AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ కొత్త షెడ్యూల్ వచ్చేసింది.. ఫైనల్ ఎప్పుడంటే..

భారతదేశం - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత కారణంగా మే 9న BCCI ఐపీఎల్‌ను ఒక వారం పాటు నిలిపివేసిన విషయం తెలిసిందే.. అంతకుముందు మే 8న పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ మధ్యలో ఆగిపోయింది. అయితే, ఇప్పుడు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ తర్వాత, మిగిలిన మ్యాచ్‌లకు బీసీసీఐ కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది.

IPL 2025: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ కొత్త షెడ్యూల్ వచ్చేసింది.. ఫైనల్ ఎప్పుడంటే..
Ipl 2025
Shaik Madar Saheb
|

Updated on: May 12, 2025 | 10:55 PM

Share

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఆగిపోయిన ఐపీఎల్‌ రీస్టార్ట్ కానుంది.. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో బీసీసీఐ కొత్త షెడ్యూల్‌ ను ప్రకటించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మే 17 నుండి మళ్లీ ప్రారంభమవుతుంది.. మొత్తం 17 మ్యాచ్‌లు 6 వేదికలలో జరుగుతాయి. ఇది కాకుండా, ఫైనల్ మ్యాచ్ జూన్ 3 న జరుగుతుంది.

TATA IPL 2025 మిగిలిన మ్యాచ్‌లు మే 17 నుండి ప్రారంభమై జూన్ 3న జరిగే ఫైనల్‌తో ముగిస్తాయి.. మొత్తం 17 మ్యాచ్‌లు 6 వేదికలలో జరుగుతాయి. సవరించిన షెడ్యూల్‌లో రెండు డబుల్-హెడర్‌లు ఉన్నాయి.. ఇవి రెండు ఆదివారాల్లో జరుగుతాయని.. BCCI ప్రకటించింది.

ప్లేఆఫ్‌లు ఈ క్రింది విధంగా షెడ్యూల్ చేయబడ్డాయి:

Qualifier 1 – May 29

Eliminator – May 30

Qualifier 2 – June 1

Final – June 3

ప్లేఆఫ్ మ్యాచ్‌ల వేదిక వివరాలను తరువాత దశలో ప్రకటిస్తామని బీసీసీఐ ప్రకటించింది.

పూర్తి షెడ్యూల్ ను ఇక్కడ చూడండి..

భారతదేశం – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత కారణంగా మే 9న BCCI ఐపీఎల్‌ను ఒక వారం పాటు నిలిపివేసిన విషయం తెలిసిందే.. అంతకుముందు మే 8న పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ మధ్యలో ఆగిపోయింది. అయితే, ఇప్పుడు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ తర్వాత, మిగిలిన మ్యాచ్‌లకు బీసీసీఐ కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది.