Virat Kohli: కోహ్లీ నయా ‘క్యాచ్ మాస్టర్’.. అజారుద్దీన్, పాంటింగ్ రికార్డులు బ్రేక్
India vs Australia, 1st Semi-Final: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన రికార్డ్ సృష్టించాడు. ఈ క్రమంలో అజారుద్దీన్, పాంటింగ్ రికార్డులను బ్రేక్ చేసేశాడు. కాగా, పాంటింగ్ ఈ రికార్డులో చేరేందుకు ఏకంగా 17 ఏళ్లు తీసుకున్నాడు.

India vs Australia, 1st Semi-Final: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న సెమీ ఫైనల్‌లో, ఇండియా టాస్ ఓడిపోయి ముందుగా బౌలింగ్ చేయాల్సి వచ్చింది. బ్యాటింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ సమయంలో వార్తల్లో నిలిచాడు. వన్డేల్లో ఫీల్డర్‌గా అతను భారీ రికార్డు సృష్టించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో భారత్ తరపున అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా కోహ్లీ నిలిచాడు. అతను మొహమ్మద్ అజారుద్దీన్ రికార్డును బద్దలు కొట్టాడు. అలాగే, పాంటింగ్ రికార్డును కూడా బ్రేక్ చేసేశాడు.
పాంటింగ్‌కు 17 ఏళ్లు పట్టిందిగా..
వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్ ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉన్నాడు. తన 375 వన్డే కెరీర్‌లో మొత్తం 160 క్యాచ్‌లు పట్టాడు. అదే సమయంలో, ఆస్ట్రేలియాతో జరుగుతోన్న సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతమైన ఫీల్డింగ్ చేయడం ద్వారా విరాట్ కోహ్లీ అజారుద్దీన్ రికార్డును బద్దలు కొట్టాడు. 1985-2000 మధ్య అజార్ 334 వన్డేలు ఆడి 156 క్యాచ్‌లు పట్టాడు.
ఈ ఫార్మాట్‌లో కోహ్లీ తన 161వ క్యాచ్‌తో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 160 క్యాచ్‌ల రికార్డును అధిగమించాడు. మహమ్మద్ షమీ బౌలింగ్‌లో లాంగ్-ఆన్‌లో నాథన్ ఎల్లిస్‌ను క్యాచ్ పట్టి ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్ ప్రారంభంలో, కోహ్లీ షార్ట్-కవర్‌లో క్యాచ్ తీసుకొని జోష్ ఇంగ్లిస్‌ను వెనక్కి పంపి పాంటింగ్ రికార్డును సమం చేశాడు.
అంతకుముందు పాకిస్థాన్‌తో జరిగిన టోర్నమెంట్‌లో, కోహ్లీ మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌ను అధిగమించి వన్డే క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత ఫీల్డర్‌గా రికార్డు సృష్టించాడు.
వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు (వికెట్ కీపర్లు కానివారు)..
మహేల జయవర్ధనే (శ్రీలంక) – 448 మ్యాచ్‌ల్లో 218 క్యాచ్‌లు
విరాట్ కోహ్లీ (భారతదేశం) – 301 మ్యాచ్‌ల్లో 161* క్యాచ్‌లు
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 375 మ్యాచ్‌ల్లో 160 క్యాచ్‌లు
మహ్మద్ అజారుద్దీన్ (భారత్) – 334 మ్యాచ్‌ల్లో 156 క్యాచ్‌లు
రాస్ టేలర్ (న్యూజిలాండ్) – 236 మ్యాచ్‌ల్లో 142 క్యాచ్‌లు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








