Virat Kohli: అందరికంటే ముందొచ్చాడు.. కానీ ప్రాక్టిస్ మ్యాచ్లో కనిపించలేదు.. ఏం జరిగుంటుంది?
న్యూజిలాండ్‌పై పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియా సిరీస్ చాలా ముఖ్యమైనది. ఇక్కడ విరాట్ ఇన్నింగ్స్ పైన ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే పెర్త్‌లో నేడు జరిగిన టీమ్ ఇండియా మొదటి ప్రాక్టీస్ సెషన్‌లో విరాట్ కోహ్లీ కనిపించలేదు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇంకా ప్రారంభమే కాలేదు.. కానీ ఇప్పుడే ఓ టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ హెడ్‌లైన్స్‌లో నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో విరాట్ వైఫల్యం చెందడంతో ఇటీవలే వార్తల్లో నిలిచాడు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియన్ మీడియాలో కోహ్లీ వస్తున్న స్పేస్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆస్ట్రేలియాలోని ప్రముఖ వార్తాపత్రికల మొదటి పేజీలో విరాట్ ఫోటోనే కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఇదే కాకుండా టీమ్ ఇండియాలోని మిగిలిన ఆటగాళ్ల కంటే ముందే రావడంతో హెడ్‌లైన్స్‌లో నిలిచాడు. పెర్త్‌లో నేడు జరిగిన టీమ్ ఇండియా మొదటి ప్రాక్టీస్ సెషన్‌లో విరాట్ కోహ్లీ కనిపించలేదు.
ప్రాక్టీస్ ప్రారంభించిన టీమిండియా:
ఈ సిరీస్ కోసం టీమిండియా ఆస్ట్రేలియాలోని పెర్త్ చేరుకుంది. అక్కడ నవంబర్ 22 నుండి మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. వివిధ బ్యాచ్‌లుగా టీమ్ ఇండియా ఇక్కడికి చేరుకుంది. కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ సహా ఐదుగురు ఆటగాళ్లు ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకుని భారత్ ఎ తరఫున ఆడుతున్నారన్నారు. విరాట్ మాత్రం అందరికంటే పెర్త్ కు చేరుకున్నాడు. భారతదేశం నుండి ఇతర ఆటగాళ్ళు కూడా గత 2 రోజుల్లో రెండు వేర్వేరు బ్యాచ్‌లలో ఆస్ట్రేలియా చేరుకున్నారు. వీరిలో కొందరు ఆటగాళ్లు ఈరోజు ప్రాక్టీస్ కూడా ప్రారంభించారు.
విరాట్ కోహ్లీ ఎక్కడ?
అయితే టీమిండియా ప్రాక్టీస్ సెషన్ ప్రారంభం నుంచి విరాట్ కోహ్లి కనిపిస్తాడని అంతా అనుకున్నారు. కానీ నెట్స్‌లో యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్, రిషబ్ పంత్ మరియు కెఎల్ రాహుల్ చాలా సేపు బ్యాటింగ్ చేస్తూ కనిపించగా, నవదీప్ సైనీ, ఆకాష్ దీప్, రవీంద్ర జడేజా కూడా జట్టుతో కలిసి నెట్స్‌లో సిద్ధమవుతున్నట్లు కనిపించారు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో కింగ్ ఫ్యాన్స్ కోహ్లీ ఎక్కడ? అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. రెండో ప్రాక్టీస్ సెషన్‌లోనైనా విరాట్ పాల్గొనాలని పలువురు కోరుతున్నారు.
But Virat Kohli reached Australia first?? 🥺🥺🥺 Why not coming to practice sessions https://t.co/evxF0pgRBq
— Veer (@pullxshot) November 12, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..