Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kohli – Rohit: ఒకే నెలలో ముగిసిన దిగ్గజాల టెస్ట్ కెరీర్‌.. రోహిత్ – విరాట్ స్థానాలను భర్తీ చేసేదెవరు?

దశాబ్దానికిపైగా టెస్ట్‌ క్రికెట్‌ను ఏలిన రోహిత్‌ - విరాట్‌.. ఆ ఫార్మాట్‌కి వీడ్కోలు పలికారు. దిగ్గజ ద్వయం రిటైర్మెంట్‌తో వాళ్ల స్థానాలను ఏ ప్లేయర్లతో భర్తీ చేయబోతున్నారు? ఇంగ్లండ్ సిరీస్‌లో వాళ్ల ఏ మేర రాణిస్తారు? ఇప్పుడిదే టాపిక్ స్పోర్ట్స్ సర్కిల్స్‌ని ఊపేస్తోంది.

Kohli - Rohit: ఒకే నెలలో ముగిసిన దిగ్గజాల టెస్ట్ కెరీర్‌.. రోహిత్ - విరాట్ స్థానాలను భర్తీ చేసేదెవరు?
Rohit Sharma - Virat Kohli
Follow us
Ram Naramaneni

|

Updated on: May 13, 2025 | 7:04 AM

ఒకరు హిట్ మ్యాన్‌..  మరొకరు రన్‌మెషిన్..  వీరకొట్టుడు.. నాటుకొట్టుడు.. దంచికొట్టుడుకి కేరాఫ్ అడ్రస్‌.. వీళ్లిద్దరూ ఆడుతుంటే అభిమానికి పండుగే..  అయితే.. ఉన్నట్టుండి రోజుల వ్యవధిలో ఇద్దరూ లాంగ్ ఫార్మాట్‌కి వీడ్కోలు పలికారు. ఈ అనూహ్య నిర్ణయం క్రికెట్ లవర్స్‌ని డిసప్పాయింట్ చేసింది.
దశాబ్దకాలంగా టీమిండియాకు మూలస్థంభాలుగా నిలిచారు రోహిత్, విరాట్‌. గతేడాది టీ20 ప్రపంచకప్‌ సాధించాక.. ముందుగా కొహ్లీ ఆ తర్వాత రోహిత్ పొట్టి ఫార్మాట్‌కి రిటైర్మెంట్ ప్రకటించారు. టెస్ట్‌ క్రికెట్ విషయంలోనూ వీళ్లిద్దరూ దాదాపు ఒకే సమయంలో వీడ్కోలు పలికారు. అయితే వీళ్లిద్దరి విషయంలో బీసీసీఐ భిన్నంగా ప్రవర్తించిందనే ఆరోపణలు వస్తున్నాయి.
సెలెక్టర్లతో సమావేశం తర్వాత రోహిత్ రిటైర్మెంట్‌ 
గత కొంతకాలంగా టెస్ట్ ఫార్మాట్‌లో విఫలమవుతున్న రోహిత్‌ .. ఈనెల 7న సెలక్టర్లతో సమావేశమయ్యాడు. ఆ తర్వాత హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఘోరంగా విఫలమైన రోహిత్‌.. ఐదో టెస్ట్‌లో స్వయంగా తప్పుకున్నాడు. ఇక భవిష్యత్ ప్రణాళికలో రోహిత్ లేడని బోర్డ్ చెప్పడంతో.. టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. రోహిత్‌ తర్వాత కొహ్లీ కూడా తన వీడ్కోలు నిర్ణయాన్ని ప్రకటించాడు. దీంతో డెసిషన్ వెనక్కి తీసుకోవాలని బీసీసీఐ ఒత్తిడి చేసిందని తెలుస్తోంది. కానీ కొహ్లీ మాత్రం ససేమిరా అన్నాడట. ఇద్దరు స్టార్ ప్లేయర్ల విషయంలో బీసీసీఐ భిన్నంగా ప్రవర్తించిందన్న ఆరోపణలు మిన్నంటుతున్నాయి. దిగ్గజాల టెస్ట్ కెరీర్ ఒకే నెలలో ముగియడంతో భారత అభిమానులు నిరాశలో మునిగిపోయారు.
ద్వయం లేని లోటు ఎవరితో భర్తీ చేస్తారు?
వచ్చే నెల 20 నుంచి ఇంగ్లండ్‌లో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. ఆ సిరీస్‌లో ఈ ద్వయం లేని లోటు ఏ ఆటగాళ్లతో భర్తీ చేస్తారనే చర్చ మొదలైంది. ఈ రేసులో పలువురు యంగ్‌స్టర్లు కనిపిస్తున్నారు. రెడ్‌బాల్‌ క్రికెట్‌లో సర్ఫరాజ్ అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నాడు. మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేయడానికి సర్పరాజ్‌ మంచి పోటీ ఇవ్వగలడు. ఇక జట్టు అవసరాల దృష్ట్యా కేఎల్ రాహుల్ ఏ స్థానంలోనైనా ఆడుతూ రాణిస్తున్నాడు. కొన్నిసార్లు ఓపెనర్‌గా మరికొన్నిసార్లు మిడిల్ ఆర్డర్‌లో.. ఇంకొన్ని సార్లు లోయర్ ఆర్డర్‌లో అదరగొడుతున్నాడు. కొహ్లీ రిటైర్మెంట్‌తో 4వ ప్లేస్‌లో ఆడటం దాదాపు ఖాయం కావొచ్చు. విరాట్ ప్లేస్‌ని శ్రేయస్‌ అయ్యర్‌తో భర్తీ చేస్తారనే టాక్ కూడా బాగా వినిపిస్తోంది. సాయి సుదర్శన్‌ ఐపీఎల్‌లో బాగా రాణిస్తున్నాడు. రోహిత్ – విరాట్ రిటైర్మెంట్‌తో సుదర్శన్ నిలకడ కారణంగా టీమ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. కౌంటి క్రికెట్ ఆడిన అనుభవం ఉండటంతో ఇంగ్లండ్ సిరీస్‌లో అతన్ని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విరాట్ – రోహిత్ ప్లేస్‌లోకి వచ్చే వాళ్ల పేర్లు చాలానే వినిపిస్తున్నా.. ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌లో వాళ్లెంత వరకు రాణిస్తారన్నది కీలకంగా మారింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..