IPL 2025: మెగా ఆక్షన్ కి ముందే తనను తాను వేలం వేసుకున్న అశ్విన్

IPL 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో జెడ్డాలో జరుగనుండగా, 10 ప్రాంచైజీలు తమ జట్లను పునర్నిర్మించడానికి వ్యూహాలు రూపొందిస్తున్నాయి. మెగా వేలానికి ముందు రాజస్థాన్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాక్ వేలం నిర్వహించి, నవ్వులు పూయించారు. అశ్విన్ తన బేస్ ప్రైస్ రూ. 2 కోట్లు నిర్దేశించాడు.

IPL 2025: మెగా ఆక్షన్ కి ముందే తనను తాను వేలం వేసుకున్న అశ్విన్
Ashwin Auction
Follow us
Narsimha

|

Updated on: Nov 12, 2024 | 8:43 PM

బ్లాక్ బ్లస్టర్ ఐపిఎల్ మెగా వేలం నవంబర్ 24 మరియు 25 తేదీల్లో జెడ్డాలో జరగనుండగా, మొత్తం 10 ప్రాంచైజీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ క్రికెటర్లను వేలంలో కొనుగోలు చేయడానికి వ్యూహాలను రచించడంలో బిజీగా ఉన్నాయి.

10 ప్రాంచైజీలు ఇప్పటికీ తమకు అచ్చొచ్చిన ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా, ఇప్పుడు వారు తమ జట్లను పునర్నిర్మించడానికి వేలం పాటలో తమ దగ్గర నుంచి పర్సు వాల్యుని ఖర్చు చేయనున్నారు. అయితే మెగా వేలానికి ముందు రాజస్థాన్ స్పిన్నర్ ఆర్ ఆశ్విన్ మాక్ వేలం నిర్వహించాడు. తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసిన ఆ వీడియోలో అభిమానులు, క్రికెట్ ఔత్సాహికులు వివిధ సభ్యులుగా ఉండగా అశ్విన్ మాక్ వేలం నిర్వహిస్తూ అదరగొట్టాడు. తనని తాను వేలం వేసుకుని నవ్వులు పూయించిన అశ్విన్.. తన బెస్ ప్రైస్ 2 కోట్లుగా నిర్ణయించుకున్నాడు ప్రస్థుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా ఐపీఎల్ మెగా వేలంలో 10 ఫ్రాంచైజీలు ఆటగాళ్లను దక్కించుకోవడానికి సిద్దంగా ఉన్నాయి. 1,574 మంది ఆటగాళ్లు వేలంలో ఉండబోతున్నారు. ఈ జాబితాలో 1,165 మంది భారతీయులు, 409 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ ఆరుగురు ఆటగాళ్లతో తమ పూర్తి కోటాను ఉపయోగించిన కారణంగా IPL వేలం సమయంలో RTM (మ్యాచ్ హక్కు) ఎంపికను కలిగి ఉండదు.