Ambati Rayudu: కోహ్లీపై విమర్శలు.. అంబటి రాయుడి భార్యా, పిల్లలకు హత్యాచార బెదిరింపులు

|

May 30, 2024 | 3:05 PM

ఆరెంజ్ క్యాప్ గెలిచినంత మాత్రానా ఐపీఎల్ టైటిల్ గెలవలేరు అంటూ కోహ్లీని టార్గెట్ చేసి మాట్లాడడం తీవ్ర చర్చనీయాంశమైంది. అంతకు ముందు చెన్నై సూపర్ కింగ్స్ పై ఆర్సీబీ విజయం సాధించినప్పుడు బెంగళూరు టీమ్ ను విమర్శిస్తూ సోషల్ మీడియాలోనూ ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో రాయుడి కామెంట్స్‌పై కింగ్ కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్ మీద ఉన్నారు

Ambati Rayudu: కోహ్లీపై విమర్శలు.. అంబటి రాయుడి భార్యా, పిల్లలకు హత్యాచార బెదిరింపులు
Ambati Rayudu Family
Follow us on

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గత కొన్ని రోజులుగా ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. ముఖ్యంగా టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌ లపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నాడు. ఆరెంజ్ క్యాప్ గెలిచినంత మాత్రానా ఐపీఎల్ టైటిల్ గెలవలేరు అంటూ కోహ్లీని టార్గెట్ చేసి మాట్లాడడం తీవ్ర చర్చనీయాంశమైంది. అంతకు ముందు చెన్నై సూపర్ కింగ్స్ పై ఆర్సీబీ విజయం సాధించినప్పుడు బెంగళూరు టీమ్ ను విమర్శిస్తూ సోషల్ మీడియాలోనూ ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో రాయుడి కామెంట్స్‌పై కింగ్ కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్ మీద ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా అతనిని భారీగా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడీ ట్రోలింగ్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లింది. రాయుడినే కాకుండా అతని భార్య, పిల్లలను టార్గెట్ చేశారు కొందరు ఆకతాయిలు. హత్యాచారం చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీనికి సంబంధించి రాయుడు స్నేహితుడు సామ్ పాల్ సంచలన విషయాలను బయట పెట్టాడు. ‘కోహ్లీపై రాయుడు చేసిన వ్యాఖ్యలకు గాను.. కొంత మంది ఆర్సీబీ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. అతని కుటుంబంపై దాడి చేయాలని శత విధాలా ప్రయత్నిస్తున్నారు. కొందరైతే రాయుడు భార్య, పిల్లలపై లైంగిక దాడి చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు’ అని చెప్పుకొచ్చాడు రాయుడు స్నేహితుడు

పోలీసులు జోక్యం చేసుకోవాలి. .

కాగా రాయుడి విషయంలో కోహ్లీ ఫ్యాన్స్ శ్రుతి మించి ప్రవర్తిస్తున్నారని రాయుడు స్నేహితుడు మండిపడ్డాడు. ‘ప్రతి వ్యక్తికి రాజ్యంగం కొన్ని హక్కులు కల్పిస్తుంది. కానీ వాటిని కొంత మంది కాలరాస్తున్నారు. ఈ విషయంపై పోలీసులు, న్యాయవ్యవస్థ కలగజేసుకోవాలి. రాయుడి ఫ్యామిలీపై బెదిరింపులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి’ అని కోరారు సామ్ పాల్. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. క్రికెట్ లో ఒకరిని మరొకరు విమర్శించడం సాధారణమేనని, అంత మాత్రాన కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి బెదిరించడ సరికాదంటున్నారు క్రికెట్ అభిమానులు. రాయుడికి అండగా ఉంటామని సపోర్టు చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..