IND vs WI: రెండో వన్డేలో తడబడిన టీమిండియా.. విండీస్ టార్గెట్ 238
Ind vs WI 2nd ODI: రెండో వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. దీంతో విండీస్(West Indies) ముందు 238 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.
Ind vs WI 2nd ODI: రెండో వన్డేలో టీమిండియా (Team India) బ్యాటింగ్‌లో విఫలమైంది. విండీస్ బౌలర్ల ముందు భారత ఆటగాళ్లు తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యారు. దీంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. దీంతో విండీస్ (West Indies) ముందు 238 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. భారత బ్యాట్స్‌మెన్స్‌లో సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav) ఒక్కడే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మూడు వన్డేలో సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో ఘన విజయం సాధించిన టీమిండియా, రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్ సాధించాలని భావించింది. కానీ, రెండో వన్డేలో పుంజుకున్న వెస్టిండీస్ బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్స్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేశారు.
టీమిండియా బ్యాట్స్‌మెన్స్‌లో రోహిత్ శర్మ 5, రిషబ్ పంత్ 18, విరాట్ కోహ్లీ 18, కేఎల్ రాహుల్ 49, సూర్యకుమార్ యాదవ్ 64, వాషింగ్టన్ సుందర్ 24, దీపక్ హుడా 29, శార్దుల్ ఠాకూర్ 8, మహ్మద్ సిరాజ్ 3, చాహల్ 11 నాటౌట్, ప్రసీద్ధ్ 0 పరుగులు చేశారు. సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ ఇద్దరూ కలిసి అర్థసెంచరీ భాగస్వామ్యంతో ఆకట్టుకోవడంతో భారత్ ఈ మాత్రమైనా స్కోర్ చేయగలిగింది.
రెండో వన్టేలో విండీస్ బౌలర్లు ఆకట్టుకున్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ నిర్ణయం సరైనదేనంటూ నిరూపించారు. జోసఫ్, ఓడెన్ స్మిత్ తలో 2 వికెట్లు, హోల్డర్, కెమర్ రోచ్, అకేల్ హోసేన్, ఫాబియన్ అలెన్ తలో వికెట్ పడగొట్టారు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసీద్ధ్ కృష్ణ.
వెస్టిండీస్: నికోలస్ పూరన్ (కెప్టెన్), షాయ్ హోప్ (కీపర్), బ్రెండన్ కింగ్, డారెన్ బ్రావో, శర్మ బ్రూక్స్, జాసన్ హోల్డర్, ఓడెన్ స్మిత్, ఫాబియన్ అలెన్, అకిల్ హొస్సేన్, అల్జారీ జోసెఫ్, కీమర్ రోచ్.
Also Read: IND VS WI: మరోసారి విఫలమైన విరాట్ కోహ్లీ.. స్పెషల్ మ్యాచులోనూ ఆకట్టుకోలే..!
IND vs WI: రెండో వన్డేలో బెడిసికొట్టిన టీమిండియా ప్రయోగం.. అదేంటంటే?