IPL 2025: మెగా వేలంలో RTM ద్వారా SRH టార్గెట్ చేసే నలుగురు ఆటగాళ్లు వీరేనా..?
IPL 2025 మెగా వేలం సమీపిస్తుండటంతో, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టును బలోపేతం చేయడానికి సిద్ధమవుతోంది, వారి పర్సులో INR 45 కోట్లు ఉన్నాయి. SRH ఇప్పటికే ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. దీంతో ఇప్పుడు RTM కార్డ్‌తో అన్‌క్యాప్డ్ క్రికెటర్లను మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. SRH ఓ నలుగురు యువ ప్లేయర్స్ పై గురిపెట్టే అవకాశముంది.
IPL 2025 మెగా వేలం సమీపిస్తుండటంతో, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తమ జట్టును బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. వేలంలో టాలెంటెడ్ ప్లేయర్లను దక్కించుకోని జట్టును అన్ని రంగాల్లో బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
SRH పర్సులో INR 45 కోట్లుండగా ఒక రైట్ టు మ్యాచ్ (RTM) కార్డ్‌తో వేలంలోకి ప్రవేశించనున్నారు. దీనిని వారు ప్రత్యేకంగా అన్‌క్యాప్డ్ క్రికెటర్‌పై ఉపయోగించవచ్చు. ఐపీఎల్ రిటెన్షన్ గైడ్ లైన్స్ ప్రకారం ఏదైనా టీమ్ అన్ని రకాలుగా బ్యాలెన్స్ డ్ గా ఉండేలా వేలంలో కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించేలా రూపొందించబడ్డాయి.
SRH ఇప్పటికే ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్‌లను ఉంచుకున్నారు. హెన్రిచ్ క్లాసెన్ (INR 23 కోట్లు), పాట్ కమిన్స్ (INR 18 కోట్లు), అభిషేక్ శర్మ (INR 14 కోట్లు), ట్రావిస్ హెడ్ (INR 14 కోట్లు), నితీష్ కుమార్ రెడ్డి (INR 6 కోట్లు). ఐపీఎల్ నిబంధనల ప్రకారం SRH ఇకపై RTM కార్డ్‌ని ఉపయోగించినప్పటికీ అది అన్‌క్యాప్డ్ ప్లేయర్ ను మాత్రమే దక్కించుకునే అవకాశముంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) విడుదల చేసిన ఆటగాళ్లు అబ్దుల్ సమద్, ఐడెన్ మార్క్రామ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ అగర్వాల్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఉపేంద్ర సింగ్ యాదవ్, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, సన్వీర్ సింగ్, వనిందు హసరంగా, ఆకాష్ సింగ్, షాబాజ్ అహమద్, భువనేశ్వర్ కుమార్, ఫజల్హాక్ ఫరూక్ , జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే, ఝాతవేద్ సుబ్రమణ్యన్, విజయకాంత్ వియస్కాంత్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ చేయబోయే ఆటగాళ్లు:
- ఆకాష్ సింగ్: భరత్‌పూర్‌లో జన్మించిన 22 ఏళ్ల యువకుడు గత సీజన్‌లో ఒక్క మ్యాచ్ లో కూడా ఆడే అవకాశం దక్కించుకోలేదు. అయితే అతడికి చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ రెండింటిలోనూ ఆడిన అనుభవం ఉంది. SRH ఈ బరోడా యువకుడిని లక్ష్యంగా చేసుకోవచ్చు. ఆకాష్ రంజీ ట్రోఫీ 2024-25లో బరోడా తరపున నాలుగు ఇన్నింగ్స్‌లలో ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు. RTMతో ఆకాష్‌ను దక్కించుకుంటే అతడు దీర్ఘకాలికంగా జట్టుకు ఉపయోగపడతాడు.
- అబ్దుల్ సమద్: జమ్మూ & కాశ్మీర్‌కు చెందిన 23 ఏళ్ల పవర్ హిట్టర్ 2020లో అరంగేట్రం చేసినప్పటి నుండి SRHలో ఉన్నాడు. మునుపటి సీజన్‌లో మొత్తం 16 మ్యాచులు ఆడిన అబ్దుల్ సమద్ 168.51 స్ట్రైక్ రేట్‌తో 182 పరుగులు చేశాడు. కీలక సమయాల్లో రన్స్ ఎన్నో సార్లు జట్టును ఆదుకున్న సమద్ ను RTM ద్వారా లాక్ చేయడానికి SRH ప్రయత్నిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇప్పటి వరకు 50 మ్యాచ్‌లు ఆడిన సమద్ 146.1 స్ట్రైక్ రేట్‌తో 577 పరుగులు చేశాడు.
- సన్వీర్ సింగ్: బహుముఖ ఆల్ రౌండర్ 2023లో SRHలో చేరినప్పటి నుండి ఆరు గేమ్‌లు ఆడిన అతనికి కొన్ని మ్యాచుల్లో మాత్రమే ఆడే అవకాశం దక్కింది. పవర్ హిట్టర్, మీడియం-పేసర్‌గా మంచి ప్రొఫైల్‌ను కలిగి ఉండడంతో లోయర్-ఆర్డర్ లో హిట్టర్ పాత్ర పోషించడంతో పాటు బంతితో కూడా సత్తా చాటగలడు. SRH అతన్ని RTM ఎంపిక ద్వారా దక్కించుకునే అవకాశం ఉంది. సన్వీర్ సింగ్ 6 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 25 పరుగులు చేశాడు. పంజాబ్‌లో జన్మించిన 28 ఏళ్ల సన్వీర్ సింగ్ 30 మ్యాచ్‌ల్లో ఒక అర్ధసెంచరీ తో సహా 318 పరుగులు చేసి ఐదు వికెట్లు పడగొట్టాడు.
- ఉపేంద్ర సింగ్ యాదవ్: RTM కార్డు ఉపయోగించి వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ అయిన ఉపేంద్ర సింగ్ యాదవ్ SRH దక్కించుకునే అవకాశముంది. ఇతన్ని జట్టులోకి తీసుకురావడం ద్వారా హెన్రిచ్ క్లాసెన్‌కు బ్యాకప్ గా సెట్ చేయవచ్చు. ఉపేంద్ర ఐపీఎల్‌లో అరంగేట్రం చేయనప్పటికీ, టీ20 క్రికెట్‌లో అతని రికార్డు ఆశాజనకంగా ఉంది. 28 ఏళ్ల అతను 37 టీ20ల్లో 135.28 స్ట్రైక్ రేట్‌తో ఒక సెంచరీ, నాలుగు అర్ధసెంచరీలతో మొత్తం 947 పరుగులు చేశాడు. అతని అనుభవం, మంచి స్ట్రైక్ రేట్ తో స్కోర్ చేయగల సామర్థ్యం SRH బ్యాటింగ్ లైనప్‌కు మరింత బలాన్ని తీసుకువస్తుంది.