IPL 2023: ‘కోహ్లీ టీం ఓడిపోవడానికి కారణం అదే’.. 16 బంతుల్లో 43 పరుగులు కోల్పోయింది..
నాలుగు వరుస ఓటములతో సతమతమవుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్‌కు అదృష్టం వరించింది. బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో..
నాలుగు వరుస ఓటములతో సతమతమవుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్‌కు అదృష్టం వరించింది. బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. మధ్య ఓవర్లలో కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా కేవలం 21 బంతుల్లో 48 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. రాణా, వెంకటేష్ అయ్యర్, జాసన్ రాయ్ ఇన్నింగ్స్‌లతో కోల్‌కతా జట్టు స్కోర్ నిర్ణీత ఓవర్లకు 200 పరుగులకు చేరింది. ఇక్కడ ఓ ఆసక్తికరమైన విషయమేంటంటే.. బెంగళూరు ఫీల్డర్లు చిన్న చిన్న తప్పిదాల కారణంగా నితీష్ రాణా తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయారు.
10 ఓవర్లు ముగిసే సమయానికి కోల్‌కతా రెండు వికెట్లు కోల్పోయింది, ఆపై నితీష్ రాణా బరిలోకి దిగాడు. అంచనాలకు తగ్గట్టుగా కేకేఆర్ కెప్టెన్ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. దీనికి కారణంగా ఆర్సీబీ ఫీల్డింగ్‌లో కొన్ని పొరపాట్లు జరగడమే.. మొదటిగా నితీష్ రాణా వ్యక్తిగత స్కోర్ 5 పరుగులు ఉన్నప్పుడు.. విజయ్‌కుమార్ వైశాక్ బౌలింగ్‌లో లాంగ్ ఆఫ్ వద్ద సిరాజ్ సింపుల్ క్యాచ్ వదిలేశాడు. ఆ తర్వాత రెండోది సిరాజ్ బౌలింగ్‌లో హర్షల్ పటేల్ డీప్ స్క్వేర్ లెగ్ వద్ద సులువైన క్యాచ్‌ను పట్టలేకపోయాడు. అప్పటికి నితీష్ స్కోరు 19 పరుగులు మాత్రమే.
ఆర్సీబీ ఫీల్డర్స్ చేసిన ఈ రెండు తప్పిదాలను నితీష్ రాణా సద్వినియోగం చేసుకున్నాడు. ఆ తర్వాత హర్షల్ పటేల్ బౌలింగ్‌లో నితీష్ వరుసగా మూడు బౌండరీలు బాదాడు. మొత్తంగా 21 బంతుల్లో 48 పరుగులు చేశాడు నితీష్ రాణా. ఇలా తొలిసారి క్యాచ్ మిస్ కావడంతో ఆర్సీబీ ఆ తర్వాత 16 బంతుల్లో నితీశ్‌కు 43 పరుగులు సమర్పించి.. ఓటమిని చవి చూసింది.
Nitish is scoring Run Rana Run ?@KKRiders‘ skipper goes ? back-to-back ?#RCBvKKR #TATAIPL #IPLonJioCinema #IPL2023 pic.twitter.com/I3fNVedeSr
— JioCinema (@JioCinema) April 26, 2023