AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: భారీ సిక్సర్‌ బాదిన బ్యాటర్.. పొలాల్లో పడిన బంతి.. కట్‌చేస్తే.. ఓ వ్యక్తి చేసిన పనికి అంతా షాక్

TNPL 2024: ఈ మ్యాచ్‌లో సిచెమ్ మదురై పాంథర్స్ జట్టు చివరి ఓవర్‌లో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మదురై సారథ్యంలో హరి నిశాంత్ 191 పరుగులు చేసింది. పైగా లోకేశ్వర్ 55 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. జె కౌసిక్ 24 బంతుల్లో 43 పరుగులు చేశాడు. దానికి సమాధానంగా చెపాక్‌ కూడా అద్భుత ఆటను ప్రదర్శించింది. ప్రమోద్ రంజన్ పాల్ 52 పరుగులు చేశాడు. ఆ తర్వాత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. చెపాక్‌ విజయానికి చివరి ఓవర్‌లో 16 పరుగులు చేయాల్సి ఉంది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ 6 పరుగులు మాత్రమే చేయగలిగారు.

Video: భారీ సిక్సర్‌ బాదిన బ్యాటర్.. పొలాల్లో పడిన బంతి.. కట్‌చేస్తే.. ఓ వ్యక్తి చేసిన పనికి అంతా షాక్
Tnpl Viral Six Video
Venkata Chari
|

Updated on: Jul 31, 2024 | 7:19 AM

Share

TNPL 2024: తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL) మ్యాచ్‌లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దిండిగల్‌లోని ఎన్‌పీఆర్‌ కళాశాల మైదానంలో చెపాక్‌ సూపర్‌ గిల్లీస్‌, సిచెమ్‌ మదురై పాంథర్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఒక సూపర్ గిల్లీస్ బ్యాట్స్‌మెన్ చాలా బలమైన షాట్ ఆడాడు. దీంతో ఆ బంతి సిక్సర్‌గా మారింది. ఈ బలమైన షాట్‌కు బంతి స్టేడియం నుంచి బయటకు వెళ్లి పడింది. ఈ స్టేడియం పొలాల మధ్యలో నిర్మించడంతో.. అక్కడో సరదా సీన్ కనిపించింది.

బంతిని తిరిగి ఇవ్వని వ్యక్తి..

భారీ సిక్స్ కావడంతో బంతి స్టేడియం వెలుపలకు వెళ్లి పొలాల్లో పడింది. అయితే, అక్కడే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒకరికి బంతిని తీసుకున్నాడు. అయితే, బంతిని వెనకకు విసరకుండా.. తనతోపాటే తీసుకుకెళ్లాడు. ఈ ఘటన మొత్తం కెమెరాలో చిక్కింది. కొన్ని క్షణాల తర్వాత, కెమెరాలో మరోసారి చూడగా.. ఆ వ్యక్తి చెట్టు కింద మంచం మీద పడుకుని విశ్రాంతి తీసుకుని కనిపించాడు.

ఇవి కూడా చదవండి

మదురై పాంథర్స్ విజయం..

ఈ మ్యాచ్‌లో సిచెమ్ మదురై పాంథర్స్ జట్టు చివరి ఓవర్‌లో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మదురై సారథ్యంలో హరి నిశాంత్ 191 పరుగులు చేసింది. పైగా లోకేశ్వర్ 55 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. జె కౌసిక్ 24 బంతుల్లో 43 పరుగులు చేశాడు. దానికి సమాధానంగా చెపాక్‌ కూడా అద్భుత ఆటను ప్రదర్శించింది. ప్రమోద్ రంజన్ పాల్ 52 పరుగులు చేశాడు. ఆ తర్వాత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. చెపాక్‌ విజయానికి చివరి ఓవర్‌లో 16 పరుగులు చేయాల్సి ఉంది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ 6 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో సిచెమ్ మదురై పాంథర్స్ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది.

జులై 5 నుంచి ప్రారంభమైన ఈ లీగ్‌లో గ్రూప్ రౌండ్ మ్యాచ్‌లు ముగిశాయి. నేటి నుంచే ప్లేఆఫ్‌లు ప్రారంభం కానున్నాయి. మొదటి క్వాలిఫైయర్ లైకా కోవై కింగ్స్ వర్సెస్ ఐడ్రీమ్ తిరుప్పూర్ తమిజన్‌ల మధ్య జరుగుతుంది. ఆ తర్వాత, రేపు అంటే జులై 31న చెపాక్ వర్సెస్ దిండిగల్ డ్రాగన్స్ మధ్య ఎలిమినేటర్ జరగనుంది. ఆగస్టు 4న ఫైనల్ జరగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..