Ind vs Aus: ఆ టీమిండియా ప్లేయర్ అంటే ఆస్ట్రేలియాకు ఎందుకు అంత భయం?

ఆస్ట్రేలియా మీడియాకు విరాట్ కోహ్లీ ఫీవర్ పట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఆస్ట్రేలియా మీడియా హిందీ, పంజాబీ భాషలలో విరాట్ ఫోటోలను ప్రచురించింది. అలాగే యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ లను కూడా హైలెట్ చేశాయి.

Ind vs Aus: ఆ టీమిండియా ప్లేయర్ అంటే ఆస్ట్రేలియాకు ఎందుకు అంత భయం?
Virat On Front Page As Aussie Newspaper Printed In Hindi, Punjab
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Nov 12, 2024 | 6:58 PM

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టుకు 10 రోజుల ముందే ఆస్ట్రేలియా మీడియాకు  విరాట్ కోహ్లీ ఫీవర్ పట్టుకున్నట్లు కనిపిస్తుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం పెర్త్‌కు వచ్చిన కోహ్లి, ఆస్ట్రేలియన్ వార్తాపత్రికల సమూహంలో మొదటి పేజీల్లో దర్శనమిచ్చాడు. ఆస్ట్రేలియా మీడియా హిందీ, పంజాబీ భాషలలో విరాట్ ఫోటోలను ప్రచురించింది. అలాగే యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ పై కూడా కథనాలు ప్రచురిస్తున్నారు. ఈ ఇద్దరు యంగ్ ఆటగాళ్లను హైలెట్ చేస్తూ.. మొదటి పేజీలో “యుగోన్ కి లడాయి” (“యుగాల కోసం పోరాటం” ) అనే బోల్డ్ హిందీ హెడ్‌లైన్ తో ప్రత్యేక కథనం ప్రచురించారు. పంజాబీ హెడ్‌లైన్ “నవం రాజా” లేదా “ది న్యూ కింగ్”తో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను కీర్తించారు.

WACA గ్రౌండ్‌లో టీమిండియా ప్రాక్టిస్ ఈరోజు మొదలైంది. కోహ్లి ఎలా సిద్ధమవుతాడో చూడాలని భారత అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పరదా అడ్డుగా భారత జట్టు ప్రాక్టీస్ సెషన్‌లు కొనసాగుతున్నాయి. కోహ్లీ ఫామ్ లేక సమస్యలను ఎదుర్కొంటున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 15.50 సగటుతో కేవలం 93 ​​పరుగులు చేయడంతో కోహ్లీ ఆటతీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో ఎలాగైనా ఆడాలని విరాట్ పై ఒత్తిడి పెరిగింది.

భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. భారత జట్టు ఇప్పటికే రెండు భాగాలుగా ఆస్ట్రేలియా వెళ్లింది. అయితే, ఆస్ట్రేలియా వెళ్లే ముందు గౌతమ్ గంభీర్ విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. అక్కడ అతను టీమ్ ఇండియా ప్రణాళికకు సంబంధించిన అనేక సమాచారాన్ని పంచుకున్నాడు. ఈ సమయంలో గంభీర్ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌పై బహిరంగంగా విమర్శలు చేశాడు. పాంటింగ్‌కి, భారత క్రికెట్‌కు ఉన్న సంబంధం ఏమిటి? ఆస్ట్రేలియా క్రికెట్ గురించి ఆలోచించాలని, విరాట్, రోహిత్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గంభీర్ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి