Virat Kohli: ఐపీఎల్‌లో కోహ్లీ కమాల్‌.. ఖాతాలో చేరిన మరో అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా..

ఐపీఎల్‌ 2023 విరాట్‌ కోహ్లీ సూపర్బ్‌ ఫామ్‌ కొనసాగుతోంది. తాజాగా చిన్నస్వామి స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 37 బంతుల్లోనే 6 ఫోర్లతో 54 పరుగులు చేశాడు. ఈ హాఫ్‌ సెంచరీతో ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు కోహ్లీ. అదేంటంటే..చిన్నస్వామి స్టేడియంలో 3000 పరుగులు పూర్తి చేసిన..

Virat Kohli: ఐపీఎల్‌లో కోహ్లీ కమాల్‌.. ఖాతాలో చేరిన మరో అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే  తొలి  క్రికెటర్‌గా..
Virat Kohli
Follow us
Basha Shek

|

Updated on: Apr 27, 2023 | 10:33 AM

ఐపీఎల్‌ 2023 విరాట్‌ కోహ్లీ సూపర్బ్‌ ఫామ్‌ కొనసాగుతోంది. తాజాగా చిన్నస్వామి స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 37 బంతుల్లోనే 6 ఫోర్లతో 54 పరుగులు చేశాడు. ఈ హాఫ్‌ సెంచరీతో ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు కోహ్లీ. అదేంటంటే..చిన్నస్వామి స్టేడియంలో 3000 పరుగులు పూర్తి చేశాడు మన రన్‌మెషిన్‌. అది కూడా కేవలం టీ20 మ్యాచ్‌ల ద్వారానే కావడం విశేషం.ఈ క్రమంలో ఒకే మైదానంలో టీ20 క్రికెట్‌లో 3000 పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఆర్సీబీ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఈ ప్రపంచ రికార్డు నమోదు కావడం కూడా విశేషం. దీంతో పాటు మరో రికార్డును కూడా అందుకున్నాడు విరాట్‌. ఐపీఎల్‌లో కేకేఆర్‌పై అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు. కేకేఆర్‌పై ఇప్పటివరకు విరాట్‌ 858 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో డేవిడ్‌ వార్నర్‌ 1075 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. 1040 రన్స్‌తో రోహిత్‌ శర్మ రెండో స్థానంలో, 850 పరుగులతో శిఖర్‌ ధావన్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. ఆర్సీబీ టాస్ గెలిచి ముందు బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు జేసన్ రాయ్ (56), కెప్టెన్‌ నితీశ్‌ రాణా (48) రాణించడంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. 201 పరుగుల భారీ స్కోరును ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీలో విరాట్ కోహ్లీ (56) తప్ప మరెవరూ రాణించలేదు. అందరూ ఇలా వచ్చి అలా పెవిలియన్‌ వెళ్లిపోయారు. కోల్‌కతా బౌలర్ల ధాటికి ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు మాత్రమే చేసి 21 రన్స్‌ తేడాతో పరాజయం పాలైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..