విరాట్ కోహ్లీ ఇకపై వన్డేలు ఆడడా? అలాంటి స్టేట్‌మెంట్‌ ఇచ్చాడేంటి భయ్యా.. కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్?

Virat Kohli Post Champions Trophy Statement: టీం ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న తర్వాత, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాల రిటైర్మెంట్ గురించి వార్తలు వచ్చాయి. కోహ్లీ తన రిటైర్మెంట్ గురించి స్పందిస్తూ, తాను తన అనుభవాన్ని తరువాతి తరం ఆటగాళ్ళతో పంచుకుంటానని, జట్టును మెరుగైన స్థితిలో ఉంచడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు. రోహిత్ శర్మ కూడా వన్డేల నుంచి రిటైర్ కావడం లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

విరాట్ కోహ్లీ ఇకపై వన్డేలు ఆడడా? అలాంటి స్టేట్‌మెంట్‌ ఇచ్చాడేంటి భయ్యా.. కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్?
Virat Kohli Retirement

Updated on: Mar 10, 2025 | 11:53 AM

Virat Kohli Retirement Champions Trophy: టీం ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్‌ను గెలుచుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌ను ఓడించి, మూడోసారి విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల రిటైర్మెంట్ గురించి చాలా చర్చ జరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఇప్పటికే టీ20ల నుంచి రిటైర్ అయ్యారు. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచిన తర్వాత, ఈ ముగ్గురు ఆటగాళ్ళు వన్డేల నుంచి కూడా రిటైర్ కావొచ్చు అనే ఊహాగానాలు చెలరేగాయి. ఎందుకంటే, తదుపరి ప్రపంచ కప్ 2027 లో ఉంది. అప్పటికి వీరి ఏజ్ ఇంకా పెరుగుతుంది. అయితే, ఈ ముగ్గురు ఆటగాళ్లు రిటైర్ కాలేదు.

వన్డే రిటైర్మెంట్ గురించి విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే..

ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచిన తర్వాత, విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ.. నేను వీలైనంత తరచుగా ఈ ఆటగాళ్లతో సంభాషించడానికి ప్రయత్నిస్తాను. నా అనుభవాలను పంచుకుంటాను. నేను ఇన్ని సంవత్సరాలు ఎలా ఆడగలిగాను. జట్టును విడిచిపెట్టినప్పుడు, మెరుగైన స్థితిలో ఉంచేందుకు నేను ప్రయత్నిస్తాను. రిటైర్మెంట్ చేసే సమయానికి రాబోయే 8-10 సంవత్సరాలు జట్టును ముందుకు తీసుకెళ్లగల జట్టు మనకు ఉండాలి. శుభ్‌మాన్ గిల్‌తో సహా ఈ ఆటగాళ్లకు జట్టును చాలా దూరం తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. ఈ ఆటగాళ్ళు ఇప్పటికే ఆ రకమైన బాధ్యతను తీసుకోవడం ప్రారంభించారు’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా వన్డేల నుంచి రిటైర్ కావడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. నేను ఈ ఫార్మాట్ నుంచి రిటైర్ కావడం లేదని రోహిత్ తెలిపాడు. తాను ఇంకా వన్డే ఫార్మాట్‌లో ఆడుతూనే ఉంటానని రోహిత్ తన ప్రకటనతో స్పష్టం చేశాడు. హిట్‌మ్యాన్ ఈ ప్రకటనతో భారత అభిమానులు సంతోషించడం ఖాయం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..