AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Hall of Fame: ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో టీమిండియా డేంజరస్ ప్లేయర్‌కు చోటు.. మరో ఇద్దరు ఎవరంటే?

ICC Hall of Fame: ప్రస్తుతం ఉన్న హాల్ ఆఫ్ ఫేమర్స్, మీడియా ప్రతినిధులు, FICA, సీనియర్ ICC ఎగ్జిక్యూటివ్‌ల మధ్య జరిగిన ఓటింగ్ ప్రక్రియ తర్వాత భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, శ్రీలంక 1996 ప్రపంచ కప్ విజేత హీరో అరవింద్ డి సిల్వాతోపాటు భారత మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీలను ICC హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించినట్లు ICC ఒక ప్రకటనలో తెలిపింది.

ICC Hall of Fame: ఐసీసీ 'హాల్ ఆఫ్ ఫేమ్'లో టీమిండియా డేంజరస్ ప్లేయర్‌కు చోటు.. మరో ఇద్దరు ఎవరంటే?
Icc Hall Of Fame Sehwa
Venkata Chari
|

Updated on: Nov 13, 2023 | 4:08 PM

Share

ICC Hall of Fame: భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, శ్రీలంక 1996 ప్రపంచకప్ విజేత హీరో అరవింద డి సిల్వా, భారత మహిళా మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ICC హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చింది. ప్రస్తుతం ఉన్న హాల్ ఆఫ్ ఫేమర్స్, మీడియా ప్రతినిధులు, FICA, సీనియర్ ICC ఎగ్జిక్యూటివ్‌ల మధ్య జరిగిన ఓటింగ్ ప్రక్రియ తర్వాత ఈ ముగ్గురూ ICC హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించినట్లు ICC ఒక ప్రకటనలో తెలిపింది.

సెహ్వాగ్ కెరీర్..

తన దూకుడు బ్యాటింగ్ కారణంగా ప్రపంచ క్రికెట్ దిగ్గజ బౌలర్లకు చెమటలు పట్టించిన వీరేంద్ర సెహ్వాగ్.. భారత్ తరపున 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 49.34 సగటుతో 8,586 పరుగులు చేసిన వీరూ.. బౌలింగ్‌లోనూ 40 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో 23 సెంచరీలు కూడా చేశాడు.

వన్డే ఫార్మాట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సెహ్వాగ్ 1 డబుల్ సెంచరీ, 15 సెంచరీలు, 38 అర్ధసెంచరీలతో 8,273 పరుగులు చేశాడు. 2011లో ఇండోర్‌లో వెస్టిండీస్‌పై 219 పరుగులు చేయడం సెహ్వాగ్ అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.

అలాగే, 2011లో భారత్‌కు రెండో వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను అందించిన సెహ్వాగ్, మొత్తం ప్రపంచకప్‌లో 380 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన లిస్టులో 7వ స్థానంలో నిలిచాడు.

సంతోషం వ్యక్తం చేసిన సెహ్వాగ్…

నన్ను ఈ జాబితాలో చేర్చినందుకు ఐసీసీకి, అంపైర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అంటూ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చిన తర్వాత సెహ్వాగ్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. నేను చాలా ఇష్టపడే క్రికెట్‌లో నా జీవితంలో ఎక్కువ భాగం గడిపినందుకు చాలా కృతజ్ఞుడను. నా కోసం నిస్వార్థంగా ప్రార్థించిన నా కుటుంబం, స్నేహితులు, లెక్కలేనన్ని మందికి నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను అంటూ అందులో రాసుకొచ్చాడు.

తొలి భారత మహిళా క్రికెటర్..

కాగా, 17 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఎడుల్జీ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించిన తొలి భారతీయ మహిళా క్రికెటర్‌గా గుర్తింపు పొందింది. ఎడుల్జీ తన మూడు దశాబ్దాల కెరీర్‌లో భారత్ తరపున 54 మ్యాచ్‌లు ఆడింది. అలాగే సాంప్రదాయ లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్న ఎడుల్జీ భారత్ తరపున 100కి పైగా వికెట్లు పడగొట్టింది. వృత్తిపరమైన జీవితానికి వీడ్కోలు పలికిన తర్వాత కూడా భారత మహిళా జట్టుకు మెంటార్‌గా సేవలందించారు.

ఈ సన్మానం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఎడుల్జీ, ‘భారత మహిళా క్రికెట్‌కు ఇది ‘గర్వనీయమైన క్షణం’ అంటూ చెప్పుకొచ్చారు. తన కెరీర్‌కు మద్దతుగా నిలిచిన బీసీసీఐ, కుటుంబ సభ్యులు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీలంక నాలుగో ఆటగాడిగా..

వీరిద్దరితో పాటు, శ్రీలంక వెటరన్ బ్యాట్స్‌మెన్ అరవింద డి సిల్వా కూడా ఈ గౌరవంతో సత్కరించారు. ఇప్పుడు ముత్తయ్య మురళీధరన్, కుమార్ సంగక్కర, మహేల జయవర్ధనే తర్వాత హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించిన నాల్గవ శ్రీలంక ఆటగాడిగా నిలిచాడు.

1996 ప్రపంచకప్ ఫైనల్‌లో డిసిల్వా చేసిన సెంచరీ శ్రీలంక ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించడంలో కీలకపాత్ర పోషించింది. డిసిల్వా లంక తరపున 93 టెస్టుల్లో 29 వికెట్లు పడగొట్టాడు. 42.97 సగటుతో 6,361 పరుగులు చేశాడు. అతను 308 ODIల్లో 34.90 సగటుతో 9,284 పరుగులు, 106 వికెట్లు కూడా పడగొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..