ఏళ్ల ఆటగాడు మాట్లాడుతూ, ‘ప్రాక్టీస్ సమయంలో, నేను మ్యాచ్ ఏదైనా, ఎలాంటి పరిస్థితిలో ఉనా ఆలోచిస్తూ బ్యాటింగ్ చేస్తాను. తర్వాత 16, 17, 18 ఓవర్లలో బ్యాటింగ్ గురించే ప్రత్యేకంగా ఆలోచిస్తాను. అప్పుడు నేను ఊహాత్మక మ్యాచ్ పరిస్థితులలో నన్ను నేను ఉంచుకుని సాధన చేస్తాను. జట్టుకు 12 బంతుల్లో 30 పరుగులు లేదా 6 బంతుల్లో 18 పరుగులు లేదా 3 బంతుల్లో 12 పరుగులు అవసరమని భావించి ప్రాక్టీస్ చేస్తాను. ఈ సందర్భంగా ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్‌కు కృతజ్ఞతలు తెలిపాడు’.

కెరీర్ ఎలా ఉందంటే?

దేశవాళీ క్రికెట్‌లో విదర్భ తరపున ఆడుతున్న జితేష్‌కు అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం ఇంకా రాలేదు. అతను ఇప్పటివరకు 17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 4 హాఫ్ సెంచరీల సాయంతో 632 పరుగులు చేశాడు. ఇది కాకుండా అతను 2 సెంచరీలు, 7 అర్ధ సెంచరీల సహాయంతో జాబితా A లో 1350 పరుగులు జోడించాడు. అదే సమయంలో అతను T20 మ్యాచ్‌లలో ఒక సెంచరీ, 9 అర్ధ సెంచరీలు చేశాడు. అతను 90 మ్యాచ్‌లలో 2096 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..