IND VS WI: మరోసారి విఫలమైన విరాట్ కోహ్లీ.. స్పెషల్ మ్యాచులోనూ ఆకట్టుకోలే..!

Virat Kohl: వెస్టిండీస్‌తో జరుగుతోన్న రెండో వన్డేలో విరాట్ కోహ్లీ కేవలం 18 పరుగులకే ఔటయ్యాడు. మరోసారి పేలవ ఫాంతో నిరాశపరిచాడు.

IND VS WI: మరోసారి విఫలమైన విరాట్ కోహ్లీ.. స్పెషల్ మ్యాచులోనూ ఆకట్టుకోలే..!
India Vs West Indies 2nd Odi Virat Kohli
Follow us
Venkata Chari

|

Updated on: Feb 09, 2022 | 4:13 PM

విరాట్ కోహ్లీ (Virat Kohli) కెప్టెన్సీని వదులుకోవడంతో మంచి రోజులు వస్తున్నాయని అంతా అనుకున్నారు. రెండేళ్లుగా అంతర్జాతీయ సెంచరీ చేయలేని విరాట్ కోహ్లి.. వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో కనీసం ఓ సెంచరీ అయినా సాధిస్తాడని భావించారు. కానీ, సిరీస్‌లోని రెండు వన్డేల్లోనూ అది జరగలేదు. అహ్మదాబాద్‌లో జరిగిన రెండో వన్డే (India vs West Indies, 2nd ODI) లో కూడా విరాట్ కోహ్లీ(Virat Kohli Flop Show) బ్యాట్ మౌనంగా ఉండిపోయింది. 30 బంతుల్లో కేవలం 18 పరుగులు చేసి ఔటయ్యాడు. తొలి వన్డేలోనూ విరాట్ కోహ్లి 8 పరుగులు మాత్రమే చేయగలిగడంతో కోహ్లీ ఇన్నింగ్స్ 4 బంతుల్లోనే ముగిసింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. తొలి వన్డే మాదిరిగానే రెండో మ్యాచ్‌లోనూ విరాట్‌ కోహ్లి చాలా చిన్న షాట్‌కు పెవిలియన్‌ చేరాడు.

రెండో వన్డేలో ఓడిన్ స్మిత్ విరాట్ కోహ్లీ వికెట్ తీశాడు. ఈ రైట్ ఆర్మ్ మీడియం పేసర్ మొదట కోహ్లికి షార్ట్ డెలివరీని సంధించాడు. ఆపై వెంటనే ఐదవ స్టంప్‌పై డ్రైవ్ డెలివరీ విసిరాడు. విరాట్ కోహ్లి ఈ బంతిని ఆడేందుకు ట్రై చేసి వికెట్ కీపర్ షాయ్ హోప్‌కి క్యాచ్ ఇచ్చాడు. విరాట్ కోహ్లి ఔట్ కాగానే.. పెవిలియన్‌కు తిరిగి వస్తున్న సమయంలో తనను తాను తిట్టుకోవడం కనిపించింది. విరాట్ కోహ్లి చాలా నిరాశగా కనిపించాడు. ఇలాంటి చిన్న చిన్న షాట్లు ఆడి ఔట్ కావడంతో అసహనానికి గురయ్యాడు.

100వ వన్డే మ్యాచ్‌లోనూ మాయ చేయని విరాట్.. విరాట్ కోహ్లీ బుధవారం మైదానంలోకి దిగిన వెంటనే టీమిండియా తరపున 100 వన్డేలు ఆడిన ఐదవ భారత ఆటగాడిగా నిలిచాడు. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, మహమ్మద్ అజారుద్దీన్, యువరాజ్ సింగ్ కూడా భారత్‌లో 100 వన్డేలు ఆడారు. ఇది వన్డేల్లో విరాట్ కోహ్లీకి 250వ ఇన్నింగ్స్. ఈ క్రమంలో 12 వేలకు పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. విరాట్ కోహ్లీ 250 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 58.35 సగటుతో 12,311 పరుగులు చేశాడు. గత రెండేళ్లలో కోహ్లీ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం ఈ సిరీస్‌లోని రెండు మ్యాచ్‌ల్లోనూ విరాట్ కోహ్లీ అదే పేలవ ఫాంతో తంటాలు పడుతున్నాడు. మరి కోహ్లీ ఎప్పుడు ఫాంలోకి వచ్చి అభిమానులను ఆకట్టుకుంటాడో చూడాలి.

Also Read: IND vs WI: రెండో వన్డేలో బెడిసికొట్టిన టీమిండియా ప్రయోగం.. అదేంటంటే?

IPL 2022: జట్టు పేరు ప్రకటించిన అహ్మదాబాద్.. హార్దిక్ పాండ్యా టీం ఏ పేరుతో బరిలోకి దిగనుందంటే?

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే